iDreamPost
android-app
ios-app

UPI పేమెంట్స్ చేసే వారికి శుభవార్త.. ఒకేసారి రూ.5 లక్షల వరకు..

  • Published Sep 15, 2024 | 5:24 PM Updated Updated Sep 15, 2024 | 5:36 PM

UPI Payments: ఈ మధ్య కాలంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు డిజిటల్ పేమెంట్స్ ద్వారానే ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు యూపీఐ పేమెంట్స్ విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.

UPI Payments: ఈ మధ్య కాలంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు డిజిటల్ పేమెంట్స్ ద్వారానే ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు యూపీఐ పేమెంట్స్ విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.

UPI పేమెంట్స్ చేసే వారికి శుభవార్త.. ఒకేసారి రూ.5 లక్షల వరకు..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక లావాదేవీల విషయంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోట్ల మంది ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. డిజిటల్ పేమెంట్లలో యూనిఫైట్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI)దే అగ్రస్థానం అని చెప్పొచ్చు. డిజిటల్ పేమెంట్స్ కి ఒక పరిమితి ఉంటుంది.. అంతకు మించి ఆర్థిక లావాదేవీలు జరపలేదరు. తాజాగా యూపీఐ పేమెంట్స్ దారులకు శుభవార్త. వివరాల్లోకి వెళితే..

దేశంలో ప్రతిరోజు కోట్లల్లో జరిగే ట్రాన్సక్షన్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో చాలా వరకు డిజిటల్ పేమెంట్సే ఎక్కువగా జరగుతున్నాయి. యూపీఐ పేమెంట్లకు లిమిట్ అనేది ఉంటుంది. బ్యాంకులను బట్టి ఈ పరిమితి మారుతున్నా.. ఇప్పటి వరకు ఒకసారి గరిష్టంగా రూ.1 లక్ష వరకు మాత్రమే పంపించేందుకు అవకాశం ఉంది. అయితే దీనిని పంచాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఒకేసారి రూ.5 లక్షల వరకు పేమెంట్స్ చేసేందుకు తగు చర్యలు చేపట్టాయి.

ఆదాయపన్ను శాఖ చెల్లింపులకు సంబంధించి రూ.5 లక్షల వరకు ఒకేసారి యూపీఐ విధానంలో పేమెంట్స్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అనుతినిచ్చంది. ఆదివారం (సెప్టెంబర్ 15) నుంచి రూ.5 లక్షల వరకు లావాదేవీలు జరుపుకునే అవకాశం లభించింది. గత నెల ఆగస్టులో ద్రవ్య పరిమితి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఐ దరఖాస్తు చేసుకునేందుకు సైతం రూ.5 లక్షలు పేమెంట్స్ చేయొచ్చు. అలాగే ప్రభుత్వం సెక్యూరిటీల కొనుగోలుకు ఈ కొత్త పద్దతి వర్తిస్తుంది ఎన్‌పీసీఐ తెలియజేసింది.