iDreamPost
android-app
ios-app

తక్కువ ఖర్చుతో చేపల పెంపకం! లక్షల్లో లాభం! ఇప్పుడిదే ట్రెండ్!

Fish Cultivation: వ్యాపారం చేయాలనే ఆలోచన రావాలే కానీ అనేక ఐడియాలు మన కళ్ల ముందే కనిపిస్తుంటాయి. భారీ పెట్టుబడులతో మొదలు అతి తక్కువ ఖర్చులతో కూడా ఎక్కువ ఆదాయం పొందే వ్యాపారాలు అనేకం ఉన్నాయి. తక్కువ ఖర్చుతో చేపల పెంపకం చేపడుతూ లక్షల్లో ఆదాయం పొందొచ్చు.

Fish Cultivation: వ్యాపారం చేయాలనే ఆలోచన రావాలే కానీ అనేక ఐడియాలు మన కళ్ల ముందే కనిపిస్తుంటాయి. భారీ పెట్టుబడులతో మొదలు అతి తక్కువ ఖర్చులతో కూడా ఎక్కువ ఆదాయం పొందే వ్యాపారాలు అనేకం ఉన్నాయి. తక్కువ ఖర్చుతో చేపల పెంపకం చేపడుతూ లక్షల్లో ఆదాయం పొందొచ్చు.

తక్కువ ఖర్చుతో చేపల పెంపకం! లక్షల్లో లాభం! ఇప్పుడిదే ట్రెండ్!

నేటికాలంలో చాలా మందికి వ్యాపారం చేయాలనే కోరిక ఉంటుంది. అయితే అందుకు తగిన పరిస్థితులు లేకపోవడంతో ఆగిపోతుంటారు. మరికొందరు మాత్రం తమ పరిసరాల్లో ఉండే అంశాలను అనుకూలంగా మార్చుకుని వ్యాపారాలు చేస్తుంటారు. అలా బిజినెస్ సెక్టార్ లోకి వెళ్లిన ఎందరో విజయం సాధించారు. అలానే ఎన్నో రకాల వ్యాపారాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. అలాంటి వాటిల్లో బయో ఫిష్ ట్యాంకులు ఒకటి. మరి.. అసలు ఈ బయో ఫిష్ ట్యాంకులు ఏంటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బయో ఫిష్ ట్యాంకులు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీటి ద్వారా చేపల పెంపకం చేపడుతుంటారు. తమిళనాడులోని ఈ వ్యాపారం మంచి లాభాలు అందిస్తుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఈ బయో ఫిష్ ట్యాంకులు సిరులు కురిపిస్తున్నాయి. చిన్నపాటి కృత్రిమ చెరువులుగా కనిపించే ఈ బయో ట్యాంకులకు పెట్టుబడి తక్కువ. ఇక చేపల పెంపకంలో అనుభవం లేని వారు కూడా మత్స్య శాఖ వద్ద శిక్షణ పొంది ఈ వ్యాపారం ప్రారంభించ వచ్చు. శిక్షణ తీసుకుని తక్కువ పెట్టుబడితో, కొద్దిపాటి స్థలంలోనే బయో ఫిష్‌ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా బయో ట్యాంకు వ్యాపారం ద్వారా తమిళనాడులోని చాలా కుటుంబ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు.

ఇక బయో ట్యాంకులను చాలా తక్కువ ఖర్చుతోనే ఏర్పాటు చేయవచ్చు. ఇనుప మెష్‌లో టార్పాలిన్‌ వేసి, అందులో నీటిని నింపి చేపలు పెంచుకోవచ్చు. తక్కువ నీటితోనే చేపల పెంపకాన్ని చేపట్టగలుగుతున్నామని రైతులు పేర్కొన్నారు. ఒక్కో బయో ఫిష్‌ ట్యాంకులో 450 తిలాపియా, లాబ్‌స్టర్‌ రకాలకు చెందిన చేపలను పెంచుతున్నట్లు ఆ రైతులు చెబుతున్నారు. ఇంటి దగ్గరే రెండు బయో ఫిష్ ట్యాంకులు పెట్టుకొని వెయ్యి చేపల వరకు పెంచుతున్నార. ఇక ఈ ట్యాంకుల్లో ఉండే చేపలను రక్షించేందుకు వలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ వల ద్వారా కప్పి కొంగలు, కాకుల నుంచి చేపలను రక్షించుకుంటున్నారు. ఇక ఈ బయో ఫిష్ ట్యాంకుల ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం సబ్సిడ్ సైతం ఇస్తోంది. మహిళలకు 60శాతం, పురుషులకు 40 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఈ రాయితీతో పాటు లబ్ధిదారులకు తమిళనాడు మత్స్య శాఖ తగిన శిక్షణ కూడా ఇస్తోంది. ఇలా ప్రభుత్వం అనేక రకాల సదుపాయాలు కల్పిస్తుండటంతో ఆక్వా రంగంలో పూర్వానుభవం లేని వారు కూడా ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా తక్కువ ఖర్చుతో లక్షల్లో ఆదాయం పొందవచ్చని ఈ బయో ఫిష్ ట్యాంకులను నిర్వహిస్తోన్న రైతులు చెబుతున్నారు.