iDreamPost
android-app
ios-app

SBI, HDFC కస్టమర్లకు అలర్ట్.. ఒకే సారి 4 శుభవార్తలు..!

  • Published Sep 02, 2024 | 3:48 PM Updated Updated Sep 02, 2024 | 3:48 PM

HDFC Digital Passbook, SBI Launches New Design Of Fastag: ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేశాయి. సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఆ వివరాలు..

HDFC Digital Passbook, SBI Launches New Design Of Fastag: ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేశాయి. సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఆ వివరాలు..

  • Published Sep 02, 2024 | 3:48 PMUpdated Sep 02, 2024 | 3:48 PM
SBI, HDFC కస్టమర్లకు అలర్ట్.. ఒకే సారి 4 శుభవార్తలు..!

దేశంలో ప్రభుత్వ రంగంలో అతి పెద్ద బ్యాంక్ గా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన.. హెచ్‌డీఎఫ్‌సీ తమ వినియోగదారుల కోసం కీలక ప్రకటనలు చేశాయి. వారికి ఒకే సారి నలుగు శుభవార్తలు చెప్పడానికి రెడీ అయ్యాయి. వినియోగదారుల కోసం కొన్ని కొత్త సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి ఈ రెండు బ్యాంకులు. వీటివల్ల కస్టమర్లు బ్యాంకు సేవలను పొందడం మరింత సులభతరం కానున్నాయి. మరి ఇంతకు ఈ బ్యాంకులు తీసుకువచ్చిన ఆ సరికొత్త సర్వీసులు ఏంటి.. అవి ఎవరి కోసం అనే వివరాలు మీ కోసం..

ముందుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విషయానికి వస్తే.. అది తన కస్టమర్ల కోసం డిజీపాస్‌బుక్ పేరిట కొత్త సర్వీసుల్ని ప్రారంభించింది. బ్యాంక్ కు సంబంధించిన స్మార్ట్ వెల్త్ యాప్‌లో ఈ సేవల్ని అందిస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా యూజర్లు.. వారి ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించిన నిర్వహణను మరింత సులభంగా చేసుకునేందుకు అవకాశం కలగనుంది. ఈ డిజీపాస్ బుక్ ఫీచర్.. ఈక్విటీ పెట్టుబడులు, ఈటీఎఫ్, డీమ్యాట్ అకౌంట్లన్నింటిని ఒకే ప్లాట్‌ఫామ్ కింద అనుసంధానం చేస్తుంది. దీని వల్ల కస్టమర్లు కేవలం ఒకే ఒక్క అనుమతితో.. డిజీ పాస్‌బుక్ ద్వారా అన్ని రకాల ఆర్థిక సమాచారాన్ని ఒకే చోట పొందే అవకాశం కలగనుంది.

అయితే ఈ డిజీపాస్‌బుక్ సేవలు.. 2024, జులై 31 నుంచే అందుబాటులోకి వచ్చాయి. అయితే అప్పుడు కేవలం కరెంట్ అకౌంట్ సేవింగ్ (కాసా) అకౌంట్‌కు మాత్రమే ఈ సేవలు పరిమితం అయి ఉండేవి. కానీ ఇక ఇప్పటి నుంచి డిజీపాస్ బుక్ సేవలు సేవింగ్స్ ఖాతాలకు కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఇక ఎస్బీఐ విషయానికి వస్తే.. ఇది సరికొత్త డిజైన్‌లో ఫాస్టాగ్ తెచ్చింది. ట్రావెల్ టైమ్ మరింత తగ్గించాలన్న లక్ష్యంతోనే.. ఈ సర్వీసుల్ని లాంఛ్ చేసింది. ఈ అడ్వాన్స్‌డ్ ఫాస్టాగ్ డిజైన్‌తో వెహికిల్ ఐడెంటిఫికేషన్, కలెక్షన్ సామర్థ్యాలు మెరగవుతాయి. ఈ ఫాస్టాగ్ డిజైన్ తో పాటుగా మరో రెండు కొత్త ప్రొడక్ట్స్ కూడా తెచ్చింది ఎస్భీఐ.

తొలిసారిగా దేశంలో ఎంటీఎస్ కార్డు తీసుకువచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. దీని పేరు ఎంటీఎస్ రూపే ఎన్సీఎంసీ ప్రీపెయిడ్ కార్డు. టోల్స్, బస్, మెట్రో ట్రైన్స్, పార్కింగ్ సహా అన్ని రకాల ఎన్సీఎంసీ ఎనేబుల్ ట్రాన్సిస్ట్ ప్రాజెక్టులకు సంబంధించి నిరంతరాయ పేమెంట్ల కోసం ఈ కార్డు తెచ్చినట్లు ఎస్బీఐ చెప్పుకొచ్చింది. దీని వల్ల కస్టమర్లకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే అవకాశం కలగనుంది అని చెప్పుకొచ్చింది.