iDreamPost
android-app
ios-app

ఒక్కసారిగా దిగి వస్తున్న బంగారం ధర! ఇది కదా లాభాలకి బెస్ట్ టైమ్!

Gold Prices Drop Again.. బంగారం.. బంగారం.. నీకై వేచానే అని నిజంగా పాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. గత కొన్ని రోజులుగా పసిడి ధర తగ్గుముఖం పడుతూ వస్తుంది. బడ్జెట్ ప్రభావం దీనిపై బాగానే ప్రభావితం చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. గత రెండు రోజులుగా గోల్ట్ అండ్ సిల్వర్ ధరలు ఢమాల్ అంటున్నాయి.

Gold Prices Drop Again.. బంగారం.. బంగారం.. నీకై వేచానే అని నిజంగా పాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. గత కొన్ని రోజులుగా పసిడి ధర తగ్గుముఖం పడుతూ వస్తుంది. బడ్జెట్ ప్రభావం దీనిపై బాగానే ప్రభావితం చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. గత రెండు రోజులుగా గోల్ట్ అండ్ సిల్వర్ ధరలు ఢమాల్ అంటున్నాయి.

ఒక్కసారిగా దిగి వస్తున్న బంగారం ధర! ఇది కదా లాభాలకి బెస్ట్ టైమ్!

గోల్ట్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. మహిళలు మాత్రమే కాదు పురుషులు సైతం బంగారంపై మక్కువ చూపుతున్నారు. ఫంక్షన్ ఏదైనా సరే పసిడి నగలు ధరించాల్సిందే. ఈ మధ్య కాలంలో స్టేటస్ సింబల్ అయ్యింది పుత్తడి. అలాగే అవసరాలకు అక్కరకు వస్తుంది. అందుకే నానాటికి బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. పోనీ పోనూ బంగారం ధర పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఇది మరొక రీజన్ అయ్యింది గోల్ట్ పర్చేస్ చేయడానికి. అలాగే ఒకేసారి కొనుగోలు చేయలేని వాళ్లు సైతం స్కీమ్‌ల రూపంలో కొనుగోలు చేస్తున్నారు. దీంతో దీనికి డిమాండ్ పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ధర అమాంతం పెరుగుతూ వచ్చింది. గత ఏడాది చివరిలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. 70 వేలు దాటి రూ. 75 వేలకు చేరువైంది.

అలాగే ఆర్నమెంట్ బంగారం కూడా సుమారు 70 వేలకు చేరువైంది. దీంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు కొనలేని పరిస్థితి. దీంతో బంగారం షాపులు కూడా చిన్నబోయాయి. అయితే అంతకు ముందు కొనుగోలు చేసిన వారు ఈ ధరను చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. కొత్తగా పర్చేస్ చేయాలనుకున్న వారు ఈ ధరలు చూసి మూర్చపోయినంత పనైంది. దీంతో దిగులు చెందుతున్న సమయంలో బడ్జెట్ సమావేశాలు వచ్చాయి. కేంద్ర ఆర్థిక మంత్రి బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని 6 శాతానికి తగ్గినట్లు ప్రకటించారు. ఆ రోజు నుండే బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టిన రోజే 10 గ్రాముల పసిడిపై సుమారు రూ. 3 వేలకు తగ్గింది. దీంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది గోల్ట్ లవర్స్.

అలాగే తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం కూడా బంగారం మరింత తగ్గింది. మొన్నటి వరకు రికార్డు స్థాయి ధర పలికిన పుత్తడి.. ఇప్పుడు నేల చూపులు చూస్తుంది. సుమారు నాలుగు నెలల తర్వాత  24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్ట్ 70 వేల దిగువకు వచ్చింది. ఇక ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై 104 రూపాయలు తగ్గింది. దీంతో గ్రాము ధర 6,982 రూపాయలుగా నమోదైంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 69, 820కి తగ్గింది. అలాగే ఆర్నమెంట్ బంగారం.. 22 క్యారెట్స్ గ్రాము పసిడి ధరపై 95 రూపాయలు తగ్గింది. ఈ రోజు 22 క్యారెట్ల గ్రాము గోల్డ్ రేట్ రూ.6,400గా నమోదైంది. 10 గ్రాముల పసిడి ధర రూ. 64 వేలుకు తగ్గుముఖం పట్టింది. వెండి కూడా ఇదే బాటలో నడుస్తుంది. కిలో వెండిపై 3 వేలు తగ్గింది. అయితే ఇదే బంగారు కొనుగోలుకు మంచి తరుణం అంటున్నారు నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి