స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

Today Gold and Silver Prices: బంగారం ప్రియులకు నిరాశే. మళ్లీ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. వరుసగా దిగివచ్చిన గోల్డ్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు తులం ఎంత ఉందంటే?

Today Gold and Silver Prices: బంగారం ప్రియులకు నిరాశే. మళ్లీ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. వరుసగా దిగివచ్చిన గోల్డ్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు తులం ఎంత ఉందంటే?

పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు బంగారం ప్రియులు. ఇక ఇప్పుడు శ్రావణ మాసం కొనసాగుతున్నది. ఈ సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో బంగారం కొనే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో గోల్డ్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇక కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఓరోజు తగ్గుతూ.. మరో రోజు పెరుగుతూ షాకిస్తున్నాయి. ధరలు మళ్లీ పెరుగుతుండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో తులం పసిడి ధర ఎంత ఉందంటే?

దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.10 పెరిగి.. రూ. 67,160కి చేరింది. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 10 పెరిగడంతో రూ.67,160కి చేరుకుంది. 24 క్యారెట్ల పసిడి ధరపై రూ. 10 పెరగడంతో రూ. 73,260 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధలరు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,310 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,410కి చేరుకుంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,160గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,260గా ఉంది.

బంగారం ధరలు పెరగగా వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. నేడు కిలో సిల్వర్ పై రూ. 100 తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో సిల్వర్ ధర రూ. 93,400కి చేరింది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 88,400.. బెంగళూరులో రూ. 85,100గా ఉంది. ఇక దేశ రాజాధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ. 88400వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు బంగారం, వెండి ధరల్లో మార్పులకు కారణమవుతున్నాయి.

Show comments