iDreamPost
android-app
ios-app

ప్రమాద బీమా.. రూ.775 కడితే చాలు రూ.15 లక్షల బెనిఫిట్‌! IPPB కొత్త స్కీమ్‌

  • Published Jun 29, 2024 | 8:21 PM Updated Updated Jun 29, 2024 | 8:21 PM

IPPB, Insurance, Health Plus: తాము లేకపోయినా తమ కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని తీసుకునే పాలసీల్లో ప్రమాద భీమా అతి ముఖ్యమైంది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఒక మంచి ప్లాన్‌ తీసుకొచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

IPPB, Insurance, Health Plus: తాము లేకపోయినా తమ కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని తీసుకునే పాలసీల్లో ప్రమాద భీమా అతి ముఖ్యమైంది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఒక మంచి ప్లాన్‌ తీసుకొచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jun 29, 2024 | 8:21 PMUpdated Jun 29, 2024 | 8:21 PM
ప్రమాద బీమా.. రూ.775 కడితే చాలు రూ.15 లక్షల బెనిఫిట్‌! IPPB కొత్త స్కీమ్‌

చాలా మంది తమ కుటుంబ భద్రత కోసం.. భవిష్యత్తులో తాము లేకపోయినా తమపై ఆధారపడి కుటుంబ సభ్యులు రోడ్డు పాలు కాకుండా ఉండాలని పలు రకాల పాలసీలు తీసుకుంటూ ఉంటారు. అందులో ప్రమాద బీమా కూడా ఒకటి. చాలా రకాల కంపెనీలు పలు రకాల ప్రమాద బీమాలను అందిస్తున్నాయి. తాజాగా ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపీపీబీ) సరికొత్త ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది. అందులో కేవలం రూ.775 కడితే చాలు రూ.15 లక్షల పరిహారం పొందవచ్చు. పైగా పిల్లల పెళ్లికి రూ.లక్ష అదనంగా అందిస్తారు. ఆ పాలసీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తక్కువ ప్రీమియంతో పేద, మధ్య తరగతి వాళ్లు కూడా బీమా కవరేజ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌. హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్‌ అని రెండు రకాల పాలసీలను అందుబాటులో ఉంచింది. ఇందులో హెల్త్‌ ప్లస్‌ మూడు రకాలుగా ఉంటుంది. వద్దనుకుంటే ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు. మొదటిది రకంలో బీమా మొత్తం రూ.5 లక్షలు. పాలసీదారుడు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగ వైకల్యం సంభిస్తే నామినికి రూ.5 లక్షలు అందిస్తారు. దాంతో పాటు రూ.50 వేలు వరకు పిల్లల పెళ్లికి ఇస్తారు. ప్రమాదంలో ఎముకలు విరిగితే రూ.25 వేలు ఇస్తారు. దీని ప్రీమియం పన్నులతో కలిపి ఏడాదికి రూ.355 అవుతుంది.

రెండో రకంలో బీమా మొత్తం రూ.10 లక్షలు ఉంటుంది. ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగ వైకల్యం కలిగినా నామినికి రూ.10 లక్షలు చెల్లిస్తారు. ఎముకలు విరిగితే రూ.25 వేలు ఔట్ పేషంట్ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం లేకుండా రూ.1 లక్ష వరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ బెనిఫిట్స్‌ లభిస్తాయి. అంత్యక్రియల కోసం దాదాపు రూ.5 వేల వరకు క్లెయిమ్ చేయవచ్చు. పిల్లల చదువు కోసం మరో రూ.50 వేలు ఇస్తారు. దీని ప్రీమియం పన్నులతో కలిపి ఏడాదికి రూ.555 అవుతుంది.

ఇక మూడో రకంలో బీమా మొత్తం రూ.15 లక్షలు ఉంటుంది. దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోతే లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవించినా కుటుంబానికి రూ.15 లక్షలు అందిస్తారు. పిల్లల పెళ్లికి రూ.లక్ష వరకు కవరేజీ లభిస్తుంది. విరిగిన ఎముకలకు రూ.25 వేలు ఇస్తారు. ప్రీమియం పన్నులతో కలిపి ఏడాదికి రూ.755 ఉంటుంది. అయితే.. ప్రీమియం చెల్లిన ఏడాది లోపు ఈ పాలసీ వర్తిస్తుంది. మరో ఏడాదికి కూడా కొనసాగించాలంటే మళ్లీ ప్రీమియం కట్టాలి. ఆటో రెన్యూవల్ కూడా పెట్టుకోవచ్చు. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వాళ్లు ఈ పాలసీకి అర్హులు. ఇక ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లాన్ కింద, మీరు టెలీ కన్సల్టేషన్‌లు, వార్షిక హెల్త్ చెకప్స్ లాంటి అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రమాద బీమా తీసుకోనే ముందు నియమనిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి.