nagidream
రూపాయి రూపాయి దాచుకుని ఒక ఫ్లాట్ లేదా ఇల్లు కొనుక్కుంటారు. ఐతే బిల్డర్ కక్కుర్తి వల్ల ఇంట్లో అడుగుపెట్టిన తొలినాళ్ళకే రిపేర్లు, డ్యామేజీలు అయితే చాలా బాధగా ఉంటుంది. బిల్డర్ ని అడిగితే రెస్పాండ్ అవ్వరు. అలా అవ్వకపోతే నష్టపరిహారం పొందవచ్చు. పైసా ఖర్చు లేకుండా బిల్డర్ తోనే డ్యామేజీలను రిపేర్ చేయించవచ్చు. దీని కోసం మీరు ఈ కొత్త రూల్ ని తెలుసుకోవాలి.
రూపాయి రూపాయి దాచుకుని ఒక ఫ్లాట్ లేదా ఇల్లు కొనుక్కుంటారు. ఐతే బిల్డర్ కక్కుర్తి వల్ల ఇంట్లో అడుగుపెట్టిన తొలినాళ్ళకే రిపేర్లు, డ్యామేజీలు అయితే చాలా బాధగా ఉంటుంది. బిల్డర్ ని అడిగితే రెస్పాండ్ అవ్వరు. అలా అవ్వకపోతే నష్టపరిహారం పొందవచ్చు. పైసా ఖర్చు లేకుండా బిల్డర్ తోనే డ్యామేజీలను రిపేర్ చేయించవచ్చు. దీని కోసం మీరు ఈ కొత్త రూల్ ని తెలుసుకోవాలి.
nagidream
ఎంతో కష్టపడి పోగేసిన డబ్బుతో సొంతింటి కలను నిజం చేసుకుని.. ఆ ఇంట్లో అడుగుపెట్టాక పగుళ్లు, ఇతర లోపాలు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కొత్త ఇంట్లో అడుగుపెట్టాక రిపేర్లు చేయించాలంటే కష్టంతో కూడుకున్న పని.. పైగా అదనపు ఖర్చు భారం కూడా. బిజీ లైఫ్ లో ఆఫీసులకి సెలవు పెట్టి ఇంటి నిర్మాణ పనులు చూసుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. పైగా ఇల్లు కట్టాలంటే డబ్బులుండాలి. ఆఫీసుకి సెలవు పెడితే ఆ డబ్బు ఎలా వస్తుంది. అందుకే చాలా మంది బిల్డర్లకు అప్పజెప్పేస్తున్నారు. కానీ కొంతమంది డబ్బుకు కక్కుర్తి పడి నాణ్యత లేకుండా బిల్డింగ్స్ ని కడుతున్నారు. దీని వల్ల అప్పుడే కట్టిన ఇళ్ళు కూడా బీటలు పడడం.. రిపేర్లు ఉండడం వంటివి జరుగుతున్నాయి. తీరా బిల్డర్ కస్టమర్ కి ఇల్లు అప్పజెప్పిన తర్వాత నాకు సంబంధం లేదు పో అంటున్నాడు. ఇలాంటివి గతంలో చాలా జరిగాయి. బిల్డర్ కట్టిన ఫ్లాట్ లు కొన్నా ఇదే పరిస్థితి. దీంతో ఇంటికి లక్షలు ఖర్చుపెట్టిన కస్టమర్లు బాధపడుతున్నారు.
ఈ బాధని అర్థం చేసుకునే.. రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) యాక్ట్ 2016ని తీసుకొచ్చారు. ఈ రెరా యాక్ట్ 2016 రాక ముందు వరకూ కూడా.. బిల్డర్స్ ని ఒప్పించి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కస్టమర్లకు మార్గం ఉండేది కాదు. ఈ చట్టం రావడంతో దీనికొక పరిష్కారం లభించింది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా హోమ్ వారంటీని అందుబాటులోకి తెచ్చారు. మొదట రెండేళ్లు ఉన్న ఈ వారంటీని ఆ తర్వాత 5 ఏళ్లకు పొడిగించారు. కస్టమర్ల పట్ల బిల్డర్లు, డెవలపర్లు జవాబుదారీతనంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ హోమ్ వారంటీని తీసుకొచ్చారు.
రియల్ ఎస్టేట్ చట్టంలోని క్లాజ్ 14 (3) ప్రకారం.. ఒక కస్టమర్ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి 5 ఏళ్ల వరకూ ఏదైనా లోపాలు, డ్యామేజ్ లు ఉంటే ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకుండా బిల్డర్ లేదా డెవలపరే రిపేర్ చేయించాలి. అంటే 5 ఏళ్ల వరకూ ఇంటికి సంబంధించిన పగుళ్లు లేదా ఇతర డ్యామేజిలు ఏవైనా ఉంటే రిపేర్ చేయించడానికి కట్టించిన బిల్డర్ లేదా డెవలపర్స్ బాధ్యత వహిస్తారు. అంతేకాదు.. సమస్యను బిల్డర్ లేదా డెవలపర్ దృష్టికి తీసుకెళ్లిన 30 రోజుల్లోపు పరిష్కరించాలి. లేదంటే బాధితుడికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చాలా మంది డెవలపర్లు తమ ఒప్పందాల్లో రిపేర్ల వ్యవధిని రెండు సంవత్సరాల కంటే తక్కువగా ఉంచేవారు. అయితే కొత్త నిబంధనను అమలు చేయడంతో ఇంటిపై ఐదేళ్ల వారంటీ పాలసీ వచ్చింది.
నిర్మాణ లోపాలు అంటే బిల్డింగ్ లో లోపం ఉన్నా.. ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తి అభిరుచికి తగ్గట్టు లేకుండా నిర్మాణంలో లోపం ఉన్నా హోమ్ వారంటీ వర్తిస్తుంది. డిజైన్ లోపం, నాణ్యత లేని నిర్మాణం, నాణ్యత లేని మెటీరియల్స్ వాడడం, ప్లానింగ్ సరిగా లేకపోవడం వంటివి హోమ్ వారంటీ కింద కవర్ అవుతాయి. నిర్మాణంలో లోపం కారణంగా లీకేజ్, తేమకు కారణమవుతుంది. దీని వల్ల పునాదిలో పగుళ్లు, ప్లంబింగ్ సమస్యలు, ఎలక్ట్రికల్, మెకానికల్ సమస్యలు తలెత్తుతాయి. రెరా హోమ్ వారంటీ క్లాజ్ కింద ఈ సమస్యలన్నీ కవర్ అవుతాయి.
ఇల్లు కొనే ముందు డెవలపర్ లేదా బిల్డర్ దగ్గర ఉన్న ఒప్పంద పత్రాలను సరిచూసుకోండి. రెరా యాక్ట్ కింద వచ్చే ఈ హోమ్ వారంటీ ప్రయోజనాలను ఐదేళ్ల పాటు ఉచితంగా పొందండి. ఈ కథనాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ లో షేర్ చేయండి.