iDreamPost
android-app
ios-app

మిడిల్ క్లాస్ వారి కోసం.. రూ.6 లక్షల్లో ఇది ప్రీమియం కారు!

Best Budget Car For Middle Calss: కారు అనేది ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. అయితే కార్ల ధరలు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. అందుకే బెస్ట బడ్జెట్ కారు తీసుకొచ్చాం.

Best Budget Car For Middle Calss: కారు అనేది ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. అయితే కార్ల ధరలు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. అందుకే బెస్ట బడ్జెట్ కారు తీసుకొచ్చాం.

మిడిల్ క్లాస్ వారి కోసం.. రూ.6 లక్షల్లో ఇది ప్రీమియం కారు!

కారు కొనడం ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. అయితే బడ్జెట్ కార్ల కోసం మధ్యతరగతి వాళ్లు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. కానీ, మార్కెట్లో ఇప్పటికే సూపర్ సక్సెస్ అయిన చాలా మోడల్స్ గురించి చాలా మందికి తెలియదు. ఆ మోడల్స్ ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. రిలీజ్ అయి సంవత్సారాలు గడుస్తున్నా.. ఆ మోడల్స్ కొనాలి అంటే నెలలపాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ లిస్టులో నిస్సాన్ కంపెనీకి చెందిన మ్యాగనైట్ కూడా ఉంటుంది. నిస్సాన్ కంపెనీలో మ్యాగనైట్ కారు ఎంతో స్పెషల్. మరి.. ఆ కారు ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

నిస్సాన్ కంపెనీ నుంచి ఉన్న కార్లలో మ్యాగనైట్ మోడల్ హాట్ కేకు అనే చెప్పాలి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో బెస్ట్ బడ్జెట్ కార్లలో నిస్సాన్ మ్యాగనైట్ కచ్చితంగా ఉంటుంది. ఈ కారు లుక్స్, స్పెసిఫికేషన్స్ లో మంచి ప్రీమియం కారులా ఉంటుంది. కానీ, ధర మాత్రం మిడిల్ క్లాస్ కి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ నిస్సాన్ మ్యాగనైట్ కి మార్కెట్లో అంత క్రేజ్ ఉంది. ఈ కారు మొత్తం 32 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వేరియంట్ మారే కొద్దీ కారు ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ అప్ గ్రేడ్ అవుతూ ఉంటాయి. ఈ కారు బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. టాప్ వేరియంట్ మ్యాగనైట్ టర్బో CVT XV ప్రీమియం ఆటోమేటిక్ పెట్రోల్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.11.02 లక్షలుగా ఉంది. ఆటోమేటిక్ వర్షన్ బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

ఇంక ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కారు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ కారు కేవలం పెట్రోల్ వర్షన్ లోనే అందుబాటులో ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే.. 999 సీసీతో వస్తోంది. ఇందులో 1.0 లీటర్ న్యాచురల్ యాస్పైర్, 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంక మైలేజ్ చూస్తే.. మాన్యువల్ మోడల్ లీటరుకు 19.35 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. ఆటోమేటిక్ మోడల్ టర్బో ఇంజిన్ లీటరుకు 17 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు.

ఇందులో 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ తో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. 7 ఇంచెస్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫయర్, వైర్ లెస్ ఛార్జింగ్, జేబీఎల్ స్పీకర్స్, యాంబియంట్ లైటింగ్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంక సేఫ్టీ విషయానికి వస్తే.. ఇందులో 360 డిగ్రీస్ కెమెరా ఉంటుంది. అలాగే డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ మాత్రమే కాకుండా ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుంది. ఇంక ఈ నిస్సాన్ మ్యాగనైట్ కి గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ ల 4 స్టార్స్ రేటింగ్ దక్కింది. అంటే సేఫ్టీ విషయంలో ఈ కారు ఎంతో సురక్షితం అని చెప్పచ్చు. ఇంక లుక్స్ పరంగా కూడా ఈ కారు ఎంతో ప్రీమియంగా ఉంటుంది. అందుకే మార్కెట్లో ఈ కారుకు ఎంతో క్రేజ్ ఏర్పడింది. మరి.. ఈ నిస్సాన్ మ్యాగనైట్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.