iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..!

  • Published Oct 20, 2023 | 8:48 AM Updated Updated Oct 20, 2023 | 8:48 AM

ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత నెల ప్రతిరోజూ తగ్గిపోతూ వచ్చిన పసిడి పది రోజుల నుంచి చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో పసిడి కొనుగోలు బాగా పెరిగిపోతుంది.

ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత నెల ప్రతిరోజూ తగ్గిపోతూ వచ్చిన పసిడి పది రోజుల నుంచి చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో పసిడి కొనుగోలు బాగా పెరిగిపోతుంది.

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..!

దేశంలో ప్రతిరోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరి దేనికీ లేదనే చెప్పొచ్చు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు బంగారం ఆభరణాలు అంటే ఇష్టపడతారు. ఇక దేశంలో పండుగల సీజన్ వచ్చిందంటే చాలు జ్యులరీ షాపులు కిటకిటలాడుతుంటాయి. గత నెల పసిడి ధరలు తగ్గుతూ వచ్చినప్పటికీ.. పది రోజుల నుంచి మళ్లీ పెరిగిపోతూ షాక్ ఇస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాల మధ్య జరుగుతున్న యుద్దం కారణంగానే పసిడి ధరల్లో మార్పులు వస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. నేటి బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఇటీవల బంగారం కొనుగోలుదారుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. దీంతో దేశంలో బంగారానికి బాగా డిమాండ్ పెరిగిపోయింది. దసరా, దీపావళి పండుగలకు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం కోసం  మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా విజయదశమి రోజు బంగారం కొంటే బాగా కలిసి వస్తుందని మహిళలు నమ్మకం. ధరలతో సంబంధం లేకుండా పసిడి కొనుగోలుపై మహిళలు మక్కువ చూపిస్తుంటారు. వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర పై రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై 270 వరకు పెరిగింది. ఇక వెండి మాత్రం రూ.500 వరకు తగ్గింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,760 వద్ద కొనసాగుతుంది. దేశంలోని మహానగరాలు ముంబై, కోల్‌కొతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,760 వద్ద ట్రెండ్ అవుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,910 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,930 వద్ద ట్రెండ్ అవుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర 77,500 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74, 100, చెన్నైలో కిలో వెండి రూ.77,500, ముంబైలో కిలో వెండి ధర రూ.74,100 వద్ద కొనసాగుతుంది.