iDreamPost
android-app
ios-app

రోజుకి రూ.50 కట్టండి.. ఒకేసారి రూ.35 లక్షలు పొందచ్చు!

ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకు, ఉద్యోగ విరమణ తర్వాత అక్కరకు వచ్చేలా డబ్బు దాచుకోవాలి అనుకుంటారు. కానీ, మీరు కేవలం డబ్బుని మీ దగ్గర దాచుకోవడం వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. ఇలాంటి పథకాల్లో చేరితే మాత్రం మీకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకు, ఉద్యోగ విరమణ తర్వాత అక్కరకు వచ్చేలా డబ్బు దాచుకోవాలి అనుకుంటారు. కానీ, మీరు కేవలం డబ్బుని మీ దగ్గర దాచుకోవడం వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. ఇలాంటి పథకాల్లో చేరితే మాత్రం మీకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

రోజుకి రూ.50 కట్టండి.. ఒకేసారి రూ.35 లక్షలు పొందచ్చు!

సాధారణంగా ఒక కుటుంబం సాఫీగా సాగిపోవాలి అంటే ఆ కుటుంబానికి మంచి ఆదాయం ఉండాలి. అయితే ఆదాయం ఉంటే కుటుంబం ఇప్పటివరకు మాత్రమే ఆనందంగా ఉంటుంది. కానీ, భవిష్యత్ అవసరాలు, ఉద్యోగ విరమణ తర్వాత జీవితం మాత్రం కచ్చితంగా కష్టంగానే మారచ్చు. అందుకే మీరు ఇప్పుడు కష్టపడుతున్న మొత్తం నుంచి కచ్చితంగా ఆదా చేయడం నేర్చుకోవాలి. అయితే మీరు నెలకు ఇంత అంటూ కొంత మొత్తాన్ని పక్కన పెడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ, వాటిని చిన్న మొత్తంలో ఏదైనా స్కీమ్ లో కడితే మాత్రం మంచి ఆదాయం వస్తుంది. అలాంటి ఒక మంచి స్కీమ్ గురించి మాట్లాడుకుందాం.

పోస్టాఫీస్ లో మీకు చాలా రకాల స్కీములు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పొదుపు చేయడం ద్వారా మీకు అవసరమైన సమయంలో మంచి మొత్తం చేతికి అందే అవకాశం ఉంటుంది. అలాంటి స్కీముల్లో ఉద్యోగ విరమణ, వయసు పైబడిన సమయంలో అక్కరకు వచ్చేలా ఒక పథకం ఉంది. అదే గ్రామ సురక్ష యోజన పథకం. దీనిలో మీరు చిన్న మొత్తంలో కూడా ఆదా చేసుకోవచ్చు. గ్రామ సురక్ష యోజన అనేది పోస్టాఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం. 1995లో పోస్టాఫీస్ వారు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మీ వయసు 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఈ స్కీములో మీరు గరిష్టంగా రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలి అనుకున్న మొత్తాన్ని చెల్లించేందుకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఏడాదికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, త్రైమాసికానికి ఒకసారి, నెలవారీ చెల్లింపు విధానంలో కూడా మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టచ్చు. గరిష్టంగా మీరు మీకు 60 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టచ్చు. మీకు 80 ఏళ్లు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు. ఉదాహరణకు ఈ స్కీమ్ లో ఒక వ్యక్తి రోజుకు రూ.50 చొప్పున ఆదా చేస్తూ.. నెలకు రూ.1515 ఈ పథకంలో పెడితే అతనికి మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి రూ.35 లక్షలు వస్తాయి.

అలాగే మీరు పెట్టుబడి పెట్టాలి అనుకున్న సంవత్సరాలను పెంచుకుంటూ పోతే మీరు కట్టాల్సిన ప్రీమియం కూడా తగ్గుతూ ఉంటుంది. గరిష్టంగా 60 ఏళ్ల వరకు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 80 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తాన్ని అందజేస్తారు. అయితే ఈలోగా పాలసీదారుడు మరణిస్తే.. ఆ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. మీరు ఈ గ్రామ సురక్ష యోజన పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన తర్వాత మూడేళ్లకు స్వచ్ఛందంగా దీనిని నిలిపివేయవచ్చు. కానీ, మీకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు అందవు. మీరు ఇలాంటి చిన్న మొత్తంలో పెట్టుబడి పెడుతూ ఉంటే.. వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడకుండా మీరు ఆనందంగా జీవించేందుకు ఇవి అక్కరకు వస్తాయి. మరి.. పోస్టాఫీస్ గ్రామ సురక్ష యోజన పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి