iDreamPost

పండగ వేళ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. సంక్రాంతి పండగ వేళ తులం గోల్డ్ పై భారీగా ధర పెరిగింది. కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. నేడు తులం బంగారం ధర ఎంతుందంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. సంక్రాంతి పండగ వేళ తులం గోల్డ్ పై భారీగా ధర పెరిగింది. కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. నేడు తులం బంగారం ధర ఎంతుందంటే?

పండగ వేళ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

పండగ వేళ బంగారం ధరలు షాకిస్తున్నాయి. అతకంతకు పెరుగుతూ పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. గోల్డ్ కొందామనుకునే వారు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సీజన్ తో సంబంధం లేకుండా గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాకూడా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులం గోల్డ్ ధర ఎంతుందంటే?

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల తులం బంగారంపై రూ. 300 పెరిగింది. దీంతో నిన్న రూ. 57,700 వద్ద కొనసాగిన బంగారం ధర నేడు పెరిగిన ధరతో రూ. 58,00వద్దకు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 320 పెరిగింది. దీంతో నిన్న రూ. 62,950 వద్ద అమ్ముడైన పసిడి నేడు పెరిగిన ధరతో రూ. రూ. 63,270 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక దేశంలో నిప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, ముంబాయి, బెంగళూరు వంటి నగరాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,420గా ఉంది.

వెండి

ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. సిల్వర్ ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. నేడు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆదివారం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 500 పెరిగి.. రూ. 78,000 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,000 వద్ద ట్రేడ్ అవుతోది. ఢిల్లీ కిలో వెండి ధర రూ. 76,500 కు చేరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి