iDreamPost
android-app
ios-app

కారు నడుపుతున్న వారికి అలర్ట్.. ఆ పత్రాలు లేకుంటే 10 వేల ఫైన్!

మీరు రోడ్డుపై కారును నడుపుతున్నారా? డ్రైవింగ్ చేసే సమయంలో ఆ పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్నారా? అయితే మీకు భారీ జరిమానా తప్పదు. ఏకంగా రూ. 10 వేల ఫైన్ పడుతుంది.

మీరు రోడ్డుపై కారును నడుపుతున్నారా? డ్రైవింగ్ చేసే సమయంలో ఆ పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్నారా? అయితే మీకు భారీ జరిమానా తప్పదు. ఏకంగా రూ. 10 వేల ఫైన్ పడుతుంది.

కారు నడుపుతున్న వారికి అలర్ట్.. ఆ పత్రాలు లేకుంటే 10 వేల ఫైన్!

ప్రస్తుత రోజుల్లో కార్ల వినియోగం ఎక్కువైపోయింది. కార్లను సొంత అవసరాలకు వినియోగించుకునే వారు కొంతమందైతే.. మరికొంత మంది కార్లు కొనుగోలు చేసి క్యాబ్ సర్వీసుల ద్వారా ఉపాధిపొందుతున్నారు. అయితే కారు నడపాలంటే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం లైసెన్స్ తో పాటు అన్ని పత్రాలను కలిగి ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఏ ఒక్క డాక్యూమెంట్ లేకున్నా ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానా విధిస్తారు. వాహనతనీఖీల్లో భాగంగా తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసులుకు కారుకు సంబంధించిన అన్ని పత్రాలను చూపించాల్సి ఉంటుంది. లేదంటే కనీసం రూ. 10 వేల వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది. మరి మీరు కారు నడుపుతున్న సమయంలో ఆ పత్రాలు లేకుండా డ్రైవ్ చేస్తున్నారా? అయితే 10 వేల ఫైన్ పడొచ్చు.

మోటార్ వాహనాల చట్టం ప్రకారం కారు నడిపే వ్యక్తి ఖచ్చితంగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇది గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. అనుకోకుండా ప్రమాదాల భారినపడినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. ఆర్‌సీ కారు రిజిస్ట్రేషన్ నంబర్, యజమాని పేరు, తయారీ రకం, కారు రకం, కారు తయారు చేసిన సంవత్సరం, రిజిస్ట్రేషన్ తేదీ, గడువు తేదీ, ఛాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ మొదలైన సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే ఆర్సీ కీలకంగా మారుతుంది.

కారు నడుపుతున్నట్లైతే.. వాహనానికి సంబంధించి ఖచ్చితంగా బీమా పాలసీని కలిగి ఉండాలి. ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు బీమా పాలసీ ఉన్నట్లైతే ఆర్థిక కష్టాల నుంచి బయటపడొచ్చు. ఇక ముఖ్యంగా కారు కు సంబంధించి పొల్యూషన్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. ఈ సర్టిఫికేట్ కారు నిర్దిష్ట వ్యవధిలో కార్బన్‌ను విడుదల చేస్తుందని నిరూపిస్తుంది. ఒక వేళ మీ వద్ద పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే 10 వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. లేదా ట్రాఫిక్ పోలీసులు రెండు కూడా విధించొచ్చు. ఇటీవల ప్రమాదాల నివారణకు, వాహనదారుల సేఫ్టీయే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ను కఠినం చేసి అమలు చేస్తున్నారు. మరి మీరు సురక్షితమైన ప్రయాణం చేయాలంటే, జరిమానాల భారిన పడకూడదంటే కారుకు సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాల్సిందే.