iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3వ రోజు కూడా అదే రేట్లు!

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3వ రోజు కూడా అదే రేట్లు!

పసిడి ప్రియులకు ఊరటతో పాటు సంతోషం కలిగించేలా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా మూడవ రోజు కూడా బంగారం ధరలు పెరగలేదు. గ్లోబల్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, ఇతర విషయాలతో పాటు దేశీయంగా బంగారం డిమాండ్‌ను బట్టి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. బంగారం ధరలపై చాలా విషయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. అయినప్పటికి గత మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో దేశీయంగా ఎలాంటి మార్పులు జరగలేదు.

నిన్న హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,500లుగా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 59,400లుగా ఉండింది. ఇక, సోమవారం నాడు కూడా హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధరలు అలానే ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,500లుగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 59,400లుగా ఉంది. వెండి ధరల్లో కూడా మార్పు లేదు. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర 80 వేల రూపాయల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మిగిలిన ముఖ్య నగరాల్లో బంగారం ధరలు చూసుకున్నట్లుయితే.. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,650లుగా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,600లుగా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,500లుగా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,540లుగా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,800లుగా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,780లుగా ఉంది. ఈ బంగారం ధరలు జీఎస్‌టీ, టీసీఎస్‌తో కలిపి కాకుండా ఇవ్వటం జరిగింది. లోకల్‌ షాపుల్లో ధరలకు.. మార్కెట్‌ ధరలకు కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. మరి, మూడవ రోజు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.