iDreamPost
android-app
ios-app

EV బైక్.. పెట్రోల్ బైక్.. ఏది కొంటే మంచిది?

ప్రస్తుతం బైక్ అనేది ప్రతి ఒక్కరికి అవసరంగా మారిపోయింది. అయితే ఎప్పుడూ ఒక ప్రశ్న అందరినీ తొలుస్తూ ఉంటుంది. ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేస్తే మంచిదా? పెట్రోల్ బైక్ కొంటే మంచిదా?

ప్రస్తుతం బైక్ అనేది ప్రతి ఒక్కరికి అవసరంగా మారిపోయింది. అయితే ఎప్పుడూ ఒక ప్రశ్న అందరినీ తొలుస్తూ ఉంటుంది. ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేస్తే మంచిదా? పెట్రోల్ బైక్ కొంటే మంచిదా?

EV బైక్.. పెట్రోల్ బైక్.. ఏది కొంటే మంచిది?

ప్రస్తుత రోజుల్లో ద్విచక్రవాహనం అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. మన నిత్య జీవితంలో ఎక్కడికైనా వెళ్లాలి అన్నా, ఏదైనా పని చేయాలి అన్నా కూడా బైక్ అనేది అవసరంగా మారిపోయింది. యూత్ కి అయితే బైక్ అనేది అవసరానికి మించి ఎమోషన్ లా మారిపోయింది. ఈరోజుల్లో దాదాపుగా ఇంటికి ఒక బైక్, స్కూటీ ఉండటం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు పెట్రోల్ బైకులు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ బైకుల హవా కూడా ఎక్కువ అయిపోయింది. చాలావరకు సిటీల్లో ఎలక్ట్రిక్ బైకులనే కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలా మందికి కొత్త బైక్ కొనుగోలు చేసే సమయంలో ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఎలక్ట్రిక్ బైక్ కొంటే మంచిదా? పెట్రోల్ బైక్ కొంటే మంచిదా? అయితే ఈవీ బైక్, పెట్రోల్ బైక్ ల్లో ఏది కొంటే మంచిదో చూద్దాం.

పెట్రోల్ బైక్, ఈవీ బైక్ ఈ రెండింటిలో అడ్వాటేజెస్, ఛాలెంజెస్ రెండూ ఉన్నాయి. ముందుగా అడ్వాంటేజస్ గురించి మాట్లాడుకుంటే.. స్టైల్, లుక్స్ పరంగా పెట్రోల్ బైకుల్లో ఎన్నో మోడల్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెట్రోల్ బైకు వల్ల మీకు మంచి స్పీడ్, పికప్ లభిస్తుందని చెబుతారు. అయితే ఈ ఆప్షన్స్ ఈవీల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ లో కూడా వస్తున్నాయి. స్కూటీలుగా మాత్రమే కాకుండా.. ఈవీలు ఇప్పుడు బైకుల మోడల్స్ కూడా వస్తున్నాయి. ఇంక పికప్ విషయంలో ఈవీలు కూడా పెట్రోల్ ఇంజిన్లతో పోటీ పడుతున్నాయి. కొన్నిం కంపెనీలు ఈవీలను 125సీసీ నుంచి 200 సీసీ వరకు కూడా తయారు చేస్తున్నాయి. కాబట్టి పికప్, స్టైల్, లుక్స్ విషయంలో పెట్రోల్, ఈవీ రెండూ సమానంగా ఉన్నాయనే చెప్పాలి.

ఇంక ధర విషయంలో మాత్రం పెట్రోల్ బైకులు కాస్త ముందుంటాయి. ఎందుకంటే మంచి లుక్స్ తో ఒక మంచి ఈవీ బైకు మీరు కొనాలి అంటే దాని ధర దగ్గర దగ్గర రూ.2 లక్షల వరకు ఉంటుంది. అదే పెట్రోల్ బైక్ లో మీరు అంతకన్నా తక్కువ ధరలో మంచి బైకును కొనుగోలు చేయచ్చు. మెయిన్టినెన్స్ విషయంలో ఈవీ బైకువైపు మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే మీకు ఎలక్ట్రిక్ బైకుకు రెండు నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ విషయంలో మాత్రం మీకు పెట్రోల్ బైకు కొంచం భారంగా మారుతుంది. కానీ, ఈవీ బైకు మాత్రం అలాకాదు. కానీ, ఈవీ బైకులు రిపేర్ రానంత వరకే మంచిగా ఉంటాయి. మీకు ఎలక్ట్రిక్ బైకుల్లో బ్యాటరీలకు మూడేళ్ల వారంటీ ఉంటుంది. ఆలోపు ఏదైనా సమస్య వస్తే కంపెనీనే వాటిని రీప్లేస్ చేస్తుంది.

బ్యాటరీ వారెంటీ పూర్తైన తర్వాత మీ బైక్ బ్యాటరీలకు ఎలాంటి గ్యారెంటీ ఉండదు. ఆ తర్వాత మీ బైక్ బ్యాటరీలు చెడిపోతే మీరు ఇంతకాలం సేవ్ చేసిన మనీ మొత్తం ఒకేసారి పోగొట్టుకున్నవాళ్లు అవుతారు. ఎందుకంటే మీరు బైక్ బ్యాటరినీ కొనుగోలు చేయాలి అంటే.. మళ్లీ బైక్ కొన్నంత పని అవుతుంది. 3 కిలోవాట్ అవర్ కెపాసిటీ బ్యాటరీ కొనుగోలు చేయాలి అంటే మీకు దాదాపు రూ.40 వేల నుంచి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మూడేళ్లలో మీరు సేవ్ చేసిన మొత్తం కేవలం బ్యాటరీ కోసమే ఖర్చుచేయాలి. అలాగే మీరు ఏదైనా అర్జంట్ పని మీద బయటకు వెళ్లే సమయంలో బైక్ లో ఛార్జింగ్ లేకపోతే మీ పనిని వాయిదా వేసుకోవాలి. హడావుడిగా బయటకు వెళ్లే సమయంలో బైక్ లో ఛార్జింగ్ అయిపోతే మీరు రోడ్డుమీద సహాయం కోసం ఎదురుచూడాల్సిందే.

ఇలా ఈవీ బైకుల వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. అయితే పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ బైకులను వాడటం ఏంతైనా అవసరం. కానీ, వాటిని రెగ్యులర్ బైకుల్లా వాడాలి అంటే అందుకు తగిన కొన్ని సదుపాయాలు సిటీల్లో అందుబాటులో రావాలి. బైకుల తయారీలో కూడా కంపెనీలు మరిన్ని మార్పులు తీసుకురావాలి. ఇప్పటికే సిటీల్లో చాలా మంది ఎలక్ట్రిక్ బైకులు వాడుతున్నారు. కానీ, వాళ్లు కొన్ని సమస్యలను అయితే ఎదుర్కుంటున్నారు. ప్రస్తుత పరిస్థుతుల్లో మాత్రం పెట్రోల్ బైకులు మీకు సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పచ్చు. మరి.. మీరు ఏ బైక్ వాడుతున్నారు? ఎలక్ట్రిక్ బైక్ కొనాలి అనే ఉద్దేశం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.