iDreamPost
android-app
ios-app

9 నెలల్లో 5 లక్షలను 10 లక్షలు చేసిన హెచ్డీఎఫ్సీ డిఫెన్స్ ఫండ్ స్కీమ్!

  • Published Aug 23, 2024 | 4:18 AM Updated Updated Aug 23, 2024 | 4:18 AM

5 Lakhs Became 10 Lakhs In 9 Months: డబ్బులు పొదుపు చేస్తే ఎక్కువ వడ్డీ రాదు. అదే ఎక్కడైనా పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయి. అయితే రిస్క్ కూడా ఉంటుంది. కానీ రిస్క్ ని ఫేస్ చేసినవారు చాలా మంది అధిక లాభాలను పొందారు. అలాంటి వారిలో 9 నెలల్లో 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి 10 లక్షలు లాభం పొందిన ఇన్వెస్టర్లు ఉన్నారు.

5 Lakhs Became 10 Lakhs In 9 Months: డబ్బులు పొదుపు చేస్తే ఎక్కువ వడ్డీ రాదు. అదే ఎక్కడైనా పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయి. అయితే రిస్క్ కూడా ఉంటుంది. కానీ రిస్క్ ని ఫేస్ చేసినవారు చాలా మంది అధిక లాభాలను పొందారు. అలాంటి వారిలో 9 నెలల్లో 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి 10 లక్షలు లాభం పొందిన ఇన్వెస్టర్లు ఉన్నారు.

9 నెలల్లో 5 లక్షలను 10 లక్షలు చేసిన హెచ్డీఎఫ్సీ డిఫెన్స్ ఫండ్ స్కీమ్!

చాలా మంది తమ ఆదాయం పెంచుకునేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. కొందరు ఫిక్స్డ్ డిపాజిట్ మార్గాన్ని ఎంచుకుంటే కొందరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇలా ఆయా మార్గాలను ఎంచుకుంటారు. పొదుపు చేయడం కంటే పెట్టుబడి పెట్టడం వల్లే ఎక్కువ ఆదాయం ఆర్జించవచ్చునని చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. రిస్క్ ఉన్నా కూడా ఎక్కువ లాభాలు ఇస్తుండడంతో పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. సాధారణంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని చెబుతారు. కానీ హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కి చెందిన ఒక పథకం మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

9 నెలల్లోనే ఇన్వెస్టర్స్ పెట్టిన పెట్టుబడిని రెండింతలు చేసింది. ఆ పథకం పేరు హెచ్డీఎఫ్సీ డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్. భారత రక్షణ రంగ పెట్టుబడులపై దృష్టి సారించిన ఏకైక ఫండ్ ఇదే కావడం విశేషం. గడిచిన 9 నెలల్లో ఈ ఫండ్ ఏకంగా 102.26 శాతం లాభాలను అందించింది. అంటే 9 నెలల క్రితం 5 లక్షలు పెట్టుబడి పెడితే 10 లక్షలకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. గత మూడు నెలలుగా చూసుకుంటే సగటున నెలకు 38.87 శాతం మేర లాభాలను అందించగా.. గత ఆరు నెలలుగా చూస్తే సగటున నెలకు 55.16 శాతం చొప్పున లాభాలను తెచ్చిపెట్టింది. ఏడాది కాలంగా చూస్తే 130.44 శాతం లాభాలను అందించింది. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా హెచ్డీఎఫ్సీ డిఫెన్స్ స్కీం స్టార్ట్ అయినప్పటి నుంచి 10 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన వారి ఇన్వెస్ట్మెంట్ 2.28 లక్షలు అయ్యింది.

ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 147.90 శాతంగా ఉంది. పెట్టుబడి విలువ 1.30 లక్షలు కాగా మరో లక్ష లాభం వచ్చినట్లు అయ్యింది. హెచ్డీఎఫ్సీ డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని గత ఏడాది జూన్ లో ప్రారంభించారు. అప్పుడు  ఈ పథకంలో లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు దాని విలువ రూ. 2.45 లక్షలు పైనే ఉంటుంది. అంటే 5 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారి పెట్టుబడి 11 లక్షలు పైనే ఉంది. ఈ పథకం యొక్క కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 122.95 శాతంగా ఉంది. ఈ పథకం ద్వారా వచ్చిన పెట్టుబడులను రక్షణ రంగం, దాని అనుబంధ రంగాల్లో పెట్టుబడి పెడుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఈ హెచ్డీఎఫ్సీ డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్ స్కీం.. బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ గా ఉంది. ఈ ఇండెక్స్ గత 9 నెలల్లో 146.17 శాతం లాభాలను తెచ్చిపెట్టింది.