Dharani
Flipkart-Jobs: ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. త్వరలోనే లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..
Flipkart-Jobs: ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. త్వరలోనే లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..
Dharani
దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించినా.. నిరుద్యోగుల నంబర్ మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఏటా లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసుకుని.. ఉద్యోగాల కోసం బయటకు వస్తున్నారు. జాబ్ కోసం ఎదురు చేసేవారు లక్షల్లో ఉంటే.. జాబ్ దొరికిదిగ మాత్రం వల మందికే అన్నమాట. దాంతో ఏటికేడు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఈక్రమంలో నిరుద్యోగులకు ఫ్లిప్ కార్డ్ శుభవార్త చెప్పింది. త్వరలోనే లక్ష మందికి ఉద్యోగాలు కల్పించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..
ఈకామర్స్ రంగంలో దిగ్గజ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ తాజాగా శుభవార్త చెప్పింది. త్వరలోనే లక్ష వరకు ఉద్యోగాలు కల్పించేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపింది. అయితే ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కాదు. తాత్కలికం అన్నమాట. ఇలా ఎందుకంటే.. సాధారణంగా పండగలు, స్పెషల్ డేస్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్… అనేక ఆఫర్లు తీసుకొస్తుంది. అలా పండగల సీజన్‌లో ధమాకా సేల్స్‌తో పాటూ ఉద్యోగాలనూ కల్పిస్తోంది ఫ్లిప్ కార్ట్. పండగల సీజన్ వేళ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా లక్ష ఉద్యోగాల సృష్టించబోతున్నట్లు ఫ్లిప్ కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.
బిగ్ బిలియన్ డేస్ కోసం దేశవ్యాప్తంగా కొత్తగా 9 నగరాల్లో కొత్తగా 11 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు కూడా ప్రారంభించామని.. దీంతో వీటి సంఖ్య 83కు చేరిందని ఫ్లిప్ కార్ట్ చెప్పుకొచ్చింది. దేశ సామాజిక ఆర్థిక వృద్ధికి చేయూతలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పింది. దీనిలో భాగంగా సప్లయ్ చైన్ విభాగంలో 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేయనున్నామని తెలిపింది. పండగల సీజన్‌లో వచ్చే బిగ్ బిలియన్ డేస్ నిర్వహణకు చాలా మంది ఉద్యోగులు కావాల్సి వస్తారు. ఇలాంటి టైమ్‌లో కొత్త ఉద్యోగులను నియమించుకోవడం వలన ఫ్లిప్‌కార్ట్ నిర్వహణ కార్యకలాపాలు మెరుగుపడడంతో పాటు స్థానికంగా ఉండే యువతకు ఉపాధి లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం తెలిపింది.
సప్లయ్ చైన్ విభాగంలో ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్ హౌస్ అసోసియేటర్లు, లాజిస్టిక్స్ కో-ఆర్డినేటర్లు, కిరాణా పార్ట్‌నర్లు, డెలివరీ డ్రైవర్స్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి. వీటిల్లో ఎక్కువగా మహిళలు, దివ్యాంగులను నియమిస్తామని తెలిపింది. కొత్త ఉద్యోగాల్లో తీసుకున్న వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని చెప్పింది. ఇక మీదట ప్రతీ ఏటా ఇలాంటి ఉద్యోగాలను ప్రకటిస్తూనే ఉంటామని ఫ్లిప్ కార్ట్ చెప్పింది.