iDreamPost
android-app
ios-app

ఏప్రిల్ వచ్చేసింది. ఇక ఆ బ్యాంక్ కనిపించదు. మరో బ్యాంకులో విలీనం!

  • Published Apr 03, 2024 | 8:27 AM Updated Updated Apr 03, 2024 | 8:27 AM

కొంతకాలంగా బ్యాంకుల విలీనం జరుగుతూనే ఉంది. కస్టమర్స్ కు మెరుగైన సేవలు అందించడం కోసం.. కొన్ని బ్యాంక్స్ అన్ని కలిసి విలీనం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కొంతకాలంగా బ్యాంకుల విలీనం జరుగుతూనే ఉంది. కస్టమర్స్ కు మెరుగైన సేవలు అందించడం కోసం.. కొన్ని బ్యాంక్స్ అన్ని కలిసి విలీనం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 03, 2024 | 8:27 AMUpdated Apr 03, 2024 | 8:27 AM
ఏప్రిల్ వచ్చేసింది. ఇక ఆ బ్యాంక్ కనిపించదు. మరో బ్యాంకులో విలీనం!

కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడం కోసం.. కొన్ని బ్యాంకులు అన్ని కలిసి విలీనం అవుతున్నాయి. ఎప్పటినుంచో ఇది అమలులోకి వచ్చినా కూడా.. ఇప్పుడు ఈ ప్రక్రియ చాలా త్వరగా పూర్తవుతుంది. దీని కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అనుమతులు వేగంగానే లభిస్తున్నాయి. ఏప్రిల్ 1నుంచి ఈ నిర్ణయాలు అమలులోకి వచ్చాయి. అయితే, తాజాగా ఈ బ్యాంకుల విలీనం ప్రక్రియలో.. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో.. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విలీనం అయింది. చిన్న బ్యాంకుల విలీనంలో ఇదే మొట్టమొదటి విలీనం. అసలు ఈ బ్యాంకుల విలీనం వలన ఏం జరుగుతుంది.. ఇప్పటికే ఆయా బ్యాంకులలో డిఫాజిట్స్ చేసి ఉన్న వారి పరిస్థితి ఏంటి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అయితే, ఈ బ్యాంకుల విలీనం గురించి.. ఇప్పటికే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వారి వారి వెబ్ సైట్స్ లో.. రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలియపరిచాయి. 2023 అక్టోబర్ 29న దీని గురించి.. ప్రకటన విడుదల చేశారు. ఇక ఇప్పుడు బ్యాంకుల విలీనం జరిపేందుకు ప్రక్రియను ప్రారంభించారు. కాబట్టి ఏప్రిల్ 1నుంచి ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎక్కడా కనిపించదు. ఇప్పటివరకు ఫిన్ కేర్ బ్యాంక్ కు.. మొత్తం 59 లక్షల మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. ఇకపై వారంతా కూడా.. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సర్వీస్ లను ఉపయోగించుకోవాలి. ఇప్పటివరకు ఫిన్ కేర్ బ్యాంక్ లో ఎలాంటి సేవలు అయితే వినియోగించుకున్నారో.. ఇకపై అవన్నీ కూడా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కొనసాగించవచ్చు. అలాగే ఏప్రిల్ 1 కి ముందు ఫిన్‌కేర్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసుకున్న వారికి మెచ్యూరిటీ వరకు అవే కొనసాగుతాయని తెలియజేశారు.

ఇక షేర్స్ విషయానికొస్తే.. ఫిన్‌కేర్ బ్యాంక్ వాటాదారులకు..ఇక నుంచి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లను కేటాయిస్తారు. ఇప్పటివరకు ఫిన్ కేర్ బ్యాంక్ లో ఉన్న ప్రతి 2 వేల షేర్లకు.. ఇకపై ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 579 షేర్స్ వస్తాయి. ఈ బ్యాంక్ మాత్రమే కాకుండా.. ఇంకా రెండు నుంచి మూడు బ్యాంకుల విలీనంతో.. మొత్తం కోటి మందికి పైగా కస్టమర్లను, 43 వేల మందికి పైగా ఉద్యోగులను కూడా నియమించుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. 2017 ఏప్రిల్ లో, ఫిన్ కేర్ బ్యాంక్ కూడా అదే సంవత్సరం.. వారి వారి సర్వీస్ లను స్టార్ట్ చేసాయి. గతేడాది డిసెంబర్ 31 వరకు ఏయూ బ్యాంక్ ఆస్తుల విలువ రూ. 1.01 ట్రిలియన్లు ఉంది.. ఏయూ బ్యాంక్ షేరు ప్రస్తుతం రూ. 590.50 ఉంది.. ఇక ఇపుడు ఈ రెండు బ్యాంకులు కలిసి .. కష్టమర్స్ కు మెరుగైన సేవలు అందించనున్నాయి.