P Krishna
Work only 4 Days a Week: కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం చేసిన వారు తిరిగి ఆఫీసులకు వస్తున్నారు.. కొన్ని కంపెనీలు ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించి ఉత్పాదకతపై దృష్టి పెడుతున్నాయి.. ఇందుకోసం వారి పనిదినాలు తగ్గించే యోచనలో ఉన్నాయి.
Work only 4 Days a Week: కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం చేసిన వారు తిరిగి ఆఫీసులకు వస్తున్నారు.. కొన్ని కంపెనీలు ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించి ఉత్పాదకతపై దృష్టి పెడుతున్నాయి.. ఇందుకోసం వారి పనిదినాలు తగ్గించే యోచనలో ఉన్నాయి.
P Krishna
కరోనా సమయంలో చాలా మంది ఎంప్లాయిస్ ఇంటికే పరిమితం అయ్యారు. కంపెనీలు సైతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇటీవల కరోనా వైరస్ ప్రభావం తగ్గింది.. దీంతో ఎంప్లాయిస్ ఆఫీసులకు రావాలంటూ కంపెనీలు ఆర్డర్ ఇవ్వడంతో ఆఫీస్ బాట పడుతున్నారు. అయితే కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోం కంటిన్యూ చేస్తున్నాయి. ప్రస్తుతం కాలంలో ఉద్యోగులపై సాధ్యమైనంత వరకు ఒత్తిడి తగ్గించి ఉత్పత్తి పెంచే ఏర్పాటులో కొన్ని కంపెనీలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వారంలో రెండు రోజులు సెలవు వంటివి ఇప్పటికే కొన్ని కార్పోరేట్ కంపెనీలు అమలు చేస్తున్నాయి.. ఇదే బాటలో మరో దేశం ముందుకు వస్తుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కార్పోరేట్ కంపెనీలు వారంలో రెండు రోజులు సెలవు దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ఎంప్లాయిస్ పనితీరులో చాలా మార్పులు వచ్చాయని.. పని రోజులు తగ్గిస్తే ఉత్పాదకతపై ప్రభావం ఉంటుందని తెలుసుకున్న కొన్ని జర్మన్ కంపెనీలు తాము కూడా అదేబాటలో వెళ్లేందుకు సిద్దమైతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోన వారానికి 4 రోజుల పని ఎలా ఉంటుందనే విషయం పై అధ్యాయనం చేయనున్నాయి. ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి వచ్చే 6 నెలల పాటు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఈ అధ్యాయనం కోసం జర్మనీకి చెందిన 45 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇందుకు న్యూజిలాండ్ కు చెందిన 4 డే వీక్ గ్లోబల్ అనే స్వచ్చంద సంస్థ నేతృత్వం వహిస్తుంది. ఈ విధానంలో ఎంప్లాయిస్ కి 4 రోజుల పాటు కొన్ని గంటలే పనిచేయాలి.
ఉద్యోగస్తులకు ఈ సౌకర్యం వల్ల పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు లేకుండా పనితీరు మెరగు పడుతుందని, దీంతో ఎక్కువ సెలవులు పెట్టటడం సైతం తగ్గిపోతుందని 4 డే వీక్ గ్లోబల్ అంచనా వేస్తుంది. గతంలో అమెరికా, పోర్చుగల్, కెనడా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఈ తరహా పద్దతి పాటించారు. ఇందులో భాగమైన ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉన్నారని వెల్లడించింది. ఇలాంటి ఫలితాలే జర్మనీలో కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది 4 డే వీక్ గ్లోబల్ అనే స్వచ్చంద సంస్థ. కాగా, 2022 లో జర్మన్లు సగటున 21.3 రోజుల పాటు సరిగా పనిచేయలేకపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ కారణంగానే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 207 బిలియన్ యూరోలు నష్టమొచ్చందని అంచనా వేశారు. 4 రోజుల పని తో ఉద్యోగుల ఉత్తేజంగా పనిచేయొచ్చు అని అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.