Keerthi
గత కొన్ని రోజులుగా ఐటీ రంగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రంగంలో పనిచేసే టెకీలకు ఎప్పుడు ఏ వార్త వినాల అని క్షణం, క్షణం గండంలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా
గత కొన్ని రోజులుగా ఐటీ రంగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రంగంలో పనిచేసే టెకీలకు ఎప్పుడు ఏ వార్త వినాల అని క్షణం, క్షణం గండంలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా
Keerthi
ఐటీ హబ్ లో ఉద్యోగం చేయలని ప్రతిఒక్కరూ కలలు కంటారు. ఎందుకంటే ఈ ఉద్యోగంలో ఉండే వెసులబాటు మరెక్కడ ఉండదని చాలామంది అభిప్రాయం. పైగా లక్షల్లో జీతాలు, వారంలో రెండు రోజులు సెలవులు, పెద్ద పెద్ద అద్దాల మేడాల్లో హాయిగా ఏసీ కింద కూర్చొని వర్క్ చేయవచ్చు. కనుక వర్క్ పరంగా కష్టంగా ఉన్నా ఎక్కువ శాతం అందరూ ఈ ఐటీ ఉద్యోగాలు చేయాలనే ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ప్రస్తుత కాలంలో ఈ ఐటీ రంగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రంగంలో పనిచేసే టెకీలకు క్షణం, క్షణం గండంలా ఉంటుంది. ఎందుకంటే.. గత ఏడాది నుంచి ఈ ఐటీ కంపెనీల్లో తీవ్ర ఉద్యోగ కోతలు పెరుగుతన్నాయి. వీటిలో ఎక్కువ శాతం దిగ్గజ సంస్థలే ఉండటం గమన్హారం. అంతేకాకుండా.. ఈ ఐటీ ఉద్యోగులకు పనిచేసే సంస్థల వద్ద వివిధ రకాల ఆంక్షాలు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేశంలో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ అయిన హెచ్‌సీఎల్ టెక్ కూడా తమ ఉద్యోగుల పట్ల కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
దేశంలోనే మూడో అతిపెద్ద సాఫ్ట్ వేర్ రంగ సంస్థ అయిన హెచ్‌సీఎల్ టెక్ తాజాగా తమ ఉద్యోగుల పట్ల కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత.. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తివేతయడంతో పాటు తిరిగి ఆఫీసులకు పిలుపునిచ్చారు. అయితే అది కూడా హైబ్రిడ్ విధానంలో మూడు రోజులు ఆఫీసు రావాలని చాలా కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. వాటిల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా ఒకటి. ఇక్కడ వారానికి మూడు రోజుల ఆఫీసు పనిని కచ్చితంగా అమలు చేసేందుకు కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కానీ, ఇలా కూడా ఉద్యోగులు ఆఫీసుకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో హెచ్‌సీఎల్ తమ ఉద్యోగులను ఎలాగైనా ఆఫీసులకు రప్పించేందుకు ఓ కొత్త పాలసీని తీసుకొచ్చింది.
ఇక నుంచి తమ సంస్థలోని పనిచేసే ఉద్యోగులకు అటెండెన్స్ తో సెలవులకు లింక్ ను పెట్టింది. ఈ విధంగా చూసుకుంటే.. ఆఫీసుకు వచ్చిన వారికి మాత్రమే లీవ్స్ ఉంటాయని చెప్పకనే చేప్పేసింది. అంతేకాకుండా.. ఆఫీసుకు రాని ఉద్యోగులకు శాలరీలో కోత కూడా పడనుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ విషయాలన్ని తాజాగా ఓ పత్రిక కథనాల్లో ప్రచురించినట్లు తెలుస్తుంది. ఇకపోతే హెచ్‌సీఎల్ టెక్ కొత్త పాలసీ ప్రకారం.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు అంటే నెలకు కనీసం 12 రోజుల పాటు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఒక వేళ కనీస రోజులు ఆఫీసుకు రాలేకపోయినట్లయితే సదరు ఉద్యోగి ఎన్ని రోజులు రాలేదో అన్ని రోజులు లీవ్స్‌లో కోత పడుతుందని కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి ఓ కథనాల్లో చెప్పినట్లు సమాచారం. అంటే ఓ ఉద్యోగి ఆఫీసుకు 12 రోజులు కాకుండా 10 రోజులే వస్తే.. అప్పుడు అతడి లీవ్స్ లో రెండు రోజులు కోత పడుతుంది.
కాగా, ఇప్పటికే హెచ్‌ఆర్ విభాగం ఉద్యోగులకు ఇ-మెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వారం నుంచి ఈ కొత్త పాలసీ అమలులోకి రానుందట. అయితే హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగులకు 3 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉన్న వారికి 18 యాన్యువల్ లీవ్స్, ఒక పర్సనల్ లీవ్ ఉంటుంది. 3 ఏళ్లకుపైగా పని చేస్తున్న ఉద్యోగులకు 20 యాన్యువల్ లీవ్స్, రెండు పర్సనల్ లీవ్స్ ఉంటాయి. కానీ, కొత్త పాలసీ ప్రకారం ఈ లీవ్స్‌లో కోత పడుతుంది. దీంతో లీవ్స్ అయిపోతే లాస్ ఆఫ్ పే అవుతుంది. ఈ భయంతోనైనా ఉద్యోగులు ఆఫీసుకు వస్తారని హెచ్‌సీఎల్ టెక్ ఈ కొత్త పాలసీని తీసుకొచ్చినట్లు సమాచారం. మరి, హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగుల గురించి తీసుకువచ్చిన ఈ కొత్త పాలసీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.