iDreamPost

PF విత్ డ్రా కోసం కొత్త రూల్.. ఆధార్ లేకపోయినా పర్లేదు!

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. పీఎఫ్ విత్ డ్రా కోసం ఈపీఎఫ్ ఓ కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇకపై ఆధార్ లేకపోయినా పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేయొచ్చు.

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. పీఎఫ్ విత్ డ్రా కోసం ఈపీఎఫ్ ఓ కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇకపై ఆధార్ లేకపోయినా పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేయొచ్చు.

PF విత్ డ్రా కోసం కొత్త రూల్.. ఆధార్ లేకపోయినా పర్లేదు!

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ఆయా సంస్థలు పీఎఫ్ సదుపాయాన్ని కల్పిస్తాయి. ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ప్రతి పీఎఫ్ ఖాతాదారుడికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ను కేటాయిస్తారు. ఉద్యోగుల భవిష్యత్ కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఇటీవల ఈపీఎఫ్ ఓ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ఖాతాదారులకు సులువుగా ఉండేలా రూల్స్ ను మారుస్తున్నది. ఈ క్రమంలో ఈపీఎఫ్ ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రా కోసం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఈ రూల్ తో మీరు ఆధార్ కార్డ్ లేకపోయినా డబ్బు విత్ డ్రా చేయొచ్చు.

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సబ్ స్క్రైబర్ల కోసం కీలక నిర్ణయం తీసుకున్నది. పీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి కలిగేలా కొత్త రూల్ ను తీసుకొచ్చింది. అయితే మరణించిన పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్ నుంచి డబ్బును విత్ డ్రా చేసేందుకు ఈ రూల్ ఉంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లు మరణించినప్పుడు వారి ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేయడానికి ఆధార్ ఉండాల్సిందే. ఆధార్ లేకపోతే ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేయడం కష్టతరంగా మారింది. దీంతో పీఎఫ్ లో డబ్బు ఉన్నప్పటికీ డ్రా చేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త రూల్ ను ప్రవేశపెట్టింది.

ఈపీఎఫ్ ఓ తీసుకొచ్చిన కొత్త రూల్ తో తమ సబ్‌స్క్రైబర్లు మరణిస్తే ఆధార్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేకుండా సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికోసం మరణించిన ఉద్యోగి పని చేస్తున్న సంస్థలో హెచ్ఆర్ విభాగం తమ ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లో తెలియపరచాల్సి ఉంటుంది. వివరాలు అన్నీ సరిచూసుకున్నాక ఈపీఎఫ్ఓ కార్యాలయం ఆఫీసర్ ఇన్‌చార్జీ (ఓఐసీ) అనుమతి ఇస్తే.. సదరు వ్యక్తి పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ మొదలవుతుంది.

ఆధార్ డేటా బేస్‌లో సమాచారం అసంపూర్ణంగా ఉన్నప్పుడే ఈ నిబంధన వర్తిస్తుందని ఈ నెల 17న జారీ చేసిన ప్రకటనలో ఈపీఎఫ్ఓ వెల్లడించింది. మరణించిన ఈపీఎఫ్ఓ ఖాతాదారుడికి ఆధార్ లేకపోయినా.. ఆ సబ్ స్క్రైబర్ నామినీ ఆధార్ సిస్టమ్‌లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడంతోపాటు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా మరణించిన వ్యక్తి ఆధార్ లేకపోయినా కూడా పీఎఫ్ విత్ డ్రా చేయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి