iDreamPost
android-app
ios-app

స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా 20 వేలు! ఏ పనీ చేయక్కర్లేదు!

  • Published Aug 03, 2024 | 3:41 PM Updated Updated Aug 03, 2024 | 3:41 PM

Get Rent Every Month By Single Time Investment On Commercial Space Through Real Estate Investment Trusts: ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగం మాత్రమే చేస్తే సరిపోదు. ప్రతి నెలా వేరే ఆదాయ వనరు ఉండాలి. లేదంటే ఈ అద్దెలకి, పిల్లల చదువులకి, మిగతా ఖర్చులకి వచ్చే జీతం ఏ మాత్రం సరిపోదు. దీంతో చాలా మంది ఎలాగైనా కొంత ఆదాయం సమకూర్చుకోవాలని అనుకుంటారు. మీరు కనుక ప్రతి నెలా కొంత ఆదాయం సంపాదించాలనుకుంటే కనుక ఒక మార్గం ఉంది. అదే చిన్న ఖాళీ స్థలం మీద పెట్టుబడి పెట్టడం. ఖాళీ స్థలం మీద పెట్టుబడి పెడితే ప్రతి నెలా ఆదాయం ఎలా వస్తుంది? అని అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదివేయండి.   

Get Rent Every Month By Single Time Investment On Commercial Space Through Real Estate Investment Trusts: ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగం మాత్రమే చేస్తే సరిపోదు. ప్రతి నెలా వేరే ఆదాయ వనరు ఉండాలి. లేదంటే ఈ అద్దెలకి, పిల్లల చదువులకి, మిగతా ఖర్చులకి వచ్చే జీతం ఏ మాత్రం సరిపోదు. దీంతో చాలా మంది ఎలాగైనా కొంత ఆదాయం సమకూర్చుకోవాలని అనుకుంటారు. మీరు కనుక ప్రతి నెలా కొంత ఆదాయం సంపాదించాలనుకుంటే కనుక ఒక మార్గం ఉంది. అదే చిన్న ఖాళీ స్థలం మీద పెట్టుబడి పెట్టడం. ఖాళీ స్థలం మీద పెట్టుబడి పెడితే ప్రతి నెలా ఆదాయం ఎలా వస్తుంది? అని అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదివేయండి.   

స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా 20 వేలు! ఏ పనీ చేయక్కర్లేదు!

హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థలం కొనాలంటే సామాన్యులకి అయ్యే పరిస్థితి కాదు. చదరపు అడుగు స్థలం రూ. 5 వేలు, 10 వేలు, 20 వేలు, 30 వేలు ఇలా అత్యధిక ధరలు పలుకుతున్నాయి. దీంతో ఒక చిన్న స్థలం కొనలేని పరిస్థితి చాలా మందిది. అయితే మీకు తెలుసా? మీ దగ్గర ఉన్న డబ్బుతోనే మీరు స్థలం కొనుక్కోవచ్చు. అంతేకాదు మీరు స్థలం మీద పెట్టిన పెట్టుబడికి ప్రతి నెలా ఆదాయం సంపాదించుకోవచ్చు. రీట్స్ ద్వారా మీరు ప్రతి నెలా కొంత డబ్బు సంపాదించుకోవచ్చు. స్థలం కొని, అందులో ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేని వారికి ఫ్లాట్స్ ఎలాగో అలానే కమర్షియల్ స్పేస్ లు కూడా. మామూలు స్థలాలే కొనలేకపోతుంటే ఇక కమర్షియల్ స్పేస్ లు ఎలా కొనగలం అని అనుకోకండి. కమర్షియల్ స్పేస్ లు అంటే ఎక్కువ చదరపు అడుగులు ఉన్నదే కొనాల్సిన పని లేదు. మీ దగ్గర ఎంత డబ్బుంటే అంత డబ్బుతోనే కొనవచ్చు.

ఉదాహరణకు మీ దగ్గర 20 లక్షలు ఉన్నాయని అనుకుంటే.. మీరు సిటీలో ఒక ఏరియాలో చదరపు అడుగు స్థలం 10 వేలు చొప్పున చూసుకున్నా 200 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ వస్తుంది. పైగా దీని మీద కొన్న మరుసటి రోజు నుంచే రెంట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే నెలాఖరు వచ్చేసరికి మీకు ఆ 20 లక్షలు పెట్టి కొన్న కమర్షియల్ స్పేస్ మీద ప్రతి నెలా కొంత అద్దె వస్తుంది. ఈ మొత్తాన్ని నడిపించేది రీట్స్ అనే వ్యవస్థ. రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లని నిర్మించే పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ దీని కింద పని చేస్తారు. బిల్డర్స్ అందరి దగ్గర నిర్మాణం చేపట్టడానికి డబ్బులు ఉండవు. అలాంటి సమయంలో సాధారణ పబ్లిక్ తో ఒప్పందం కుదుర్చుకుంటారు. మీరు, మీలాంటి వాళ్ళు పెట్టే పెట్టుబడితో నిర్మాణాన్ని చేపడతారు. అయితే మీరు పెట్టుబడి పెట్టిన మొదటి రోజు నుంచే మీరు కొన్న స్థలానికి ప్రతి నెలా అద్దె ఆ బిల్డరే చెల్లిస్తారు. చెల్లించేలా రీట్స్ లో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఇన్నేళ్ల పాటు ఇస్తామని బిల్డర్ హామీ ఇస్తారు.

వీళ్ళకి లాభం ఏంటి అని అంటే నిర్మాణం పూర్తయితే ఏదో ఒక కంపెనీ వాళ్ళు ఆ కమర్షియల్ స్పేస్ ని లీజ్ కి తీసుకుంటారు. అందుకోసం వారు లక్షల్లో చెల్లిస్తారు. ఒకవేళ అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి కాకపోయినా బిల్డర్ దే బాధ్యత. నిర్మాణంతో సంబంధం లేకుండా మీరు కమర్షియల్ స్పేస్ మీద పెట్టిన పెట్టుబడికి ప్రతి నెలా బిల్డర్ తన సొంత డబ్బుని చెల్లిస్తా అని అగ్రిమెంట్ చేస్తారు. ఒకవేళ బిల్డర్ మాట తప్పితే రెరాకి ఫిర్యాదు చేయవచ్చు. దీనిలో ఉన్న మైనస్ ఏంటంటే.. మీరు 20 లక్షలకు కొన్న 200 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ని అమ్మాలంటే వెంటనే అవ్వదు. ఎందుకంటే అంత చిన్న స్పేస్ ని కొనుకున్నా ఎవరికీ ఉపయోగం ఉండదు కదా. కనీసం 5 వేల చదరపు అడుగులైనా ఉండాలి. 5 వేల చదరపు అడుగుల స్థలం కొనాలంటే రెండున్నర కోట్లు అవుతుంది.

అంత కొనలేరు కాబట్టి మీ బడ్జెట్ లో ఎంత వస్తే అంతే కొనుక్కుంటారు. మీలానే అమ్మేయాలి అని ఎవరైనా అనుకుంటే ఆ సమయానికి అందరూ కలిసి ఆ కమర్షియల్ స్పేస్ ని అమ్మేయవచ్చు. లేదా మీలాంటి వాళ్లకి మీరు కొన్న స్పేస్ మాత్రమే అమ్ముకోవచ్చు. అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఏళ్ళు గడిచే కొద్దీ మీరు పెట్టిన పెట్టుబడి విలువ పెరుగుతుంది. దీంతో అద్దె కూడా పెరుగుతుంది. కమర్షియల్ స్పేస్ విలువ 20 లక్షలు అనుకుంటే.. ఒక ఐదేళ్ళలో డబుల్ అయితే దాని విలువ 40 లక్షలు అవుతుంది. మార్కెట్ రేటును బట్టి 20 లక్షల కమర్షియల్ స్పేస్ మీద ప్రతి నెలా 15 వేల నుంచి 20 వేల ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాపర్టీ రేటు పెరిగితే.. రెంట్ పెంచితే మీకు కూడా రెంట్ పెరుగుతుంది. 

రీట్స్ అనేది ఆదాయం తెచ్చే రియల్ ఎస్టేట్ ని సొంతంగా నడిపించడం, మేనేజ్ చేయడం వంటివి చేస్తుంది. అపార్ట్మెంట్ బిల్డింగ్స్, సెల్ టవర్స్, డేటా సెంటర్స్, హోటల్స్, ఆఫీసులు, రీటెయిల్ సెంటర్స్ వంటి వాటి మీద పెట్టుబడి పెడుతుంటుంది. ఇందులో బయటి వ్యక్తులను కూడా భాగస్వామ్యం చేస్తుంది. మీ దగ్గర కొంత డబ్బు ఉండి మిగతా డబ్బు లోన్ పెట్టుకుని నెల నెలా ఆదాయం సంపాదించుకోవాలంటే ఇదొక చక్కని మార్గం. మీరు కొన్న స్థలం విలువ పెరుగుతుంది. దాని మీద ప్రతి నెలా అద్దె వస్తుంది. డెడ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు.

పెట్టుబడి పెట్టాలంటే మీరు రియల్ ఎస్టేట్ నిపుణులను సంప్రదించాలి. వారు మీకు సలహాలు, సూచనలు, ప్రక్రియ మొత్తం తెలియజేస్తారు. నేరుగా వెళ్తే మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. చాలా మంది స్టాక్ మార్కెట్లో పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దాని కంటే ఇది మేలైన మార్గం. ప్రతి నెలా ఏ పనీ చేయకున్నా ఆదాయం వస్తుంది. దీనికి తోడు ఏళ్ళు గడిచేకొద్దీ స్థలం విలువ పెరుగుతుంది. ఇదే డబ్బుని వడ్డీకి ఇస్తే నెల నెలా వడ్డీ వస్తుంది. కానీ అసలు అలానే ఉంటుంది. కాబట్టి దీని కంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.