iDreamPost
android-app
ios-app

పసిడి కొనేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు. ఈ రోజు ఎంతంటే?

  • Published Sep 14, 2024 | 8:49 AM Updated Updated Sep 14, 2024 | 8:49 AM

Today Gold and Silver Rates in Hyderabad: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఒకటీ రెండు రోజులు మినహాయించి వరుసగా తగ్గుతూ వచ్చింది.

Today Gold and Silver Rates in Hyderabad: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఒకటీ రెండు రోజులు మినహాయించి వరుసగా తగ్గుతూ వచ్చింది.

పసిడి కొనేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు. ఈ రోజు ఎంతంటే?

గత ఏడాది పసిడి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఏడాది కూడా వరుసగా పెరిగిపోతూ వచ్చిన పసిడి గరిష్టానికి ఏకంగా రూ.75 వేలకు చేరుకుంది. ఇటీవల పార్లమెంట్ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పసిడిపై ఆరు శాతం సుంకం తగ్గించారు. ఆ మరుసటి రోజు నుంచి పసిడి, వెండి ధరల్లో భారీ మార్పులు సంభవించాయి. కాకపోతే పది రోజుల తర్వాత మళ్లీ ధరలు పుంజుకున్నాయి. ఈ నెలలో పుత్తడి ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి. దీంతో కొనుగోలుదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. పసిడి కొనేవారికి మళ్లీ షాక్ ఇచ్చింది బంగారం. ఈ రోజు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ షాక్ ఇచ్చింది. వరుసగా తగ్గుముఖం పడుతున్న బంగారం ఏ క్షణంలో పెరిగిపోతుందో అన్న అనుమానాలు కొనుగోలుదారులకు ఉన్నాయి.. అది నిజం చేస్తూ ఈ రోజు పసిడి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ లో కీలక పరిణామాలు ఏర్పడటంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు ఏర్పడినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను సెప్టెంబర్ సమీక్షలోనే తగ్గించనున్నట్లు ప్రకటన చేసింది. ఇక రిజర్వ్ బ్యాంక్ కూడా ఇదే అనుసరించబోతుంది.. సాధారణంగా వడ్డీ రేట్లు పెంచితే.. డాలర్ డిమాండ్ పెరిగి బంగారం ధర తగ్గుతుంది, వడ్డీ రేట్లను తగ్గిస్తే.. పసిడి ధర పెరిగిపోతుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి, రూ.68,260 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి,రూ.74,460 కి చేరింది. ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.74,460 వద్ద కొనసాగుతుంది.

ఇక దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,410 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ74,610 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.74,460 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.74,460 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగి రూ. 95,100 కి చేరింది. చెన్నై, కేరళా, తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.95,100 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.89600, బెంగుళూరు‌లో రూ.83,900 వద్ద కొనసాగుతుంది.