Keerthi
Egg Price: ఈ మధ్య కాలంలో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వాటితో పాటు కోడిగుడ్డు ధరలు కూడా కొండెక్కి కూర్చుంది. అయితే గుడ్లు ధరలు కూడా భారీగా పెరగడానికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Egg Price: ఈ మధ్య కాలంలో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వాటితో పాటు కోడిగుడ్డు ధరలు కూడా కొండెక్కి కూర్చుంది. అయితే గుడ్లు ధరలు కూడా భారీగా పెరగడానికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Keerthi
ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నా విషయం తెలిసిందే. అసలు మార్కెట్ కి వెళ్లి ఏ వస్తువు కొనాలన్నా సామాన్యులు భయపడిపోతున్నారు. ముఖ్యంగా.. పప్పు, నూనె, గ్యాస్, కూరగాయలతో పాటు మాంసం ధరలు కూడా సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవలే నగరంలో చికెన్ ధరలు బారీగా పెరుగిపోయినా తరుణంలో.. వాటితో పాటు కోడిగుడ్డు ధర కూడా కొండెక్కి కూర్చుంది. ఇదిలా ఉంటే.. గత నెల రోజులుగా గుడ్డు ధరలు క్రమంగా పెరుగుఊ వస్తున్నాయి. అయితే గుడ్లు ధరలు కూడా భారీగా పెరగడానికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో తెలంగాణలోని చికెన్ ధరతో పాటు కోడిగుడ్డు ధర కూడా కొండెక్కి కూర్చుంది. కాగా, ప్రస్తుతం కేజీ చికెన్ రూ. 270- 300 పలుకుతుండగా.. గుడ్డు ధర కూడా విపరీతంగా పెరిగింది. అయితే కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఫాం వద్ద గుడ్డు ధర సుమారు 90 పైసలు పెరిగినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇక గత నెల ఏప్రిల్ 13న గుడ్డు ధర రూ. 4.45 పైసలు ఉండగా.. ప్రస్తుతం రూ.5.35కు చేరింది. ఈ క్రమంలోనే రిటైల్ మార్కెట్లో చిల్లరగా ఒక్క గుడ్డును రూ.6.50 నుంచి రూ. 7 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు.
అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ అధిక పోషకాలుండే ఈ గుడ్డును నిత్యం ఆహారంలో తీసుకుంటారనే విషయం తెలిసిందే. కానీ, ఇలా ఒక్కసారిగా గుడ్డు ధరలు కూడా పెరిగిపోవడంతో.. వాటిని కొనలేని, తిదనలేని పరిస్థితి నెలకొంది. ఇకపోతే ఒక్కసారిగా గుడ్లు ధర పెరిగిపోవడానికి కారణం.. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతోనే గుడ్డు ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పైగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా గుడ్లు పెట్టే లేయర్ కోళ్ల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో మార్కెట్‌లో గుడ్ల కొరత ఏర్పడుతుందని సమాచారం.
తద్వారా గుడ్ల ఉత్పత్తి తగ్గుతుందని, దాని ప్రభావమే ప్రస్తుతం మార్కెట్‌పై పడింది. దీంతో గుడ్ల కొరత ఏర్పడటంతో పాటు ధర పెరిగిందని అంటున్నారు. మరొ పక్క గుడ్ల ధరలు తగ్గాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందేనని ఫౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణం చల్లబడి లేయర్ కోళ్లు చనిపోకుండా ఉంటే.. గుడ్ల ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నారు. ఆ తర్వాత సప్లయ్ పెరిగి ధరలు అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు. మరి, చికెన్ ధరతో పాటు కోడిగుడ్డు ధరలు కూడా పెరగడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.