iDreamPost

యాపిల్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.20 వేల ఎయిర్ పాడ్స్‌ని ఫ్రీగా పొందవచ్చు!

Get Apple Airpods For Free: యాపిల్ లవర్స్ కి గుడ్ న్యూస్. ఇప్పుడు 20 వేలు, 13 వేల రూపాయల విలువ చేసే ఎయిర్ పాడ్స్ ని ఉచితంగా పొందవచ్చు. యాపిల్ కంపెనీ తాజాగా భారీ ఆఫర్ ని ప్రకటించింది. కంపెనీ స్టోర్ లో ఉచితంగా, అలానే డిస్కౌంట్ లో ఖరీదైన ఎయిర్ పాడ్స్ ని అందుబాటులో ఉంచింది.

Get Apple Airpods For Free: యాపిల్ లవర్స్ కి గుడ్ న్యూస్. ఇప్పుడు 20 వేలు, 13 వేల రూపాయల విలువ చేసే ఎయిర్ పాడ్స్ ని ఉచితంగా పొందవచ్చు. యాపిల్ కంపెనీ తాజాగా భారీ ఆఫర్ ని ప్రకటించింది. కంపెనీ స్టోర్ లో ఉచితంగా, అలానే డిస్కౌంట్ లో ఖరీదైన ఎయిర్ పాడ్స్ ని అందుబాటులో ఉంచింది.

యాపిల్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.20 వేల ఎయిర్ పాడ్స్‌ని ఫ్రీగా పొందవచ్చు!

యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ గురించి తెలిసిందే. యాపిల్ బ్రాండ్ అంటే క్వాలిటీ అన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండిపోయింది అందుకే చాలా మంది యాపిల్ ప్రాడెక్ట్స్ ని కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే యాపిల్ ప్రాడెక్ట్స్ లో చాలా మంది మ్యూజిక్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడేది ఎయిర్ పాడ్స్ నే. ఈ ఎయిర్ పాడ్స్ ని ఉచితంగా పొందాలని మీరు భావిస్తే కనుక ఇదే మీకు సరైన అవకాశం. 20 వేల రూపాయలు, 13 వేల రూపాయల విలువ చేసే ఈ ఎయిర్ పాడ్స్ ని మీరు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు వెయ్యి రూపాయలకే 20,900 రూపాయలు విలువ చేసే మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్ కేస్ కలిగిన ఎయిర్ పాడ్స్ ని, 5 వేలకే 24,900 రూపాయల విలువైన ఎయిర్ పాడ్స్ ప్రోని, 59,900 విలువ చేసే ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ ని 40 వేలకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఉచితంగా పొందాలంటే మీరు చేయాల్సిందల్లా.. 

యాపిల్ రీసెంట్ గా ఎడ్యుకేషన్ స్టోర్ ని లాంఛ్ చేసింది. మోస్ట్ పవర్ ఫుల్ టూల్స్ ఫర్ లెర్నింగ్ పేరుతో ఒక స్టోర్ ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మ్యాక్, ఐపాడ్, ఐఫోన్, యాపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్, ఎయిర్ ట్యాగ్, యాపిల్ టీవీ 4కే, హోమ్ పాడ్, ఐఫోన్ యాక్సెసరీస్ ని అందుబాటులో ఉంచింది. అయితే వీటిలో మ్యాక్ మినీ పీసీ, మ్యాక్ బుక్ ఎయిర్, మ్యాక్ బుక్ ప్రో, ఐమ్యాక్ లలో ఏదైనా ఒకటి కొనుగోలు చేస్తే 19,990 రూపాయలు, అలానే 12,999 రూపాయల విలువైన ఎయిర్ పాడ్స్ ని ఉచితంగా పొందవచ్చు. అలానే ఐపాడ్ ఎయిర్, ఐపాడ్ ప్రో కొనుగోలు చేస్తే యాపిల్ పెన్సిల్ ని ఉచితంగా పొందవచ్చు. 

మ్యాక్ బుక్ ఎయిర్ ని కొనుగోలు చేస్తే 19,900 రూపాయల విలువైన థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్, అలానే లైట్నింగ్ ఛార్జింగ్ కేసు ఉచితంగా పొందవచ్చు. ఈ ఎయిర్ పాడ్స్ వద్దనుకుంటే 20,990 రూపాయల థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ విత్ మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్ కేస్ ని వెయ్యి రూపాయలకే పొందవచ్చు. రూ. 24,900 విలువైన ఎయిర్ పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ విత్ మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్ కేస్ (యూఎస్బీ-సి) ని 5 వేలకే పొందవచ్చు. 59,900 రూపాయల విలువైన ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ ని 40 వేలు అదనంగా చెల్లించి సొంతం చేసుకోవచ్చు. మ్యాక్ బుక్ ఎయిర్ ధర రూ. 89,900 నుంచి మొదలవుతుంది. మ్యాక్ బుక్ ప్రో, ఐమ్యాక్ మీద కూడా ఎయిర్ పాడ్స్ ని పైన చెప్పిన ఆఫర్స్ లోనే పొందవచ్చు. మ్యాక్ బుక్ ప్రో ధర రూ. 1,58,900 నుంచి స్టార్ట్ అవుతుండగా.. ఐమ్యాక్ ధర రూ. 1,29,900 నుంచి ప్రారంభమవుతుంది. 

20 thousand ear puds free

ఒకవేళ మీరు మ్యాక్ మినీ కొనుగోలు చేస్తే కనుక 12,900 రూపాయల విలువ చేసే సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ని ఉచితంగా పొందవచ్చు. 19,900 రూపాయల థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ కావాలంటే కనుక 7 వేలు, 20,900 రూపాయల విలువ చేసే ఎయిర్ పాడ్స్ ని కొనాలనుకుంటే 8 వేలు, 24,900 రూపాయల విలువ చేసే ఎయిర్ పాడ్స్ ప్రో కావాలనుకుంటే కనుక 12 వేలు చెల్లించాలి. 59,900 రూపాయల విలువ చేసే ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ కావాలనుకుంటే 47 వేలు అదనంగా చెల్లించాలి. 

అయితే మీరు ఈ ఎయిర్ పాడ్స్ ని ఉచితంగా లేదా డిస్కౌంట్ లో పొందాలంటే మీరు ఖచ్చితంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ లేదా స్టాఫ్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ స్టోర్ లో భాగంగానే ఈ ఎయిర్ పాడ్స్ ని ఫ్రీగా పొందగలరు. అందుకోసం యూనిడేస్ లో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కొన్ని రోజులే ఉంటుంది. యాపిల్ స్టోర్ లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి