iDreamPost
android-app
ios-app

ఫుడ్ వేస్ట్ డిస్పోజర్: ఇదుంటే నెల నెలా చెత్తకి డబ్బులివ్వక్కర్లేదు!

  • Published Aug 21, 2024 | 6:31 AM Updated Updated Aug 21, 2024 | 7:06 AM

Food Waste Disposer Machine: సింకు డ్రైన్ పైపుల్లో చెత్త బ్లాక్ అయిపోతుందా? ఇంట్లో ఫుడ్ వేస్ట్ పేరుకుపోయి దుర్వాసన వస్తుందా? అయితే ఈ రెండిటికీ సొల్యుషనే ఈ ఫుడ్ వేస్ట్ డిస్పోజర్. ఈ ఒక్క మెషిన్ ఉంటే నెల నెలా చెత్త డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా.. సింకు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Food Waste Disposer Machine: సింకు డ్రైన్ పైపుల్లో చెత్త బ్లాక్ అయిపోతుందా? ఇంట్లో ఫుడ్ వేస్ట్ పేరుకుపోయి దుర్వాసన వస్తుందా? అయితే ఈ రెండిటికీ సొల్యుషనే ఈ ఫుడ్ వేస్ట్ డిస్పోజర్. ఈ ఒక్క మెషిన్ ఉంటే నెల నెలా చెత్త డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా.. సింకు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఫుడ్ వేస్ట్ డిస్పోజర్: ఇదుంటే నెల నెలా చెత్తకి డబ్బులివ్వక్కర్లేదు!

తిన్న తర్వాత ఫుడ్ వేస్ట్ ని పడేయడానికి వంట గదిలో చెత్త బుట్టని ఉపయోగిస్తుంటాం. అయితే చెత్త బుట్ట నిండిపోయి కంపు కొడుతుంటుంది. చెత్త పట్టుకెళ్ళే వాళ్ళు వచ్చే వరకూ ఆ కంపుని పీల్చాల్సిందే. అయితే ఈ ఫుడ్ వేస్ట్ డిస్పోజర్ ని ఇంట్లో పెట్టుకుంటే కనుక ఇక చెత్త కంపుని భరించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు బ్యాక్టీరియా కూడా ఏర్పడదు. ఎప్పుడు తిన్న ఫుడ్ వేస్ట్ అప్పుడే ఈ ఫుడ్ వేస్ట్ డిస్పోజర్ లోకి వెళ్ళిపోతుంది. దీని వల్ల ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది. పైగా చెత్తకు కూడా డబ్బులు ఇవ్వక్కర్లేదు. పర్యావరణానికి కూడా మేలు చేసినట్లే. వేగంగా ఫుడ్ వేస్ట్ ని శుభ్రం చేస్తుంది. అంతేకాదు సింకులో బ్లాక్స్ ని కూడా తొలగించేస్తుంది.

మాంసం దుమ్ములు, అన్నం మెతుకులు, ఆకుకూరల ఆకులు, కూరల్లో మిరపకాయలు, చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ సింకులో వేస్తే సింకుకి అడ్డం పడి నీళ్లు పైకి వచ్చేస్తాయి. పోనీ చెత్త బుట్టలో పడేద్దామంటే దుర్వాసన వస్తుంటాయి. అదే ఈ ఒక్క ఫుడ్ వేస్ట్ డిస్పోజర్ ఉంటే చెత్త బుట్ట పనుండదు, చెత్త పడేయడానికి అయ్యే ఖర్చు ఉండదు. అలానే పొరపాటున సింకులో ఏమైనా వెళ్తే నీళ్లు నిలిచిపోతాయన్న టెన్షన్ ఉండదు. ప్రముఖ బ్రాండెడ్ హిండ్ వేర్ కంపెనీ చేసిన ప్రాడెక్ట్ ఇది. ఇది 230 వోల్ట్స్, 50 హెడ్జెస్, 3.45 యాంపియర్ కరెంట్ తో పని చేస్తుంది. ఇందులో ప్లాస్టిక్ 40 ఎంఎం డ్రెయిన్ అవుట్ లెట్ ఇచ్చారు. ఇందులో పడిన చిన్న చిన్న మాంసం దుమ్ములు, మిరపకాయలు, చిన్న చిన్న ఫుడ్ వేస్ట్ వంటి చెత్తను క్రష్ చేసేసి నీటిలో కలిపేస్తుంది. దీని వల్ల ఇంట్లో ఫుడ్ వేస్ట్ ని ఉంచుకుని ఆ కంపుని పీల్చాల్సిన అవసరం ఉండదు. క్లీన్ చేసేటప్పుడు పెద్దగా శబ్దం కూడా రాదు.

food waste disposal

50 నుంచి 60 డెసిబుల్ సౌండ్ వస్తుంది. ఇది ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. కరెంట్ ఓవర్ అయినా సరే ఏమీ కాదు. దీని బరువు 5.3 కిలోలు. సింక్ హోల్ డయామీటర్ 90 ఎంఎంగా ఉంది. దీని మీద ఏడాది పాటు వారంటీ ఇస్తుంది కంపెనీ. ఫుడ్ వేస్ట్ డిస్పోజర్ తో పాటు డిశ్చార్జ్ ఎల్బో, కీతో పాటు ఎల్బో ఫ్లాంజ్, వారంటీ కార్డు, ఇన్స్ట్రక్షన్ మ్యాన్యువల్ వస్తాయి. ప్రస్తుతం ఉన్న డ్రైన్ కప్లింగ్ ని తీసేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఒక వీడియోలో చూపించారు. ఆ వీడియో కింద ఉంది. ఇక ఈ ఫుడ్ వేస్ట్ డిస్పోజర్ ఖరీదు ఆన్ లైన్ లో రూ. 14,917కి అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు సహా ఎంపిక చేసిన పలు కార్డుల మీద 1250 రూపాయల వరకూ తగ్గింపు లభిస్తుంది. మరి మీకు ఇది అవసరం అనుకుంటే కనుక కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.