iDreamPost
android-app
ios-app

ఖాతాదారులకు షాక్‌ ఇచ్చిన HDFC బ్యాంక్.. ఇక EMI ఎక్కువ కట్టాల్సిందే!

  • Published Jul 08, 2024 | 4:35 PM Updated Updated Jul 08, 2024 | 4:40 PM

హెచ్‌డీఎఫ్‌సీలో లోన్‌ తీసుకున్న వారికి బ్యాంక్‌ సడెన్‌గా భారీ షాక్‌ ఇచ్చింది. బ్యాంకు నిర్ణయం వల్ల కస్టమర్లపై అదనపు భారం పడనుంది. ఇకపై వారు ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి రానుంది. ఆ వివరాలు..

హెచ్‌డీఎఫ్‌సీలో లోన్‌ తీసుకున్న వారికి బ్యాంక్‌ సడెన్‌గా భారీ షాక్‌ ఇచ్చింది. బ్యాంకు నిర్ణయం వల్ల కస్టమర్లపై అదనపు భారం పడనుంది. ఇకపై వారు ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి రానుంది. ఆ వివరాలు..

  • Published Jul 08, 2024 | 4:35 PMUpdated Jul 08, 2024 | 4:40 PM
ఖాతాదారులకు షాక్‌ ఇచ్చిన HDFC బ్యాంక్.. ఇక EMI ఎక్కువ కట్టాల్సిందే!

మన దేశంలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లో రెండో దిగ్గజ బ్యాంక్‌గా హెచ్‌డీఎఫ్‌సీ గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా వేల బ్రాంచులు.. కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తరచుగా వార్తల్లో నిలుస్తుంది. వారం రోజుల క్రితం యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌ వంటి సేవలకు అంతరాయం ఏర్పడుతుందని.. కస్టమర్లకు అలర్ట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి కస్టమర్లకు ఉన్నట్లుండి భారీ షాక్‌ ఇచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. లోన్‌ ఈఎంఐ చెల్లింపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లపై ఈఎంఐ భారం పెరగనుంది. ఆ వివరాలు..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్ల మీద అదనపు భారం మోపుతూ సడెన్ షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్‌ఆర్)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాంకు అందజేస్తోన్న వేరు వేరు టెన్యూర్లపై.. ఎంసీఎల్ఆర్ రేట్లను అనగా వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించి కస్టమర్లకు భారీ షాకిచ్చింది. అంతేకాక పెంచిన రేట్లు నేటి నుంచి అనగా సోమవారం, జులై 8, 2024 వ తేదీ నుంచే అమలులోకి వస్తాయని.. బ్యాంక్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. పలు టెన్యూర్లపై వడ్డీ రేట్లను 10 బేసిస్ బాయింట్లు పెంచుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది. లెండింగ్‌ రేట్ల పెంపు కారణంగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వేర్వేరు టెన్యూర్‌ల ఎంసీఎల్ఆర్ రేటు 9.05 శాతం నుంచి 9.40 శాతం మధ్య ఉంది.

వేర్వేరు టెన్యూర్‌లపై పెంచిన రేట్లు ఇలా ఉన్నాయి..

ఈ క్రమంలో బ్యాంకు వేర్వేరు టెన్యుర్‌ల మీద పెంచిన లెండింగ్‌ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ఓవర్ నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దాంతో ప్రస్తుతం అది 8.95 శాతం నుంచి 9.05 శాతానికి పెరిగింది. ఇక నెల రోజుల ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటును కూడా 10 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో.. దాని రేటు.. 9-9.10 శాతానికి చేరింది. అలాగే మూడు నెలల టెన్యూర్‌పై ఎంసీఎల్ఆర్ రేటును కాస్త స్వల్పంగా.. అనగా 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో 3 నెలల టెన్యూర్‌ వడ్డీ రేటు 9.15 -9.20 శాతానికి చేరింది.

అలాగే ఆరు నెలల టెన్యూర్‌ ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచడంతో.. అది కూడా 9.30 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగింది. ఇవే కాక ఎక్కువ మంది కస్టమర్ల రుణాలకు లింక్ అయి ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును సైతం 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాది టెన్యూర్‌ వడ్డీ రేటు 9.30-9.40 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్లు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.40 శాతంగా ఉంది. పెంచిన రేట్లు నేటి నుంచే అనగా జూలై 8, 2024 సోమవారం నుంచే అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ ప్రకటించింది.

స్థిరంగా హెం లోన్‌ వడ్డీ రేట్లు..

ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జూలై నెలలో హోమ్ లోన్ వడ్డీ రేట్లను మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి వడ్డీ రేట్లు పాలసీ రెపో రేటు (6.50) + 2.25 శాతం నుంచి 3.15 శాతం= 8.75 శాతం నుంచి 9.65 శాతం వరకు వడ్డీ రేటు వసూలు చేస్తూ.. లోన్లు ఇస్తోంది.

ఎంసీఎల్‌ఆర్‌ అంటే ఏంటి..

బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే లోన్ల మీద వసూలు చేసే కనీస వడ్డీ రేటునే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) అంటారు. దీని కన్నా తక్కువ రేటుకు బ్యాంకులు లోన్లపై వడ్డీ వసూలు చేసేందుకు వీలు లేదు. అన్నీ బ్యాంకుల్లో ఒకే పద్ధతి ఉండేందుకు ఆర్‌బీఐ ఎంసీఎల్ఆర్‌ను అమలులోకి తెచ్చింది. చాలా వరకు కస్టమర్లు తీసుకునే లోన్లు ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌పై ఆధారపడి ఉంటాయి. ఏడాది ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ తీసుకున్న వ్యక్తి ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. లేదంటే.. లోన్ టెన్యూర్ పెరుగుతుంది. దీంతో కస్టమర్ల మీద ప్రతి నెలా అదనపు భారం పడుతుంది. ఎంసీఎల్‌ఆర్‌ పెరిగితే.. లోన్‌ తీసుకున్న వారు ఎక్కువ ఈఎంఐ లేదా ఎక్కువ కాలం లోన్ చెల్లించాల్సి వస్తుంది.