iDreamPost
android-app
ios-app

పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్.. రోజుకు రూ. 50 పెట్టుబడితో ఏకంగా రూ.30 లక్షలు!

  • Published May 05, 2024 | 5:14 PM Updated Updated May 05, 2024 | 5:14 PM

Post Office Schemes: పోస్టాపీస్ ద్వారా ఎన్నో సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా పథకాల్లో తక్కువ  పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేవి కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఓ స్కీమ్ ద్వారా రోజుకి రూ.50 పెట్టుబడితో రూ.30 లక్షలు పొందొచ్చు.

Post Office Schemes: పోస్టాపీస్ ద్వారా ఎన్నో సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా పథకాల్లో తక్కువ  పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేవి కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఓ స్కీమ్ ద్వారా రోజుకి రూ.50 పెట్టుబడితో రూ.30 లక్షలు పొందొచ్చు.

  • Published May 05, 2024 | 5:14 PMUpdated May 05, 2024 | 5:14 PM
పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్.. రోజుకు రూ. 50 పెట్టుబడితో ఏకంగా రూ.30 లక్షలు!

కేంద్రప్రభుత్వం అనేక రకాల సేవింగ్ స్కీమ్స్ ప్రజలక కోసం అందుబాటులోకి తెచ్చింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి వివిధ రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని సేవింగ్ స్కీమ్స్ అమల్లో జరుగుతుండగా..మరికొన్ని పోస్టాఫీస్, బ్యాంకుల వంటి వాటి ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. చాలా పథకాల్లో తక్కువ  పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోస్టాఫీస్ లో ఓ అద్భుత సేవింగ్ స్కీమ్ ఉంది. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పోస్టాపీస్ ద్వారా ఎన్నో సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి గ్రామ్ సురక్ష స్కీమ్. ఇది కేవలం సేవింగ్స్‌ మాత్రమే కాకుండా హెల్త్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ పాలసీ కావడం ప్రత్యేకం. 1955లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ లోకి చేరిన వ్యక్తి 80 ఏళ్ల వయసు వచ్చిన తరువాత దాని ఫలాలను అందుకుంటాడు. ఈ స్కీమ్ లో వచ్చే బోనస్ తోపాటు  డబ్బును అందిస్తారు. టర్మ్ పాలసీ పూర్తి కాకుండానే బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే మొత్తం డబ్బులను నామినీకి లేదా కుటుంబ సభ్యులకు అందిస్తారు.

ఈ స్కీమ్ చేరేందుకు 19 నుంచి 55 ఏళ్ల మధ్య  ఉన్న వాళ్లు అర్హులు.  19 నుంచి  50 మధ్య వయస్సు ఉండే ఎవరైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు. ప్రీమియం కట్టే విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి.  3 నెలలు, 6 నెలలు, ఏడాదికి ఒకసారిగా ప్రీమియం చెల్లింపును పెట్టుకోవచ్చు. అలానే ప్రీమియం చెల్లింపు విషయంలో మూడు స్థాయిలో పెట్టుకోవచ్చు. అది 55 ఏళ్లు, 58 ఏళ్లు, 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. ఈ ప్రీమియంలో ఏదీ నచ్చిన ఆప్షన్ ఎంపిక చచేసుకోవచ్చు. అలానే ద్వారా రుణం తీసుకునే అవకాశం కూడా ఉంది. పాలసీ తీసుకున్న 4 ఏళ్ల తరువాత రుణ పొందే అవకాశం ఉంది. ఈ  రుణంపై 10 శాతం వడ్డీ ఉంటుంది.

ఇక  ఈ స్కీమ్ ద్వారా ఎలా బెనిఫిట్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం..   ఉదాహరణకు మీకు రూ. 30 లక్షలు రిటర్న్‌ రావాలంటే ఎంత చెల్లించాలి, ఆ లెక్కలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు 19 ఏళ్ల వయసులో రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారు అనుకుందాం.  దానికి 55 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. చివర్లో 31.60 లక్షల రూపాయలు పొందుతారు. అదే రూ.10 లక్ష మొత్తానికి 58 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. రూ.33.4 లక్షలు వరకు వస్తుంది. అలానే 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. 34.60 లక్షల రూపాయల మెచ్యూరిటీ పొందొచ్చు.

55 ఏళ్ల మెచ్యూరిటీ కోసం నెలకు 1515 రూపాయలు ఇన్వెస్టే చేయాల్సి ఉంటుంది. ఆ 1515 రూపాయలను రోజుకు లెక్కిసే.. సుమారు రూ. 50 మాత్రమే అవుతుంది. ఒకవేళ 58 ఏళ్లకు పెట్టుకున్నట్లు అయితే అదే అమౌంట్ రూ.1463కి తగ్గుతుంది. అలానే  60 ఏళ్ల వరకు పెట్టుకున్నట్లు అయితే ఇంకా తగ్గి రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా అలా ఈ స్కీమ్ ద్వారా రోజు 50 రూపాయలు పెట్టి..చివర్లో రూ.30 లక్షలు పొందవచ్చు. ఇప్పటికే ఎంతో మంది ఈ స్కీమ్ లో చేరారు. ఈ స్కీమ్ గురించి మరింత సమాచారం కోసం మీ సమీపంలోనే పోస్టాఫీస్ ను సంప్రదించవచ్చు.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibomgrandpashabet