iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం ధరలు

పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం ధరలు

గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఊహించని విధంగా పెరగటం మొదలైంది. శ్రావణమాసం కావటంతో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. నాలుగు రోజుల్లో బంగారం ధర దాదాపు 400 రూపాయలు పెరగ్గా.. వెండి ఏకంగా 3500 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల  22 క్యారెట్ల బంగారం ధర 54,500 రూపాయలుగా ఉంది. ఇక, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,450 రూపాయలుగా ఉంది.

నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,750 రూపాయులు కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,700 రూపాయలుగా ఉంది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు.. పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని బంగారం నిలబడుతోంది. అందుకే ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇక, వెండి ధరల్లో కూడా మార్పు రాలేదు. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర 80 వేల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రేటు 76, 900 రూపాయలుగా ఉంది. నిన్న వెండి ధర బాగా పెరిగింది. శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 1500 రూపాయలు పెరిగింది. శ్రావణమాసం కావటంతో దేశంలో పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. దీంతో వెండి ధర కూడా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే రోజుల్లో కిలో వెండి 90 వేలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి, బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా ఉండటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.