iDreamPost
android-app
ios-app

గూగుల్ పేలో మొబైల్ రీఛార్జ్ చేస్తున్నారా!.. ఇకపై ఫీజు చెల్లించాల్సిందే?

ఆన్ లైన్ చెల్లింపుల యాప్ గూగుల్ పే యూజర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు మొబైల్ రీఛార్జులపై ఎటుంటి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా సేవలందించింది. కానీ ఇక నుంచి మొబైల్ రీఛార్జ్ చేస్తే కొంత మొత్తాన్ని చెల్లించాల్సిందేనట.

ఆన్ లైన్ చెల్లింపుల యాప్ గూగుల్ పే యూజర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు మొబైల్ రీఛార్జులపై ఎటుంటి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా సేవలందించింది. కానీ ఇక నుంచి మొబైల్ రీఛార్జ్ చేస్తే కొంత మొత్తాన్ని చెల్లించాల్సిందేనట.

గూగుల్ పేలో మొబైల్ రీఛార్జ్ చేస్తున్నారా!.. ఇకపై ఫీజు చెల్లించాల్సిందే?

దేశంలో అతిపెద్ద ఆన్ లైన్ చెల్లింపుల యాప్ గూగుల్ పే. ఇది కోట్లాది మంది కస్టమర్లను కలిగి ఉంది. చిన్న చిన్న కిరాణ షాపుల దగ్గర్నుంచి మొదలుకొని అన్ని రకాల ఆన్ లైన్ చెల్లింపులకు గూగుల్ పేను విరివిగా వినియోగిస్తున్నారు. గూగుల్ కు చెందిన పేమెంట్ యాప్ గూగుల్ పే యూజర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు గూగుల్ పే ద్వారా మొబైల్ రీఛార్జ్ లు చేస్తే ఏ విధమైన ఫీజు లేకుండా పూర్తి ఉచితంగా ఉండేది. కానీ ఇకపై అలా కుదరదు. మొబైల్ రీఛార్జ్ చేస్తే ఫీజు చెల్లించాల్సిందేనట. ఏ పేమెంట్‌ మోడ్‌ అయినా కన్వీనియన్స్‌ ఫీజు రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేయబోతోందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మొబైల్ రీఛార్జ్ ల విషయంలో ఫోన్ పే, పేటీఎం ఇప్పటికే కొంత ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వరుసలో గూగుల్ పే కూడా చేరింది. ఫోన్ రీఛార్జ్ లపై ఫీజు వసూలు చేసేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇటీవల గూగుల్ పేకు చెందిన యూజర్ తన మొబైల్ రీఛార్జ్ చేయగా తనకు కన్వీనియన్స్ ఫీజు రూపంలో గూగుల్ పే వసూల్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అతడు గూగుల్‌ పే ద్వారా జియో ప్రీపెయిడ్‌ రూ.749 ప్లాన్‌ను రీఛార్జి చేయగా, రూ.3 కన్వీనియన్స్‌ ఫీజు రూపంలో గూగుల్‌ పే వసూలు చేసినట్లు వెల్లడించాడు. జీఎస్టీతో కలిపి మొత్తం రూ.752 చూపించిందని సంబంధిత స్క్రీన్‌ షాట్ షేర్‌ చేశాడు. అయితే ఈ ఫీజు విషయమై గూగుల్ పే అధికారికంగా వెల్లడించలేదు. కాగా ప్రస్తుతం కొంత మంది యూజర్లకు ఫీజు వసూలు చేస్తుండగా మున్ముందు అందరి నుంచి ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం.

గూగుల్ పే వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజు ఎంత?

రూ. 100 వరకు మొబైల్ రీఛార్జ్‌పై ఛార్జీలు లేవు
రూ. 101 నుండి రూ. 200 వరకు మొబైల్ రీఛార్జ్‌పై రూ. 1 కన్వీనియన్స్ ఫీజు
రూ.201 నుంచి రూ.300 వరకు మొబైల్ రీఛార్జ్‌పై రూ.2 కన్వీనియన్స్ ఫీజు
రూ. 301 కంటే ఎక్కువ మొబైల్ రీఛార్జ్‌పై రూ. 3 కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.