iDreamPost

‘ఎక్స్’ యూజర్స్‌కి షాకిచ్చిన ఎలాన్ మస్క్.. దానికి కూడా సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే!

Big Shock To X USers: తాజాగా ఎలాన్ మస్క్ ఎక్స్ ఖాతాదారులకు షాకిచ్చారు. ఇప్పటికే పలు నిబంధనలు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్న ఎలాన్ మస్క్.. తాజాగా మరో బెనిఫిట్ పొందాలంటే కూడా ప్రతి నెలా ఫీజు చెల్లించాలని వెల్లడించారు.

Big Shock To X USers: తాజాగా ఎలాన్ మస్క్ ఎక్స్ ఖాతాదారులకు షాకిచ్చారు. ఇప్పటికే పలు నిబంధనలు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్న ఎలాన్ మస్క్.. తాజాగా మరో బెనిఫిట్ పొందాలంటే కూడా ప్రతి నెలా ఫీజు చెల్లించాలని వెల్లడించారు.

‘ఎక్స్’ యూజర్స్‌కి షాకిచ్చిన ఎలాన్ మస్క్.. దానికి కూడా సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే!

ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ టేకోవర్ చేసిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ట్విట్టర్  కాస్తా ఎక్స్ అయ్యింది. ఆ తర్వాత సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ అని.. వెరిఫైడ్ బ్యాడ్జ్ కోసం నెల నెలా డబ్బులు చెల్లించాలని ఇలా కొత్త నిబంధనలు వచ్చాయి. ఇలా ఎలాన్ మస్క్ ఎక్స్ యూజర్స్ కి వరుసగా స్ట్రోకుల మీద స్ట్రోకులు ఇస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి షాకిచ్చారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ‘ఎక్స్’ సోషల్ మీడియా మాధ్యమం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రీమియం సబ్ స్క్రైబర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ఎక్స్. ఇందులో భాగంగా త్వరలో కొత్త మార్పును తీసుకొస్తున్నట్లు ఎక్స్ కంపెనీ ప్రకటించింది. ఇక నుంచి ఎక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ని ప్రారంభించాలంటే యూజర్లు ఖచ్చితంగా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ చెల్లించాలని  పేర్కొంది.

ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వచ్చు. కానీ ఎక్స్ మాత్రం ఈ సోషల్ మీడియా యాప్స్ కి విరుద్ధంగా లైవ్ స్ట్రీమింగ్ కోసం డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమైంది. అంటే ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారు మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి అర్హులుగా పరిగణించబడతారు. అయితే ఈ రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే విషయాన్ని ఇంకా కంపెనీ వెల్లడించలేదు. కాగా ఎక్స్ ఖాతాలో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలంటే బేసిక్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ధర రూ. 215 నుంచి ప్రారంభమవుతుందని ఎక్స్ తెలిపింది.

మర్షియల్ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం పడిపోతున్నట్లు పలు నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో సబ్ స్క్రైబర్స్ ద్వారా ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎలాన్ మస్క్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే లైవ్ స్ట్రీమింగ్ కోసం తీసుకొచ్చిన కొత్త నిబంధన. ఇదిలా ఉంటే మైక్రో బ్లాగింగ్ సైట్ లో కొత్త వినియోగదారులు చేసే పోస్ట్ తో పాటు లైకులు, రిప్లైలు, బుక్ మార్క్ లు చేయాలంటే కూడా డబ్బులు చెల్లించాల్సి ఉండవచ్చునని మస్క్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కొత్త యూజర్లకు ఈ ఫీజులు వసూలు చేస్తుంది. అయితే పర్సన్ ని ఫాలో అవ్వడం, బ్రౌజింగ్ మాత్రం ఉచితంగా చేయవచ్చునని కంపెనీ పేర్కొంది. ఒకవేళ మస్క్  మూడ్ బాగోపోతే ఫ్యూచర్ లో బ్రౌజింగ్ కి, ఫాలో చేయడానికి కూడా ఫీజు వసూలు చేస్తాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి