iDreamPost
android-app
ios-app

ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్.. ఇకపై తగ్గనున్న భారం!

  • Published Jun 08, 2024 | 7:54 PM Updated Updated Jun 08, 2024 | 7:54 PM

Good News To HDFC Customers: హెచ్డీఎఫ్సీ బ్యాంకు తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్డీఎఫ్సీ తీసుకున్న నిర్ణయంతో హోమ్ లోన్ కస్టమర్లకు ఇకపై భారం తగ్గనుంది.

Good News To HDFC Customers: హెచ్డీఎఫ్సీ బ్యాంకు తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్డీఎఫ్సీ తీసుకున్న నిర్ణయంతో హోమ్ లోన్ కస్టమర్లకు ఇకపై భారం తగ్గనుంది.

ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్.. ఇకపై తగ్గనున్న భారం!

హెచ్డీఎఫ్సీ తమ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసీఎల్ఆర్ రేటుని సవరించింది. వడ్డీ రేట్లను తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్ఆర్) ని 5 బేసిస్ పాయింట్స్ మేర తగ్గించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు యొక్క ఎంసీఎల్ఆర్ 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్యలో ఉంటుంది. రెండేళ్ల టెన్యూర్ మీద వడ్డీ రేటుని 5 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో 9.35 శాతంగా ఉన్న వడ్డీ రేటు 9.30 శాతానికి తగ్గింది. మిగతా రేట్లు మాత్రం సవరించలేదు. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.95 శాతంగా ఉంది. ఒక నెల ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 9 శాతానికి పెరిగింది. మూడు నెలల టెన్యూర్ మీద వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంది. ఆరు నెలల టెన్యూర్ మీద 9.30 శాతం వడ్డీ రేటు ఉంది.

ఏడాది టెన్యూర్ కన్స్యూమర్ లోన్స్ కి చాలా మంది కస్టమర్లు తీసుకుని ఉన్నారు. వీరికి 9.30 శాతం వడ్డీ రేటు పడుతుంది. ఎంసీఎల్ఆర్ ని సవరించిన తర్వాత రెండేళ్లు, మూడేళ్ళ టెన్యూర్ మీద కూడా ఇదే వడ్డీ రేటు కొనసాగుతుంది. ఈ వడ్డీ రేట్ల సవరణ 2024 జూన్ 7 నుంచి అమలులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ సంస్థలు ఒక స్పెసిఫిక్ లోన్ మీద కనీస వడ్డీ రేటుని వసూలు చేయడాన్ని ఎంసీఎల్ఆర్ అని అంటారు. ఇది లోన్ కోసం వడ్డీ రేటుని నిర్దేశిస్తుంది. గతంలో అనగా 2024 మార్చి 11కి ముందు ప్రధాన వార్షిక వడ్డీ రేటు 17.95 శాతంగా ఉండేది. సవరించిన తర్వాత 9.45 శాతంగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు.. ఫ్లోటింగ్ రేటు లోన్ గా పిలవబడే అడ్జస్టబుల్ రేటు లోన్ ని ఆఫర్ చేస్తుంది.

అలానే ట్రూ ఫిక్స్డ్ లోన్ ని కూడా అందిస్తుంది. దీని వల్ల స్పెసిఫిక్ టెన్యూర్ కోసం హోమ్ లోన్ మీద వడ్డీ రేటు ఫిక్స్డ్ గా ఉంటుంది. మొత్తం లోన్ టెన్యూర్ మీద మొదటి రెండేళ్లు ఫిక్స్డ్ వడ్డీ రేటు అనేది ఉంటుంది. ఆ తర్వాత అడ్జస్టబుల్ రేట్ లోన్ గా కన్వర్ట్ అవుతుంది. ఉద్యోగులకు, స్వయం ఉపాధి వ్యక్తులకు స్పెషల్ హోమ్ లోన్ రేట్లు విషయానికొస్తే.. అన్ని రకాల లోన్ల మీద రెపో రేటుతో కలిపి 2.25 నుంచి 3.15 శాతం వడ్డీ రేటు ఉంది. మొత్తం మీద 8.75 శాతం నుంచి 9.65 శాతం వడ్డీ రేటు ఉంది. సాధారణ హోమ్ లోన్స్ విషయానికొస్తే ఉద్యోగులకైనా, స్వయం ఉపాధి వ్యక్తులకు అయినా అన్ని రకాల లోన్స్ కి రెపో రేటుతో కలిపి 2.90% నుంచి 3.45% వరకూ ఉంది. ఈ సాధారణ హోమ్ లోన్ మీద మొత్తం 9.40 శాతం నుంచి 9.95 శాతం వడ్డీ రేటు అనేది పడుతుంది.