iDreamPost
android-app
ios-app

EPF బంపరాఫర్.. ఒక్క రూపాయి కట్టకుండానే రూ. 7 లక్షల వరకు

  • Published Aug 14, 2024 | 9:02 PM Updated Updated Aug 14, 2024 | 9:02 PM

EPF-Rs 7 Lakhs Insurance In EDLI: ఈపీఎఫ్ ఖాతాదారులకి శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండా.. రూ.7 లక్షల వరకు పొందవచ్చు. ఆ వివరాలు..

EPF-Rs 7 Lakhs Insurance In EDLI: ఈపీఎఫ్ ఖాతాదారులకి శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండా.. రూ.7 లక్షల వరకు పొందవచ్చు. ఆ వివరాలు..

  • Published Aug 14, 2024 | 9:02 PMUpdated Aug 14, 2024 | 9:02 PM
EPF బంపరాఫర్.. ఒక్క రూపాయి కట్టకుండానే రూ. 7 లక్షల వరకు

మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ అనే తేడా లేకుండా.. ఉద్యోగం చేసే వారందరు కచ్చితంగా ఉద్యోగుల భవిష్య నిధి పథకంలో చేరి ఉంటారు. చాలా కొద్ది కంపెనీల్లో మాత్రమే ఈ సదుపాయం ఉండదు. ఇక ఈఫీఎఫ్ఓలో చేరిన ఉద్యోగల నెలవారీ జీతం నుండి కొంత మొత్తం  కట్ చేసి.. ఆ మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాకు జమ చేస్తారు. ఇలా కట్ చేసిన డబ్బును ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాలు, ఉద్యోగ విరమణ తర్వత నెల వారి పెన్షన్ రూపంలో పొందవచ్చు.  ఉద్యోగి పదవీ విరమణ వరకు పీఎఫ్‌ ఖాతా నుండి డబ్బు తీసుకోకపోతే అతను రిటైర్మెంట్ తర్వాత కూడా పెన్షన్ పొందవచ్చు. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈపీఎఫ్ మెంబర్స్ సుమారు రూ.7 లక్షల వరకు పొందవచ్చు. ఇందుకోసం రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంతకు ఇది ఏ పథకం అంటే..

ఈపీఎఫ్ సభ్యులు.. రూపాయి కూడా చెల్లించకుండా.. సుమారు 7 లక్షల రూపాయల వరు బీమాను పొందవచ్చు. ఈ పథకం పేరే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ). మరి ఈ పథకం ప్రత్యేకతలు ఏంటి.. దీని కింద బీమాను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే..

ఉద్యోగుల భవిష్య నిధి పథకంలో సభ్యులకు రూ.7 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. దీని ప్రకారం, ఈ పథకం కింద సభ్యులు బీమాను పొందేందుకు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రాథమిక వేతనం రూ.15,000 కంటే ఎక్కువ ఉన్న వారికి.. ఈ పథకం కింద గరిష్టంగా రూ.6 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. గత 12 నెలల ఈపీఎఫ్‌ సభ్యుల సగటు నెలసరి జీతం కంటే బీమా మొత్తం 35 రెట్లు ఎక్కువ. అంటే గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా అందుతుంది. ఇక గతేడాది ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో రూ.1,15,000గా ఉన్న బోనస్ మొత్తాన్ని రూ.1,75,000కు పెంచడం గమనార్హం.

బీమాను ఎలా క్లెయిమ్ చేయాలంటే..

ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే. అతని నామినీ లేదా చట్టపరమైన వారసుడు ఈ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ఇందుకోసం సభ్యుని నామినీ వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. బహుశా నామినీ వయస్సు 18 కంటే తక్కువ ఉంటే, అతని తల్లిదండ్రులు డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. ఈ మొత్తాన్ని పొందడానికి డెత్ సర్టిఫికేట్, వారసత్వ ధృవీకరణ పత్రం వంటి పత్రాలు తప్పనిసరి.