iDreamPost

అలర్ట్: 2 గంటల పాటు ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు పని చేయవు.. ఎందుకంటే?

క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో ఆన్ లైన్ పేమెంట్స్ చేయడం.. షాపింగ్ మాల్స్ వంటి వాటి దగ్గర స్వైప్ చేయడం.. డెబిట్ కార్డుతో ఏటీఎంలో అమౌంట్ విత్ డ్రా చేయడం వంటివి చేస్తుంటాం. అయితే 24/7 ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఈ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు పని చేయవు. ఎందుకంటే?

క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో ఆన్ లైన్ పేమెంట్స్ చేయడం.. షాపింగ్ మాల్స్ వంటి వాటి దగ్గర స్వైప్ చేయడం.. డెబిట్ కార్డుతో ఏటీఎంలో అమౌంట్ విత్ డ్రా చేయడం వంటివి చేస్తుంటాం. అయితే 24/7 ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఈ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు పని చేయవు. ఎందుకంటే?

అలర్ట్: 2 గంటల పాటు ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు పని చేయవు.. ఎందుకంటే?

ఒకప్పుడు డబ్బులు కావాలంటే బ్యాంకులకు వెళ్లి విత్ డ్రా ఫామ్ ఫిల్ చేసి లైన్ లో నిలబడి తెచ్చుకునేవారు. ఆ తర్వాత ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగిపోయి స్మార్ట్ ఫోన్ రావడంతో డబ్బులు బయటకు తీసే పరిస్థితి పోయింది. రూపాయి నుంచి లక్ష, ఆపై అమౌంట్ వరకూ ఎంతైనా సరే ఆన్ లైన్ లో పంపించేసుకుంటున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వచ్చాక భారతదేశం మొత్తం డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వినియోగం కూడా ఎక్కువైంది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో షాపింగ్ మాల్స్, థియేటర్స్, ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ ఇలా అనేక చోట్ల బిల్లింగ్ సమయంలో వినియోగించడం పరిపాటే.

అయితే రేపు ఒక్కరోజు ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు పని చేయవు. బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్ లైన్ సేవలు వంటి విషయాల్లో సిస్టమ్స్ ని అప్ గ్రేడ్ చేస్తుంటాయి. ఈ క్రమంలో పలు సేవలను నిలిపివేస్తాయి. తాజాగా దేశీయ దిగ్గజ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా కీలక ప్రకటన చేసింది. తమ కస్టమర్లకు ఒక అలర్ట్ సందేశాన్ని పంపించింది. షెడ్యూల్ అప్ గ్రేడ్: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు సేవలు రేపు అనగా మే 22న అందుబాటులో ఉండవు. ఏటీఎం, పీఓఎస్, ఆన్ లైన్ కి సంబంధించి డెబిట్, క్రెడిట్ కార్డుల సేవలు నిలిపివేస్తున్నట్టు బ్యాంకు తెలిపింది.

మే 22 అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 వరకూ డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవని తెలిపింది. అంటే డెబిట్ కార్డుతో ఏటీఎంలో అమౌంట్ విత్ డ్రా చేయాలనుకున్నా.. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా స్వైప్ చేయాలన్నా.. లేదా  ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో ఏదైనా ఆర్డర్ చేయాలన్నా గానీ కుదరదు. షెడ్యూల్ అప్ గ్రేడ్ లో భాగంగా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఏమైనా ప్లాన్స్ ఉంటే ముందుగానే చూసుకోవడం గానీ లేదా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఈ అర్ధరాత్రి సమయంలో అమౌంట్ విత్ డ్రా కోసం ఏటీఎం సెంటర్ కి వెళ్లినా టైం, శ్రమ రెండూ వృధా అవుతాయి. అలానే పేమెంట్స్, ఆన్ లైన్ షాపింగ్ అప్పుడు కార్డులు పని చేయకపోతే బాధపడతారు. ముందుగానే ఆ కార్డుల్లో ఉన్న అమౌంట్ ని వేరే బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోండి. అలానే ఈ విషయాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులకు తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి