iDreamPost
android-app
ios-app

EPFO: PF గుడ్‌న్యూస్.. 3 రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు!

  • Published Jun 11, 2024 | 11:27 AM Updated Updated Jun 11, 2024 | 11:27 AM

ఉద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతూ వస్తోన్న ఈపీఎఫ్‌ఓ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. క్లెయిమ్‌ ప్రాసెసింగ్‌, డబ్బుల జమకు సంబంధించి అనేక కీలకాంశాల్లో మార్పులు చేసింది. ఆ వివరాలు..

ఉద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతూ వస్తోన్న ఈపీఎఫ్‌ఓ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. క్లెయిమ్‌ ప్రాసెసింగ్‌, డబ్బుల జమకు సంబంధించి అనేక కీలకాంశాల్లో మార్పులు చేసింది. ఆ వివరాలు..

  • Published Jun 11, 2024 | 11:27 AMUpdated Jun 11, 2024 | 11:27 AM
EPFO: PF గుడ్‌న్యూస్.. 3 రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు!

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారందరి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. వారి జీతాల నుంచి కొంత మొత్తం కట్‌ చేసి.. దాన్ని వారి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలో జమ చేస్తారు. ఆ మొత్తాన్ని వారు ఉద్యోగ విరమణ తర్వాత అయినా.. లేదా పని చేస్తున్నప్పుడు అయినా వినియోగించుకోవచ్చు. ఈ క్రమంలో పీఎఫ్‌ క్లెయిమ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం.. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) కీలక ప్రకటన చేసింది. దీని ద్వారా.. పీఎఫ్‌ డబ్బులు విత్‌ డ్రా చేసుకునేందుకు మార్గం సుగమమైంది. వివిధ కారణాలు చెప్పి క్లెయిమ్‌ తిరస్కరించే అవకాశం లేకుండా చేసింది.

కాకపోతే చందాదారుడి బ్యాంక్‌ అకౌంట్‌ వివరాల కేవైసీ ఆమోదించిన వారికే ఈ సదుపాయం లభిస్తుందని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. పీఎఫ్‌ ఎమౌంట్‌ క్లెయిమ్‌ చేసుకునే సమయంలో.. పీఎఫ్ సబ్‌స్క్రైబర్‌ అకౌంట్ వివరాల్ని.. బ్యాంక్, ఎన్‌పీసీఐ ఆధార్ కేవైసీ ద్వారా ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్స్‌కు చెక్, బ్యాంక్ పాస్ బుక్ జత చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అలానే మరో శుభవార్త కూడా చెప్పింది.

PF withdrawl

గత కొంతకాలంగా.. ఉద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతూ వస్తోన్న ఈపీఎఫ్‌ఓ.. ఈ సారి మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గతంలో పీఎఫ్ విత్‌డ్రా పరిమితి రూ. 50 వేలుగా ఉండగా.. ఇప్పుడు హౌసింగ్, మ్యారేజ్, మెడికల్ అవసరాల కోసం దీనిని రూ. లక్షకు పెంచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీన్ని ఆటో సెటిల్మెంట్ పరిధిలోకి తీసుకొచ్చింది. అంటే ఒకప్పటిలా 10-15 రోజుల సమయం పట్టదు. కేవలం 3 రోజుల్లోపే అకౌంట్లోకి డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకుంది. దీని వల్ల అత్యవసర సమయాల్లో డబ్బుకు ఎక్కువ రోజులు ఇబ్బంది పడే బాధ తప్పనుంది. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా మరణించిన వారి పీఎఫ్ డబ్బులు తీసుకునేందుకు.. ఆధార్ సీడింగ్ అవసరం లేదని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది. మృతి చెందిన వారి నుంచి పీఎఫ్ ఫిజికల్ క్లెయిమ్స్ ఆధార్ సీడింగ్ ద్వారా సాధ్యం కాదని ఈ సందర్భంగా ఈపీఎఫ్‌ఓ పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా కూడా పీఎఫ్ డబ్బులు వేగంగా పొందేందుకు వీలుగా ఈపీఎఫ్‌ఓ మార్పులు చేసింది. ఇందుకోసం మల్టీలొకేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇలాంటి సమయాల్లో క్లెయిమ్స్ ఆలస్యం జరగదని స్పష్టం చేసింది.