iDreamPost
android-app
ios-app

ఆ రాష్ట్రాలకు షాక్‌.. ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం!

ఆ రాష్ట్రాలకు షాక్‌.. ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం!

ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై అధిక జీఎస్టీ విధింపుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, గోవా లాంటి రాష్ట్రాలకు షాక్‌ ఇచ్చింది. ఆ రాష్ట్రాల ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై 28 శాతం జీఎస్టీ విధించటంపై వెనక్కు తగ్గేదేలా అని తేల్చి చెప్పింది. 28 శాతం జీఎస్టీ విధానం అక్టోబర్‌ 1నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ..

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విషయంలో ఆలోచన చేయాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 28 శాతం జీఎస్టీ విషయంలో వెనక్కు తగ్గే ఆలోచన లేదు. అక్టోబర్‌ 1నుంచి ఈ జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతకంటే ముందు కేంద్ర, రాష్ట్రాల చట్టాల్లో అవసరమైన సవరణలు చేస్తాము. నిర్ణయం అమల్లోకి తెచ్చిన 6 నెలల తర్వాత సమీక్ష నిర్వహిస్తాం. ఆన్‌లైన్‌లో గెలుచుకున్న మనీపై కూడా చట్ట ప్రకారం ఆదాయపు పన్ను విధించే అవకాశం కూడా ఉంటుంది’’ అని అన్నారు.

కాగా, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ఏకంగా 28 శాతం జీఎస్టీ విధించటం వల్ల ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇండస్ట్రీ కుప్పకూలుతుందని, జీఎస్టీపై మరో సారి సమీక్ష చేయాలంటూ ఢిల్లీ, గోవా లాంటి రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. అయితే, రాష్ట్రాల విన్నపాన్ని కేంద్రం పక్కకు పడేసింది. జీఎస్టీ విధింపు విషయంలో పునరాలోచన లేదని కేంద్ర వెల్లడించింది. అంతేకాదు! పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఈ 28 శాతం జీఎస్టీ త్వరగా అమలు చేయాలని కోరుతున్నట్లు కేంద్రం తెలిపింది. మరి, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై కేంద్రం 28 శాతం జీఎస్టీ విధించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.