iDreamPost
android-app
ios-app

Reliance Jio: జియో యూజర్లకి అదిరిపోయే శుభవార్త చెప్పిన ముఖేష్ అంబానీ!

  • Published Aug 29, 2024 | 4:52 PM Updated Updated Aug 29, 2024 | 6:08 PM

Reliance: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో భాగంగా ముఖేష్ అంబానీ ప్రసంగించారు. రిలయన్స్ జియో యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.

Reliance: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో భాగంగా ముఖేష్ అంబానీ ప్రసంగించారు. రిలయన్స్ జియో యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.

Reliance Jio: జియో యూజర్లకి అదిరిపోయే శుభవార్త చెప్పిన ముఖేష్ అంబానీ!

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన 47వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నేడు నిర్వహించింది. ఈ సమావేశంలో భాగంగా ముఖేష్ అంబానీ 35 లక్షల షేర్ హోల్డర్ల గురించి ప్రసంగించారు. ముందుగా తన ప్రసంగంలో బోర్డ్ మెంబర్స్‌ని పరిచయం చేశారు. అలాగే మూడో సారి విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపారు. 2027 నాటికి ఇండియా ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక దేశంగా అవతరించనుందని తెలిపారు. ఈ సమావేశంలో షేర్ హోల్డర్లకు 1:1 పద్ధతిలో ఒక బోనస్ షేరును ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అంటే ఒక్కో రిలయన్స్ షేరు ఒక రూపాయికే ఇవ్వబడుతుందని అన్నారు.

1.45 గంటలకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీనిపై బోర్డు సభ్యులు సెప్టెంబర్ 5న సమావేశం కానున్నట్టు తెలిపారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రసంగంతో ఈ సమావేశం ప్రారంభం కాగానే..దెబ్బకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పెరిగాయి.. అంబానీ ప్రసంగంతో రెండు శాతానికి పైగా షేర్లు పెరిగాయి. ఈ సమావేశంలో.. తన రిలయన్స్ గ్రూప్ కి సంబంధించిన రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ కంపెనీల ఐపీఓకి సంబంధించిన ఫోటోని ముఖేష్ అంబానీ చూపించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై రిలయన్స్ దృష్టి పెట్టిందని అన్నారు. గత సంవత్సరం ఏకంగా 1.7 లక్షల ఉద్యోగాలు కల్పించామని ముఖేష్ అంబానీ అన్నారు.

good news for jio users

ప్రసంగంలో భాగంగా రిలయన్స్ జియో యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. జియో యూజర్లకు ఏకంగా 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా ఇస్తున్నట్టు అంబానీ ప్రకటించారు. ఈ సర్వీస్ పేరు జియో ఏఐ క్లౌడ్.. జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా జియో యూజర్లు 100 జీబీ దాకా క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా పొందే ఆఫర్ ఇచ్చారు. ఈ బంపర్ ఆఫర్ వలన జియో వినియోగదారులు తమ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఇంకా అలాగే ఏవైనా ఇతర ఫైల్స్ ను ఫ్రీగా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇక అంతకన్నా ఎక్కువ స్టోరేజ్ కోరుకునే వారికి అందుబాటు ధరలకే స్టోరేజ్ ఆప్షన్స్ ఉంటాయని ముకేష్ అంబానీ ప్రకటించారు. దీపావళి పండుగ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ఇంకా అలాగే హలో జియో పేరుతో సెటప్ బాక్స్ కోసం టీవీ ఓఎస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు అంబానీ తెలిపారు. ఇకపై జియో ఫైబర్ రిమోట్‌లో AI బటన్‌తో కొత్త ఫీచర్ రానుందని అన్నారు..ఈ సమావేశంలో తన వారసులకు కంపెనీల బాధ్యతలు అప్పగించారు ముకేష్ అంబానీ. ఇషాకు రిటైల్‌, ఆకాశ్‌కి జియో, అనంత్‌కి న్యూ ఎనర్జీ బిజినెస్‌లు అప్పగిస్తున్నట్లు అంబానీ తెలిపారు.