iDreamPost
android-app
ios-app

నెట్టింట #uninstallphonepe ట్రెండ్.. పూర్తి వివరాలు!

Reason Behind #UninstallPhonepe Trend: ప్రస్తుతం ఎక్స్.కామ్ లో ఫోన్ పేని అన్ ఇన్ స్టాల్ చేయాలి అనే ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్ కర్ణాటకలో జరుగుతోంది. అక్కడి వాళ్లు ఫోన్ పేని అన్ ఇన్ స్టాల్ చేస్తున్నారు.. అలాగే అందరూ చేయాలి అంటూ పోస్టులు పెడుతున్నారు. అసుల ఆ ట్రెండ్ వెనుక ఉన్న కారణం ఏంటో చూద్దాం.

Reason Behind #UninstallPhonepe Trend: ప్రస్తుతం ఎక్స్.కామ్ లో ఫోన్ పేని అన్ ఇన్ స్టాల్ చేయాలి అనే ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్ కర్ణాటకలో జరుగుతోంది. అక్కడి వాళ్లు ఫోన్ పేని అన్ ఇన్ స్టాల్ చేస్తున్నారు.. అలాగే అందరూ చేయాలి అంటూ పోస్టులు పెడుతున్నారు. అసుల ఆ ట్రెండ్ వెనుక ఉన్న కారణం ఏంటో చూద్దాం.

నెట్టింట #uninstallphonepe ట్రెండ్.. పూర్తి వివరాలు!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు మంచి విషయాలు అవుతూ ఉంటే కొన్నిసార్లు మాత్రం కోపాలు, ఆగ్రావేశాలతో కూడా కొన్ని విషయాలను ట్రెండ్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి కోపంతో కూడిన ట్రెండ్ ఒకటి నెట్టిట వైరల్ గా మారింది. అదే అన్ ఇన్ స్టాల్ ఫోన్ పే ట్రెండ్ అనమాట. ఇప్పుడు ఎక్స్.కామ్ లో #uninstallphonepe అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇదంతా చేస్తోంది ఎవరో కాదు.. కర్ణాటక రాష్ట్ర యువత అనమాట. అందుకు కారణం కర్ణాటకలో తాజాగా తీసుకురావాలి అని చూసిన ప్రైవేట్ సెక్టార్ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్ చేసిన వ్యాఖ్యలే.

కర్ణాటక ప్రభుత్వం కన్నడిగులకు ఉపాధి, ఉద్యోగాలకు సంబంధించి ఒక బిల్లు తీసుకొచ్చింది. లోకల్ క్యాండిడేట్స్ రాష్ట్రంలోని ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, ఇతర సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. దీని ప్రకారం మేనేజ్మెంట్ పొజిషన్స్ లో కనీసం 50 శాతం రిజర్వేషన్స్, నాన్ మేనేజ్మెంట్ పొజిషన్స్ లో కనీసం 70 శాతం రిజర్వేషన్స్ ని కల్పించాలి. ఈ రిజర్వేషన్ ని పొందడానికి కన్నడ ల్యాంగ్వేజ్ గా ఉన్న సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కావాలి. లేదంటే మీరు కన్నడ భాషకు సంబంధించి మీ ప్రావిణ్యాన్ని పరీక్షించుకుని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. లోకల్ క్యాండిటేట్స్ గనుక అందుబాటులో లేకపోతే కంపెనీలు ఈ బిల్లు నుంచి మినహాయింపును పొందవచ్చు.

Phonepe

కర్ణాటక తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ప్రైవేట్ సెక్టార్ రిజర్వేషన్ బిల్లుకు ఆ రాష్ట్రంలో తప్పితే అన్ని చోట్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. అక్కడ ఉన్న కంపెనీలు కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతల దృష్ట్యా ప్రభుత్వం కూడా ఈ బిల్లు మీద వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి ఈ బిల్లును నిలిపివేస్తూ.. మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇదే బిల్లుకు సంబందించి ఫోన్ పే సీఈవో తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తన అసహనాన్ని వెల్లిబుచ్చారు.

“నాకు 46 సంవత్సరాలు. నేను ఏ రాష్ట్రాలో కూడా 15 ఏళ్లకు మించి నివసించలేదు. మా నాన్న నేవీలో వర్క్ చేశారు. వృత్తిలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పని చేశారు. వారి పిల్లలు కర్ణాటకలో ఉద్యోగాలు పొందేందుకు అర్హులు కాదా? నేను కంపెనీలు స్థాపించాను. దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా ఉద్యోగాలు సృష్టించాను. మరి.. నా పిల్లలు వారి హోమ్ టౌన్ లో ఉద్యోగాలు పొందేందుకు అర్హులు కాదా? సిగ్గు చేటు” అంటూ ఫోన్ పే సీఈవో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల ఆధారంగానే సమీర్ నిగమ్ కు వ్యతిరేకంగా ఎక్స్.కామ్ లో ఈ ఫోన్ పేని అన్ ఇన్ స్టాల్ చేయాలి అంటూ ట్రెండ్ చేస్తున్నారు. సాధరణ ప్రజలు మాత్రమే కాకుండా.. ఇన్ ఫ్లుఎన్సర్స్ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే కిచ్చా సుదీప్ లాంటి వాళ్లు ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అందరూ ఫోన్ పే యాప్ ని తమ స్మార్ట్ ఫోన్ల నుంచి అన్ ఇన్ స్టాల్ చేసి.. ఆల్టర్నేటివ్ యాప్స్ వాడుకోవాలని పోస్టులు చేస్తున్నారు. మరి.. ఈ ఫోన్ పే అన్ ఇన్ స్టాల్ ట్రెండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Phonepe