iDreamPost
android-app
ios-app

హీరో నుంచి మరో కొత్త స్కూటర్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో కంపెనీ నుంచి మరో కొత్త స్కూటర్ మార్కెట్ లోకి విడుదలైంది. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లను కలిగిన ఈ స్కూటర్ ఆకట్టుకుంటోంది.

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో కంపెనీ నుంచి మరో కొత్త స్కూటర్ మార్కెట్ లోకి విడుదలైంది. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లను కలిగిన ఈ స్కూటర్ ఆకట్టుకుంటోంది.

హీరో నుంచి మరో కొత్త స్కూటర్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరోకు చెందిన బైకులు, స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన బైకులు, స్కూటర్లకు వాహనదారుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో హీరో మోటోకార్స్ మార్కెట్ లో తన హవా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో హీరో లవర్స్ కు కంపెనీ గుడ్ న్యూస్ అందించింది. తాజాగా హీరో కంపెనీ నుంచి కొత్త స్కూటర్ రిలీజ్ అయ్యింది. హీరో మోటోకార్ప్ జూమ్ సిరీస్‌లో సరికొత్తగా జూమ్‌ కాంబాట్‌ ఎడిషన్‌ని విడుదల చేసింది. ఈ స్కూటర్ క్రేజీ ఫీచర్లను కలిగి తక్కువ ధరకే వచ్చేస్తోంది. లేటెస్ట్ ఫీచర్లు, డిజైన్ తో ఉన్న ఈ స్కూటీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

ఈ స్కూటర్ మోడల్ ను జెడ్ఎక్స్ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. కొత్త జూమ్ కాంబాట్ ఎడిషన్ ‘మ్యాట్ షాడో గ్రే’ కలర్‌లో రానున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఈ స్కూటర్‌ ఎల్లో బ్లాక్ కలర్‌ షేడ్‌లో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉండేది. తాజా కాంబాట్‌ ఎడిషన్‌ షాడో గ్రే కలర్‌లో సరికొత్తగా కనిపించనుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఇప్పటి వరకు వచ్చిన జూమ్‌ స్కూటర్ల కంటే వెరైటీ లుక్ లో కనిపించనుంది. ప్రస్తుతం దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 80,967 ప్రారంభం కాబోతున్నది. ఇందులో 110.9 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలదు. ఇది 7,250 ఆర్ పిఎమ్ వద్ద 8.2 బిహెచ్ పి పవర్ మరియు 5,750 ఆర్ పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

జూమ్ జెడ్ఎక్స్ వేరియంట్ కార్నరింగ్ లైట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో సెల్ ఫోన్ కు వచ్చే కాల్స్, టెక్స్ట్ మెసేజ్ లను కూడా చూసే వీలుంటుంది. జూమ్ స్కూటర్‌లో ‘హెచ్’ ఆకారంలో ఉండే లైట్, ప్రొజెక్టర్ టు హెడ్లైట్, ‘హెచ్’ ఆకారంలో ఉండే ఎల్ఈడీ టెయిల్‌లైట్, ముందు భాగంలో డిస్క్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, యూఎస్బీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, లార్జ్ స్టోరేజ్ ఎల్ఈడీ లైట్ వంటి ఫీచర్లు అందించారు.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet