iDreamPost
android-app
ios-app

Home Loan: హోమ్ లోన్ పై రూ.2.60 లక్షల సబ్సిడీ పొందండిలా..

  • Published Feb 24, 2024 | 4:30 PM Updated Updated Feb 24, 2024 | 4:30 PM

సొంతింటి కలను సాకారం చేసుకోవడం కోసం హోమ్‌ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీరు తీసుకునే లోన్‌ మీద రూ.2.60 లక్షల సబ్సిడీ పొందవచ్చు. ఆ వివరాలు..

సొంతింటి కలను సాకారం చేసుకోవడం కోసం హోమ్‌ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీరు తీసుకునే లోన్‌ మీద రూ.2.60 లక్షల సబ్సిడీ పొందవచ్చు. ఆ వివరాలు..

  • Published Feb 24, 2024 | 4:30 PMUpdated Feb 24, 2024 | 4:30 PM
Home Loan: హోమ్ లోన్ పై రూ.2.60 లక్షల సబ్సిడీ పొందండిలా..

సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సొంతింట్లో కన్ను మూయాలని చాలా మంది భావిస్తారు. ఇక నేటి కాలంలో సొంతింటి కల అనేది ఎంతో ఖరీదైందిగా మారింది. ఇంటి నిర్మణానికి అవసరమైన ప్రతి దాని రేటు భారీగా పెరిగిపోయింది. ఇక ఈ కాలంలో డబ్బులు దాచుకుని ఇల్లు కడతామంటే అయ్యే పని కాదు. ఎంతో కొంత లోన్‌ తీసుకోవాల్సిందే. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.. హోమ్‌ లోన్‌ తీసుకోవాలని భావిస్తున్నారా.. అయితే మీకో శుభవార్త. మీరు తీసుకునే హోమ్‌లోన్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.2.67 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. ఎలా అంటే..

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇంటి నిర్మాణం కోసం 2.67 లక్షలు ఆర్థిక సాయం చేస్తోంది. ఇక మీరు కనక హోమ్‌ లోన్‌ తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటే.. కేంద్రం అందించే సాయాన్ని అనగా రూ.2.67 లక్షలని లోన్‌ మీద సబ్సిడీగా పొందవచ్చు. అయితే ఈ మొత్తాన్ని నేరుగా మీ చేతికి ఇవ్వరు. ఇది బ్యాంకులో జమ చేస్తారు. మీరు తీసుకునే లోన్‌ మొత్తం నుంచి ఇది కట్‌ అవుతుంది.

హోమ్‌లోన్‌కి అప్లై చేసే సమయంలోనే ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన స్కీమ్‌కు కూడా అప్లై చేసుకోవాలి. సొంతిల్లు లేని వారు ఈ పథకానికి అర్హులు. అయితే మీ వార్షిక ఆదాయం రూ.6లక్షల కన్నా తక్కువ ఉంటే.. మీకు పూర్తి సబ్సిడీ అనగా రూ. 2.67 లక్షలు లభిస్తుంది. అదే మీ వార్షికాదాయం 6 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటే 2.35 లక్షల రూపాయల సబ్సిడీ లభిస్తుంది. మీ ఏడాది ఆదాయం రూ.12 లక్షల నుంచి 18 లక్షల వరకు ఉంటే రూ.2.30 లక్షల సబ్సిడీ లభిస్తుంది.

బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, రీజినల్ రూరల్ బ్యాంక్‌లు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, రిజిస్టర్డ్ ఎన్‌బీఎఫ్‌సీలు వంటి వాటి వద్దకు వెళ్లి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్బన్ లోకల్ బాడీస్ ద్వారా కూడా రుణం కోసం అప్లై చేసుకునే అవకాశముంది. మీ సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి లోన్ కోసం సంప్రదిస్తే మంచిది. అలానే బ్యాంకులు రూ.6 లక్షల వరకు రుణానికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయకూడదు. రూ.6 లక్షలకు పైన మొత్తానికి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయవచ్చు. లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆదాయానికి సంబంధించి ప్రూఫ్‌లు, హౌస్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్, ఆధార్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.