iDreamPost

ఇండేన్, HP, భారత్ గ్యాస్ వాడుతున్నారా? ఆ పని చేయకపోతే నష్టపోతారు!

Customers May Miss These Benefits: ఇండేన్ గ్యాస్, హెచ్పీ, భారత్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారా? అయితే మీరు ఈ పని ఖచ్చితంగా చేయవలసిందే. లేదంటే ప్రభుత్వం తరపున వచ్చే ప్రయోజనాలను కోల్పోయే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే వెంటనే ఈ పని చేయండి. లేదంటే నష్టపోతారు.

Customers May Miss These Benefits: ఇండేన్ గ్యాస్, హెచ్పీ, భారత్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారా? అయితే మీరు ఈ పని ఖచ్చితంగా చేయవలసిందే. లేదంటే ప్రభుత్వం తరపున వచ్చే ప్రయోజనాలను కోల్పోయే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే వెంటనే ఈ పని చేయండి. లేదంటే నష్టపోతారు.

ఇండేన్, HP, భారత్ గ్యాస్ వాడుతున్నారా? ఆ పని చేయకపోతే నష్టపోతారు!

ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే రోజు గడవని పరిస్థితి. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఉంటున్నాయి. పేదవారి కోసం సబ్సిడీ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కొంతమంది బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా గ్యాస్ సిలిండర్లు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నకిలీ కనెక్షన్స్ పై దృష్టి పెట్టింది. నకిలీ కనెక్షన్స్ కి చెక్ పెట్టేందుకు కేంద్రం కేవైసీ చేయించుకోవాలని సూచిస్తుంది. ఈ క్రమంలో పలు గ్యాస్ కంపెనీలు కస్టమర్లకు కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఇండేన్, హెచ్పీ, భారత్ గ్యాస్ సహా పలు గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు కేవైసీ చేసుకోమని సందేశాలు పంపుతున్నాయి. వీలైనంత త్వరగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేస్తున్నాయి. కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ దీనిపై గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో కేవైసీ చేసుకోకపోతే నష్టమా అంటే అలా ఏం లేదని నివేదికలు చెబుతున్నాయి కానీ ప్రభుత్వం డెడ్ లైన్ నిర్ణయిస్తే గ్యాస్ వినియోగదారులకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కేవైసీకి మే 31 లాస్ట్ డేట్ అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ కేవైసీ చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే నకిలీ కనెక్షన్స్ కి చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఏ క్షణం అయినా నిర్ణయం తీసుకోవచ్చు. డెడ్ లైన్ పెడితే.. సమయం సరిపోకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పైగా సబ్సిడీ కూడా అందకపోవచ్చు. 

కేవైసీ చేసుకోండిలా:

గ్యాస్ సిలిండర్ ని ఇంటికి తీసుకొచ్చే సిబ్బంది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. బయోమెట్రిక్ ద్వారా ఆధార్ ని ధృవీకరిస్తారు. ఎల్పీజీ కనెక్షన్ తో ఆధార్ లింక్ చేసుకునేందుకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఆన్ లైన్ లో కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఇండేన్ గ్యాస్ వినియోగదారులైతే కనుక.. ఇండియన్ ఆయిల్ యాప్ డౌన్ లోడ్ చేసి కేవైసీ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో చేసుకోవడం తెలియకపోతే ఆఫ్ లైన్ లో కూడా కేవైసీ చేసుకోవచ్చు. అందుకోసం సంబంధిత డీలర్ ఆఫీస్ కి వెళ్లి ఒక ఫారం పూర్తి చేయాలి. అక్కడ కస్టమర్ పేరు, ఫోన్ నంబర్, భర్త లేదా తండ్రి పేరు వంటి వివరాలు ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ లేదా ఇతర డాక్యుమెంట్లు జత చేయాలి. దీంతో కేవైసీ ప్రక్రియ ముగుస్తుంది. 

కేవైసీ చేయకుంటే రెండు రకాలుగా నష్టపోతారు:

ఇలా చేయడం వల్ల కేవైసీ డేటా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీంతో నకిలీ కనెక్షన్స్ అనేవి బయటపడి బ్లాక్ మార్కెట్ తగ్గుతుంది. దీని వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరడమే కాకుండా భవిష్యత్తులో పేదల కోసం మేలు చేకూర్చే నిర్ణయం తీసుకునే అవకాశం ఉండచ్చు. బ్లాక్ మార్కెట్ ని ఆపితే సరైన సమయానికి నిరుపేదలకు గ్యాస్ సిలిండర్లు అందుతాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైన పేదలకు రూ. 300 సబ్సిడీ వస్తుంది. ఈ సబ్సిడీ కోసమైనా పేదలు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. కేవైసీకి డెడ్ లైన్ లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ మార్కెట్ దందా వల్ల పేద ప్రజలకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు రావు. ఒకవేళ ప్రభుత్వం కనుక గడువు తేదీ నిర్ణయిస్తే కనుక కేవైసీ చేయించుకోలేకపోతే రూ. 300 సబ్సిడీని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సకాలంలో గ్యాస్ సిలిండర్లు రావాలన్నా లేదా సబ్సిడీ కోల్పోకుండా ఉండాలన్న ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వంటి కంపెనీల సిలిండర్లు వాడే కస్టమర్లు.. వీలైనంత త్వరగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి