iDreamPost

LICలో ఏదైనా పాలసీ కట్టి ఉన్నారా? మీ అందరికీ అదిరిపోయే శుభవార్త!

Good News To LIC Customers: ఎల్ఐసీలో పాలసీ కట్టారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఎల్ఐసీ ఇప్పుడు కస్టమర్లకు మరింత మేలు చేసే విధంగా అడుగులు వేస్తోంది. ఈ కారణంగా కస్టమర్లకు రెండు రకాలుగా లబ్ది పొందనున్నారు. ఆ వివరాలు మీ కోసం.

Good News To LIC Customers: ఎల్ఐసీలో పాలసీ కట్టారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఎల్ఐసీ ఇప్పుడు కస్టమర్లకు మరింత మేలు చేసే విధంగా అడుగులు వేస్తోంది. ఈ కారణంగా కస్టమర్లకు రెండు రకాలుగా లబ్ది పొందనున్నారు. ఆ వివరాలు మీ కోసం.

LICలో ఏదైనా పాలసీ కట్టి ఉన్నారా? మీ అందరికీ అదిరిపోయే శుభవార్త!

ఎల్ఐసీ గురించి తెలియనివాళ్ళు ఉండరు. కస్టమర్లకు అద్భుతమైన జీవిత బీమా పాలసీలను అందించడంలో నంబర్ వన్ గా ఉంది. ఇందులో పెట్టుబడులు పెడితే గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయన్న నమ్మకం ఉంది. పైగా తక్కువ పెట్టుబడితో అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువ మంది ఎల్ఐసీలో పాలసీలు కడుతుంటారు. అయితే పాలసీలు కట్టేవారే కాకుండా.. ఎల్ఐసీలో షేర్లు కొన్నవారు కూడా ఉన్నారు. 2022 మే నెలలో ఎల్ఐసీ స్టాక్ లిస్టింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇటీవల ఎల్ఐసీ ఇష్యూ చేసిన ధరను దాటేసింది. జనవరిలో ఐపీఓ ధరను దాటేసిన ఎల్ఐసీ.. ఎస్బీఐని బీట్ చేసి అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్ధగా నిలిచింది. అయితే  ఎంత ఫాస్ట్ గా అయితే లేచిందో.. ఆ తర్వాత క్రమంగా ఎల్ఐసీ షేర్ విలువ పడిపోతూ వచ్చింది.

భారీ లాభాలు:

ఎల్ఐసీ షేర్లు దారుణంగా కుప్పకూలుతూ వచ్చాయి. ఈ క్రమంలో చాలామంది ఎల్ఐసీలో షేర్లు కొన్నవారు ఆందోళన చెందారు. ఎల్ఐసీ దివాళా తీయడం ఖాయమని అన్నారు. పాలసీలు కట్టిన వారు తమ డబ్బుల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనా అని కంగారు పడ్డారు. కట్ చేస్తే పడిపోయిన షేర్లు ఒక్కసారిగా మళ్ళీ పుంజుకున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ. 13,763 కోట్ల నికర లాభాన్ని సంస్థ ప్రకటించింది. ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకంగా ఉండడంతో ప్రతి షేర్ మీద రూ. 6 చొప్పున చివరి డివిడెండ్ ని ప్రకటించింది. ఈ సంస్థలో భారత ప్రభుత్వం 96.5 శాతం వాటా కలిగి ఉంది. దీంతో ప్రభుత్వం 3,662 కోట్ల రూపాయల డివిడెండ్ ని అందుకోనుంది.

ఆరోగ్య బీమా రంగంలో ప్రవేశం:

ఈ క్రమంలో ఎల్ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపింది. ఇప్పటివరకూ ఎల్ఐసీ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని మాత్రమే అందించింది. ఇక నుంచి ఆరోగ్య బీమాని కూడా అందించేందుకు రెడీ అవుతోంది. లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో టాప్ లో ఉన్న ఎల్ఐసీ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో కూడా మార్కెట్ లీడర్ గా ఎదగాలని భావిస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో తమ పరిధిని విస్తరించే దిశగా అడుగులు వేస్తుంది. సామాన్యులపై బీమా ఖర్చులను తగ్గించడానికి అందుబాటులో ఉన్న పలు మార్గాలను పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలిస్తోంది. ప్రజలపై భారాన్ని తగ్గించడానికి బీమా పాలసీలను రూపొందిచాలని ఎల్ఐసీ సిఫార్సు చేసింది.

ఎల్ఐసీ నిర్ణయంతో ప్రయోజనాలు:

2022-23 ఆర్థిక ఏడాది చివరి నాటికి జారీ చేసిన 55 కోట్ల ఆరోగ్య బీమా పాలసీల్లో కేవలం 2.3 కోట్ల పాలసీలు మాత్రమే ఉన్నాయి. ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశం. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో ప్రవేశించి సామాన్యులకు ప్రయోజనం చేకూర్చాలని భావిస్తుంది. ఇప్పటికే ఎల్ఐసీ జీవిత బీమా పాలసీలు కట్టి ఉన్నవారికి ఇప్పుడు రెండు రకాలుగా ప్రయోజనం చేకూరనుంది. ఒకటి ఎల్ఐసీ పెట్టుబడులు పెరగడం వల్ల పాలసీలు కట్టిన వారికి కంపెనీ స్ట్రాంగ్ గా నిలబడుతుందన్న నమ్మకం, భరోసా కలగడం. రెండు.. హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆ సంస్థ విస్తరణ పెరగడమే కాకుండా తక్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమాను పొందే అవకాశం ఉండడం.

ఒకే సంస్థ నుంచి అటు జీవిత బీమా, ఇటు ఆరోగ్య బీమా రెండూ అందుతుండడం ఇప్పుడు ఎల్ఐసీ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే అంశం. దీనికి తోడు ప్రస్తుతం ఎల్ఐసీ లాభాల బాటలో దూసుకుపోతున్న కారణంగా సంస్థ.. ఎల్ఐసీ కస్టమర్లకు మరింత మేలు చేసే విధంగా పాలసీ విధానాలను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే.. ఎల్ఐసీ తక్కువ ధరకు ఆరోగ్య బీమాలు అందించడం వల్ల మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలపై ప్రభావం పడుతుంది. ఈ పోటీని తట్టుకుని నిలబడేందుకు ప్రీమియంలు తగ్గించే అవకాశం ఉండచ్చు. కాబట్టి ఇది నాన్ ఎల్ఐసీ కస్టమర్లకు మేలనే చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి