Dharani
హెమ్‌లోన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా ఎంతో కొంత డౌన్‌పేమెంట కడతారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారా.. అయితే ఒక్కసారి ఇది చదివి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకొండి. డౌన్‌పేమెంట్ కట్టే డబ్బులతో మీరు ఈఎంఐ చెల్లించవచ్చు. ఎలా అంటే..
హెమ్‌లోన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా ఎంతో కొంత డౌన్‌పేమెంట కడతారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారా.. అయితే ఒక్కసారి ఇది చదివి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకొండి. డౌన్‌పేమెంట్ కట్టే డబ్బులతో మీరు ఈఎంఐ చెల్లించవచ్చు. ఎలా అంటే..
Dharani
నేటి కాలంలో ఇంటి నిర్మాణం పూర్తి కావాలంటే తక్కువలో తక్కువ కనీసం 30 లక్షల రూపాయాలైనా కావాల్సిందే. అంత మొత్తం సామాన్యుల దగ్గర ఉండాలంటే చాలా కష్టం. అందుకే చాలా మంది హోమ్ లోన్ తీసుకుని ఇంటి నిర్మాణం ప్రారంభింస్తారు. అయితే హోమ్ లోన్ తీసుకునే ముందు ఎంతో కొంత డౌన్ పేమెంట్ చేస్తారు. అయితే ఇక్కడే కాస్త స్మార్ట్‌గా ఆలోచిస్తే డౌన్ పేమెంట్ డబ్బులతో కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. దీని వల్ల బ్యాంకు వడ్డీ కవర్ అవుతుంది. మీ మీద హోమ్ లోన్ భారం అనేది ఉండదు. మరి అది ఎలానో తెలియాలంటే ఇది చదవండి.
ఉదాహరణకు మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకుందాం. ఇల్లు కొనాలంటే 30 లక్షలు అవుతుంది అనుకుంటే.. 20 లక్షలు బ్యాంకు లోన్ పెట్టుకోవాలి. అయితే మీరు మీ దగ్గరున్న 10 లక్షలను బయట 2 రూపాయల వడ్డీకి ఇచ్చుకుంటే నెలకు 20 వేలు వస్తాయి. 10 లక్షలు ఒకే వ్యక్తికి కాకపోయినా ఒక నలుగురికి రెండున్నర లక్షల చొప్పున ఇస్తే రిస్క్ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా భూమి, ఇల్లు వంటి ఆస్తి కాగితాలను మీ దగ్గర పెట్టుకుని అప్పు ఇస్తే మీ డబ్బు ఎక్కడకీ పోదు. లేదంటే ఈ మధ్య మనుషులు చాలా దారుణంగా ఉంటున్నారు. అప్పు ఇస్తే తిరిగి ఇచ్చినవాళ్ల మీదే రివర్స్ అవుతున్నారు. కాబట్టి బాగా నమ్మకం ఉన్న వాళ్లకే ఇవ్వడం మంచిది.
అలా మీ 10 లక్షలను అప్పుగా ఇస్తే దాన్నుంచి మీరు నెల నెలా 20 వేలు సంపాదించుకోవచ్చు. ఈ డబ్బుతో, అలానే మీకొచ్చే జీతంతో హోమ్ లోన్ కి అప్లై చేస్తే మీ 10 లక్షలు అలానే ఉంటాయి. దాని మీద వచ్చే వడ్డీతో బ్యాంకు హోమ్ లోన్ ఈఎంఐ కట్టుకోవచ్చు. ఉదాహరణకు 30 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే 9 శాతం వార్షిక వడ్డీతో 20 ఏళ్ళు లోన్ పీరియడ్ ఉంటే గనుక నెలకు ఈఎంఐ 26 వేలు అవుతుంది. మీకు ఆల్రెడీ నెలకు వడ్డీగా 20 వేలు వస్తున్నాయి. ఇంకో 6 వేలు అదనంగా కలిపితే హోమ్ లోన్ ఈఎంఐ కట్టుకోవచ్చు. ఎటువంటి భారం లేకుండా మీరు హోమ్ లోన్ ఈఎంఐ క్లియర్ చేయగలుగుతారు. అయితే నెల నెల వడ్డీ సరిగా ఇచ్చే వారికే మీ డబ్బులు ఇంట్రెస్ట్‌కి ఇవ్వాలనే విషయం మర్చిపోవద్దు.
ఒకవేళ మీరు అప్పు ఇచ్చిన వ్యక్తులు కనుక వడ్డీ ఎగ్గొట్టినా, అసలు ఎగ్గొట్టినా ఆల్రెడీ వారి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి సమస్య ఉండదు. వాటిని అమ్మి మీ డబ్బు రికవరీ చేసుకోవచ్చు. మీ దగ్గర 5 లక్షలున్నా, 10 లక్షలు.. ఇలా ఎంతున్నా సరే.. ఇలా నమ్మకమైన వారికి వడ్డీకి ఇవ్వడం వల్ల.. మీ మీద హోమ్ లోన్ భారం అనేది పడదు. ఈ విధంగా చేసే వారు చాలా మంది ఉన్నారు. డెడ్ ఇన్వెస్ట్ మెంట్ చేయకుండా చాలా మంది ఇలా తమ దగ్గరున్న డబ్బుతో మరింత డబ్బుని సృష్టించుకుంటున్నారు. చాలా మంది ఇలా ఎదిగిన వారే. మరి ఈ ఐడియా మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.