iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్స్! ఇక ఫేక్ కాల్స్ రమ్మన్నా రావు!

  • Published Aug 13, 2024 | 3:39 PM Updated Updated Aug 13, 2024 | 3:58 PM

TRAI New Rules-From Sept 1, 2024: సెప్టెంబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఇకపై అలా చేస్తే.. రెండేళ్ల పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టనున్నారు. ఆ వివరాలు..

TRAI New Rules-From Sept 1, 2024: సెప్టెంబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఇకపై అలా చేస్తే.. రెండేళ్ల పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టనున్నారు. ఆ వివరాలు..

  • Published Aug 13, 2024 | 3:39 PMUpdated Aug 13, 2024 | 3:58 PM
సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్స్! ఇక ఫేక్ కాల్స్ రమ్మన్నా రావు!

నెల ప్రారంభం అయ్యిందంటే చాలు.. కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వస్తుంటాయి. ఇవి ఎక్కువగా ఆర్థికపరమైన, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలకు చెందినవి ఉంటాయి. అలానే గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా నెల ప్రారంభంలో మారుతుంటాయి. ఇక జూలై నెలలో కొత్త రీఛార్జ్ ప్లాన్స్, వాహనాలకు సంబంధించిన రూల్స్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 1 నుంచి కొత్త టెలికాం రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీటిని ఫాలో కాకపోతే.. కఠిన చర్యలు ఉండనున్నాయి. ఆ వివరాలు..

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సెప్టెంబర్ 1 నుంచి ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. దీని వల్ల టెలికాం రంగంలో పెద్ద మార్పు రాబోతుంది. ఇంతకు ఈ కొత్త రూల్ దేనికి సంబంధించి అంటే.. ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ నుంచి బయటపడేందుకు. ఇక నుంచి మోసం, బోగస్ కాల్స్ గురించి కస్టమర్ ఫిర్యాదు చేస్తే టెలికాం కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రాయ్ హెచ్చరించింది.

Trai

సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ట్రాయ్ కొత్త నిబంధన ప్రకారం.. కస్టమర్లకి అన్ వాంటెడ్ కాల్స్, నకిలీ కాల్స్, మార్కెటింగ్ సహా ఎటువంటి క్యాంపైన్ కాల్స్ చేయలేరు. ఇలాంటి కాల్స్ ను అరికట్టాల్సిన బాధ్యత టెలికాం సర్వీస్ ప్రొవైడర్లదే అని ట్రాయ్ చెప్పుకొచ్చింది. ఇందుకోసం ఫేక్ కాల్స్ నియంత్రణకు కృత్రిమ మేధస్సు సాయం తీసుకోవాలని ట్రాయ్ సూచించింది. కస్టమర్‌కు ఫేక్ కాల్స్ వస్తే టెలికాం ఆపరేటర్, ఫేక్ కాల్స్ చేసిన కంపెనీలు లేదా వ్యక్తులు శిక్షార్హులు అవుతారని తెలిపింది. లేదంటే నకిలీ కాలింగ్ ఫోన్ నంబర్లను సుమారు 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్ చేయనున్నట్లు ట్రాయ్ చెప్పుకొచ్చింది

పలు కంపెనీలు వ్యక్తిగత ఫోన్ నంబర్లు, ప్రైవేట్ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి కస్టమర్లని వేధిస్తున్నట్లు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో స్పామ్ కాల్స్ నియంత్రణకు ట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంటోంది. స్పామ్ కాల్స్ లేదా ఫేక్ కాల్స్‌పై కస్టమర్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇటీవల కంపెనీల ప్రమోషన్ కు సంబంధించి స్పామ్ కాల్స్ వస్తున్నాయి. అన్ వాంటెడ్ కాల్స్‌తో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఫేక్ కాల్స్‌తో మోసపోతున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ ఇప్పుడు కొత్త నిబంధనను రూపొందించింది. సెప్టెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.