Nidhan
యూత్ ఎక్కువగా స్టైలిష్ టూవీలర్స్‌ను కోరుకుంటారు. అయితే ఇవి లుక్స్, స్పీడ్ పరంగా బాగానే ఉన్నా మైలేజ్ మాత్రం సరిగ్గా ఇవ్వవు. అందుకే ఈ లోటును భర్తీ చేసేందుకు ఓ స్టైలిష్ సూపర్ బైక్ మార్కెట్లోకి వచ్చేసింది.
యూత్ ఎక్కువగా స్టైలిష్ టూవీలర్స్‌ను కోరుకుంటారు. అయితే ఇవి లుక్స్, స్పీడ్ పరంగా బాగానే ఉన్నా మైలేజ్ మాత్రం సరిగ్గా ఇవ్వవు. అందుకే ఈ లోటును భర్తీ చేసేందుకు ఓ స్టైలిష్ సూపర్ బైక్ మార్కెట్లోకి వచ్చేసింది.
Nidhan
యూత్ ఎక్కువగా స్టైలిష్ టూవీలర్స్‌ను కోరుకుంటారు. రయ్యున దూసుకుపోయే మంచి లుక్స్ ఉండే వాహనాలను వాళ్లు ఇష్టపడతారు. అందుకే కాలేజ్‌కు వెళ్లే స్టూడెంట్స్‌ను టార్గెట్ చేసుకొని 125 సీసీ, 150 సీసీ సెగ్మెంట్లో ప్రీమియం బైక్స్‌ను ఆటోమొబైల్ సంస్థలు తయారు చేస్తుంటాయి. అయితే ధరలో తగ్గేదేలే అనే రేంజ్లో ఉండే ఈ వెహికల్స్ లుక్స్, స్పీడ్ పరంగా తోపు అనేలా ఉంటాయి. కానీ మైలేజ్‌లో మాత్రం తుస్సుమంటాయి. అందుకే వీళ్లను ఆకర్షించేలా బజాజ్ కంపెనీ పల్సర్ మోడల్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. స్టైల్‌కు స్టైల్, మంచి మైలేజ్, లో మెయింటెనెన్స్ పల్సర్ బైక్ స్పెషాలిటీ. భారత టువీలర్ మార్కెట్లో వీటిదే హవా. అయితే పల్సర్ బైక్స్‌కు పోటీగా హీరో కంపెనీ ఓ స్టైలిష్ 125 సీసీ బైక్‌ను తీసుకొచ్చింది. లుక్స్ పరంగా సూపర్బ్‌గా ఉన్న ఈ టూవీలర్.. లీటర్‌కు ఏకంగా 66 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
హీరో కొత్తగా రిలీజ్ చేసిన ఆ బైక్ మోడలే ఎక్స్ట్రీమ్ 125ఆర్. చాన్నాళ్ల తర్వాత ఈ సెగ్మెంట్లో హీరో సంస్థ తీసుకొచ్చిన బైక్ ఇదే కావడం గమనార్హం. లుక్స్, ధర, ఫీచర్స్ ఇలా ఏ రకంగా చూసుకున్నా పల్సర్ 150కి మించిన రేంజ్లో ఈ బైక్ ఉంది. ఈ బైక్‌ను చూడగానే అట్రాక్ట్ చేసే మొదటి అంశం ప్రొజెక్టర్ హెడ్‌లైట్, దాని స్లిమ్ ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్. మామూలుగా ఎక్స్ట్రీమ్ బైక్‌లో డీఆర్ఎల్ బైక్ హెడ్‌లైట్ యూనిట్‌తో లభిస్తుంది. అయితే కొత్త ఎక్స్ట్రీమ్ 125ఆర్‌లో మాత్రం డీఆర్ఎల్ హెడ్‌లైట్ మీద స్టైలిష్ డిజైన్‌తో వచ్చింది. ఫ్యుయల్ ట్యాంక్‌ను కూడా అందంగా తీర్చిదిద్దారు. ఇతర 125 సీసీ బైక్స్‌తో పోలిస్తే ఇది పెద్దదిగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. హీరో ఎక్స్ట్రీమ్ కొత్త మోడల్ టైర్లు కూడా చాలా బాగున్నాయి. వెడల్పాటి టైర్లు బైక్‌కు పవర్ఫుల్ లుక్‌ను ఇస్తున్నాయి.
హీరో ఎక్స్ట్రీమ్ 125 సీసీ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే.. దీన్ని కొత్తగా డెవలప్ చేసిన 125 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో అమర్చారు. ఈ బైక్ 11.5 హార్స్పవర్ శక్తి, 10.5 న్యూటన్ మీటర్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 125 సీసీ బైక్‌లో ఈ పవర్ ఔట్పుట్ సూపర్బ్ అనే చెప్పొచ్చు. అయితే బజాజ్ పల్సర్ 125 సీసీ బైక్‌తో పోలిస్తే పవర్ పరంగా కాస్త వెనుకంజలో ఉంది. కానీ మైలేజీలో మాత్రం ఇది మంచి ఇంప్రెషన్ తీసుకుంటుంది. ఈ బైక్ 66 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొత్త హీరో ఎక్స్ట్రీమ్ 125 సీసీ బైక్ 5.9 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ బ్లింకర్స్, సిగ్నేచర్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ లాంటి ఫీచర్లను హీరో అందించింది. అలాగే కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్, గేర్ పొజిషన్ ఇండికేటర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కూడా అమర్చారు. ఈ బైక్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ.95,000, ఏబీఎస్‌తో దీని ధర రూ.99,500గా ఉంది. మరి.. 125 సీసీ విభాగంలో హీరో ఎక్స్ట్రీమ్ నంబర్ వన్ కాగలదని మీరు భావిస్తే కామెంట్ చేయండి.