nagidream
Will Mobile Tariff Plans Again Increase Due To Union Budget 2024?: ఇటీవల టెలికాం కంపెనీలు టారిఫ్ ప్లాన్స్ ని భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూనియన్ బడ్జెట్ 2024లో భాగంగా ఈ రీఛార్జ్ ధరలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తుందన్న వార్తలు ఇప్పుడు సామాన్యులను షాక్ కి గురి చేస్తున్నాయి.
Will Mobile Tariff Plans Again Increase Due To Union Budget 2024?: ఇటీవల టెలికాం కంపెనీలు టారిఫ్ ప్లాన్స్ ని భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూనియన్ బడ్జెట్ 2024లో భాగంగా ఈ రీఛార్జ్ ధరలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తుందన్న వార్తలు ఇప్పుడు సామాన్యులను షాక్ కి గురి చేస్తున్నాయి.
nagidream
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా యూనియన్ బడ్జెట్ 2024పై చర్చ జరుగుతోంది. ఈ బడ్జెట్ కోసం మధ్యతరగతి ప్రజల నుంచి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇలా ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బడ్జెట్ వల్ల ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏ వ్యాపార రంగానికి ప్రయోజనం చేకూరుతుంది? ఎవరికి భారం పడుతుంది? వంటి విషయాలు తెలుస్తాయి. ఈ క్రమంలో బడ్జెట్ ప్రభావం మొబైల్ టారిఫ్ ధరలపై పడుతుందా? ఈ ప్రభావం వల్ల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు తగ్గుతాయా? లేక పెరుగుతాయా? అన్న ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా నెట్వర్క్ లు టారిఫ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. ఇప్పుడు మరలా బడ్జెట్ ప్రభావంతో ధరలు పెరిగితే ఏంటన్న ప్రశ్న చాలా మందిని వెంటాడుతోంది. మరి బడ్జెట్ ప్రభావం కారణంగా రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?
కేంద్రం టెలికాం ఎక్విప్ మెంట్ పై పన్నును 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విధిస్తున్న పన్ను 10 శాతం ఉండగా.. దాన్ని 15 శాతానికి పెంచింది. దీంతో టెలికాం కంపెనీల షేర్లు పడిపోయాయి. మొబైల్ పరికరాల భాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించిన కేంద్రం.. టెలికాం ఎక్విప్ మెంట్ పై మాత్రం 10 శాతంగా ఉన్న పన్నును 15 శాతానికి పెంచింది. దీంతో టెలికాం కంపెనీలు ఈ భారాన్ని తమ వినియోగదారులపై వేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో రీఛార్జ్ ప్లాన్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి మరో కే కారణం.. ఆయా టెలికాం కంపెనీలు 5జీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి కావాల్సిన టెలికాం ఎక్విప్ మెంట్ కోసం భారీగానే ఖర్చు చేశాయి. ఇలాంటి తరుణంలో టెలికాం ఎక్విప్ మెంట్ పై 15 శాతానికి పన్ను పెంచింది కేంద్రం.
దీంతో ఈ భారాన్ని మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపు రూపంలో యూజర్లపై వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూలై నెలలో ఆయా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచేసి షాక్ కి గురి చేశాయి. ఆ దెబ్బ నుంచి కోలుకునేలోపే పిడుగులాంటి వార్త మరోసారి యూజర్లను కలవరపెడుతుంది. 2024 బడ్జెట్ లో మొబైల్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో మొబైల్ ఫోన్ల ధరలు తగ్గుతాయని సంతోషించే లోపే రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయా అన్న వార్త కలవరపాటుకు గురి చేస్తుంది. 5జీ విస్తరణ కోసమే ధరలను పెంచామని టెలికాం కంపెనీలు చెప్పాయి. దీంతో వినియోగదారులు 15 నుంచి 25 శాతం అదనంగా రీఛార్జ్ ధరలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు మరోసారి టెలికాం ఎక్విప్ మెంట్ పై పన్నును పెంచడంతో మరోసారి యూజర్లపై భారం పడనుందని నిపుణులు చెబుతున్నారు.