P Krishna
Gold and Silver Rates:ఈ మధ్య కాలంలో పసిడి ధరల్లో తీవ్ర ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. గోల్డ్, సిల్వర్ ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. గత వారం రోజుల్లో గోల్డ్ రేట్లో భారీ మార్పు కనిపిస్తుంది. నిన్నటితో పోల్చితే ఈరోజు చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది.
Gold and Silver Rates:ఈ మధ్య కాలంలో పసిడి ధరల్లో తీవ్ర ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. గోల్డ్, సిల్వర్ ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. గత వారం రోజుల్లో గోల్డ్ రేట్లో భారీ మార్పు కనిపిస్తుంది. నిన్నటితో పోల్చితే ఈరోజు చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది.
P Krishna
ఈ నెల ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం మొదలైంది. ప్రస్తుతం దేశంలో పండుగలు, పెళ్లిళ్లు, పూజలు, వ్రతాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుభకార్యాలు అనగానే మగువలు పసిడి కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకు తగ్గట్టు జ్యులరీ షాపులో ఎప్పటికప్పుడు కొత్త రకం డిజైన్లతో ఆభరనాలు తయారు చేసి అమ్ముతుంటారు. ఇటీవల బంగారం మాత్రం కొనేస్థితిలో లేవు.. కొన్నిరోజులుగా పుత్తడి, వెండి ధరలు పడుతూ లేస్తు ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక మార్పులు వీటి ధరలపై పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు అదిరిపోయే శుభవార్త.ఈ వారంలో పసిడి ధరలు పడుతూ.. లేస్తూ వస్తున్నాయి. నిన్న కాస్త షాక్ ఇచ్చిన బంగారం ఈ రోజు తగ్గుముఖం పట్టింది. గురువారంతో పోల్చితే నేటి ధరలు గరిష్ట స్థాయికి తగ్గాయి. కాకపోతే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. గత నెల కన్నా ఈ నెల బంగారం ధరలు బాగా పెరిగిపోయాయి. దేశంలో బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు పై రూ.400 తగ్గి,రూ. 66,940 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు పై రూ.400 తగ్గి, రూ73,360 కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 66,940 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ73,360 వద్ద కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,940 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు,కోల్‌కొతా, కేరళా, పూణే లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,790 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. గురు, శుక్ర వారాల్లో పెద్దగా మార్పు లేదు. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 92,080 ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కొతా, కేరళాలో కిలో వెండి ధర రూ.85,080 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో రూ. 83,930, చెన్నైలో కిలో వెండి ధర రూ. 84,120 వద్ద కొనసాగుతుంది.