Keerthi
ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ పేమెంట్ యాప్స్‌లో 'గూగుల్-పే' ముందువరుసలో ఉంటుంది. మరి అలాంటి గూగుల్ పే సేవలకు సంబంధించి సంస్థ ఓ భారీ షాక్ ను ఇచ్చింది. ఇంతకి అదేమిటంటే..
ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ పేమెంట్ యాప్స్‌లో 'గూగుల్-పే' ముందువరుసలో ఉంటుంది. మరి అలాంటి గూగుల్ పే సేవలకు సంబంధించి సంస్థ ఓ భారీ షాక్ ను ఇచ్చింది. ఇంతకి అదేమిటంటే..
Keerthi
దేశంలో చాలామంది ఎక్కువగా ఆన్ లైన్ పేమెంట్ సేవాలనే ఉపాయోగిస్తుంటారు. అందులో ఎక్కువగా శాతం ప్రజాదరణ పొందిన యాప్ లలో గూగుల్ పే అనేది ముందు వరుసలో ఉంది. ఈ యాప్ వినియోగదారులు సులభంగా ఉపయోగించేందుకు వీలుగా చాలా రకాల ఫీచర్లతో అందిస్తోంది. ప్రస్తుతం ఈ ‘గూగుల్-పే’ 180 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రతిఒక్క ఆర్ధిక అవసరానికి UPI పేమెంట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్న చిన్న వస్తువుల కొనుగోలు మొదలు.. షాపింగ్, మొబైల్ రీఛార్జ్ మొదలగు అవసరాలకు ఈ డిజిటల్ పేమెంట్ ను ప్రతిఒక్కరు వాడుతుంటారు. మరి, ఇలాంటి సమయంలో ఈ గూగుల్ పే సేవలుకు సంబంధించి సంస్థ ఓ భారీ షాక్ ను ఇచ్చింది. ఇంతకి అదేమిటంటే..
ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ పేమెంట్ యాప్స్‌లో ‘గూగుల్-పే’ ముందువరుసలో ఉంటుంది. మరి అలాంటి ఈ ‘గూగుల్-పే’ సేవలను త్వరలో నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఈ సేవలను 2024 జూన్ 4 నుంచి అమెరికాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి కారణమేమిటంటే.. అమెరికాలో ఎక్కువమంది గూగుల్ పే కంటే, గూగుల్ వాలెట్ ను ఎక్కుగా ఉపయోగిస్తున్నందున సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పైగా ఈ యాప్ ద్వారా పేమెంట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా తర్వాత షాపింగ్స్ ఇతర ఆన్ లైన్ పేమెంట్ చేసేటప్పుడు ‘ట్యాప్ అండ్’ పే పద్ధతిలో పని సులభంగా పూర్తయిపోతుంది. అయితే, కేవలం ఈ ఆన్ లైన్ పేమెంట్ కోసం మాత్రమే కాకుండా.. ట్రాన్సిట్ కార్డుల, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఐడీ కార్డ్స్ వంటి డాక్యుమెంట్ కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. అందుకే అమెరికాలో గూగుల్ పే కంటే గూగుల్ వాలెట్ కే ఎక్కువ ఆదరణ లభిస్తుంది.
ఇక 2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపాయోగించుకోవచ్చు. ఆ గడువు దాటిన తర్వాత అమెరికన్ యూజర్లు ట్రాన్సక్షన్స్ చేసుకోవడానికి అవకాశం లేదు. అయితే, ఈ గూగుల్ పే నిలిపివేత అనేది ఒక్క అమెరికాలోనే చేస్తున్నామని.. భారతదేశం, సింగపూర్ వంటి దేశాల్లో ఇది యధావిధిగా సేవలను అందిస్తుందని తెలిపారు. కాబట్టి, వివిధ దేశాల్లోని వినియోగదారులు ఎంటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గూగుల్ పే సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా.. ఆయా దేశాల్లోని యూజర్లకు కావలసిన మరిన్ని సేవలను అందించడానికి సంస్థ ఈ యాప్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం అందింది. మరి, గూగుల్ పే సంస్థ అమెరికాలోని సేవలను నిలిపివేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.