Dharani
మీరు హోం లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా.. అయితే మహిళల పేరు మీద లోన్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు..
మీరు హోం లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా.. అయితే మహిళల పేరు మీద లోన్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు..
Dharani
ప్రతి మనిషికి ఉండే ముఖ్యమైన కోరికల్లో ముందు వరుసలో ఉండేది సొంతింటి నిర్మాణం. తాను చనిపోయే లోపు తన కంటూ సొంతంగా ఓ ఇల్లు ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సామన్యులు, పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. అదలా ఉంచితే నేటి కాలంలో సొంతింటి నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నగరాల్లో అయితే మరీ ఎక్కువ. సుమారు అర కోటి రూపాయలు పెట్టంది సొంత ఇల్లు రాదు. ఇక స్థలం కొని ఇల్లు కట్టాలంటే కోట్లు ఖర్చు చేయాలి. అంత మొత్తం మన దగ్గర ఉండదు. అందుకే చాలా మంది లోన్ తీసుకుని సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. పురుషులతో పోలిస్తే.. మహిళల పేరు మీద మరింత తక్కువ వడ్డీ రేటుకే హోం లోన్ ఇస్తున్నాయి చాలా బ్యాంకులు. ఆ వివరాలు..
సొంతింటి కల సాకారంలో మహిళలే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఓ సర్వే వెల్లడించింది. మార్చి 2024లో అనరాక్ చేసిన సర్వే ప్రకారం, 60శాతం మంది మహిళలు ఇప్పుడు సొంత ఇంటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడయ్యింది. హోమ్ లోన్ తీసుకునే మహిళలు తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ, ఆ కొద్ది మంది కూడా క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తారని, వారి ఆర్థిక బాధ్యతలకు బాధ్యత వహిస్తారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. బ్యాంకులు జాబ్‌లు చేసే మహిళల కోసం తక్కువ వడ్డీ రేటుతో పాటు అనేక ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి.
హోమ్ లోన్ తీసుకునే సమయంలో మహిళలను తమ సహదరఖాస్తుదారుగా నమోదు చేసుకుంటే మెరుగైన ఎల్టీవీ (లోన్ టు వాల్యూ) కి అర్హులవుతారని నిపుణులు చెబుతున్నారు. దీని వలన తక్కువ డౌన్ పేమెంట్ సౌలభ్యం కలుగుతుంది. వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. సెక్షన్ 80సీ కింద చెల్లించిన ప్రిన్సిపాల్ మొత్తంపై రూ. 1.5 లక్షల వరకు, చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు ఆదాయపు పన్ను బెనిఫిట్‌గా క్లెయిమ్ చేయవచ్చు. అలానే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.
అయితే హోం లోన్ తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తుల పాటించాలి. లోన్ ఈఎంఐ సుదీర్ఘ కాలం ఉంటే.. అయితే మీరు మీ బ్యాంకుకు ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అలానే హోం లోన్ తీసుకునే సమయంలో భారీ మొత్తం డౌన్ పేమెంట్ చేయడం తెలివైన నిర్ణయం. దీనివల్ల వడ్డీభారం తగ్గుతుంది. అలానే ఎంత చిన్నమొత్తంలోనైనా ముందస్తు చెల్లింపులు చేయడం మంచిది. లోన్‌ను ముందస్తుగా తీరుస్తున్నందుకు తక్కువ వడ్డీ భారం పడే అవకాశం ఉంది. కొన్ని సంస్థలు ఆటో ప్రీపే, ఆటో డెబిట్ సౌకర్యాలను కూడా అందిస్తున్నాయి. వాటిని వాడుకోవాలి. మీరు నెలవారీగా సెట్ చేసిన మొత్తం చెల్లించిన తర్వాత, మీ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీ ఖాతా నుంచి రూ.1000 లాంటి చిన్న మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు వీలు కల్పించే సర్వీస్ ఇది. ఈ చిన్న మొత్తమే మీరు లక్షలను ఆదా చేయడంలో సహాయపడవచ్చు.
ఉదాహరణకు.. మీరు 20 సంవత్సరాలకు 10శాతం వడ్డీ రేటుతో రూ.10,00,000 లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఈఎంఐని లెక్కించడానికి ఫార్ములా పీ × ఆర్ × (1 + ఆర్)ఎన్/((1 + ఆర్)ఎన్–1). ఈ లెక్క ప్రకారం మీరు ప్రతి నెలా ఈఎంఐ కోసం రూ.9,650 చెల్లించాలి. ఇందులో అసలు రూ.1,317 కాగా, మిగిలిన మొత్తం రూ. 8,333 వడ్డీ అవుతుంది. నెలలు గడిచేకొద్దీ ఈఎంఐ అలాగే ఉంటుంది. మీరు మీ అసలు కంటే ఎక్కువగా తిరిగి చెల్లించే కొద్దీ వడ్డీ తగ్గుతుంది. ఆమె ప్రతి నెల రూ.1000 ప్రీపేమెంట్‌ని ఏంచుకుంటే, మీరు లోన్‌ను 184 నెలల్లో తీర్చగలుగుతుంది. దీనివల్ల రూ.3,58,494 వడ్డీ ఆదా అవుతుంది.