iDreamPost
android-app
ios-app

Petrol కొట్టించేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త ప్రమాదంలో పడతారు!

  • Published Nov 02, 2024 | 3:54 PM Updated Updated Nov 02, 2024 | 3:54 PM

Fuel: పెట్రోల్ కొట్టించేటప్పుడు చాలా మంది కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటి వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది.

Fuel: పెట్రోల్ కొట్టించేటప్పుడు చాలా మంది కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటి వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది.

Petrol కొట్టించేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త ప్రమాదంలో పడతారు!

పెట్రోల్ లేకపోతే వాహనాలు పని చెయ్యవు. పెట్రోల్ కొట్టించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోపోతే కచ్చితంగా చాలా నష్టపోతారు. చాలా వాహనాలు కూడా రిపైర్ కి షెడ్డుకి పోతుంటాయి. అందుకు పెట్రోల్ కొట్టించేటప్పుడు చేసే కొన్ని సాధారణ తప్పులు కూడా కారణం అవుతాయి. ఈ తప్పులు కచ్చితంగా మీ కారు, బైక్‌ ఇంజిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి. పెట్రోల్ విషయంలో చాలామంది తమకు తెలియకుండానే ఎంతో అజాగ్రత్తగా ఉంటారు. బండిలో పెట్రోల్ అయిపోయిందా.. పెట్రోల్ బంక్ కి వెళ్లామా .. పెట్రోల్ కొట్టించామా.. వాహనాన్ని స్పీడ్ గా నడిపామా.. ఇవే చూసుకుంటారు తప్ప.. ఆ పెట్రోల్ ఎలా కొట్టించాలో తెలుసుకోరు? ఇక పెట్రోల్ ఎలా కొట్టించాలి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

ఒక వాహనానికి ఇంజిన్ అనేది గుండె లాంటిది. కాబట్టి ఇంజిన్ విషయంలో సరిగ్గా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మనలో చాలా మంది కూడా పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయ్యే దాకా పెట్రోల్ కొట్టించరు. కానీ పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అయ్యే దాకా ఉంచడం చాలా ప్రమాదం. ఎందుకంటే పెట్రోల్‌-డీజిల్‌ ట్యాంక్‌లో మురికి ఉంటుంది. పెట్రోల్ అయిపోయిన తర్వాత వేస్ట్ పదార్ధాలు అన్నీ వాహనానికి పెట్రోల్ సరఫరా అయ్యే పంప్‌ ద్వారా ఇంజిన్‌లోకి వెళతాయి. ఆ వేస్ట్ వలన ఫిల్టర్‌ మూసుకుపోతుంది. దీని వల్ల వాహనంలో సమస్యలు తలెత్తె ప్రమాదం ఉంది. ఒక్కోసారి దీని వల్ల వాహనం సరిగ్గా కంట్రోల్ కాకపోవచ్చు. అప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలా ఎప్పుడు పెట్రోల్ కొట్టించ వద్దు. ఇక ఇప్పుడు చెప్పేది అత్యంత ముఖ్యమైనది. అదే ఫ్యూయల్ క్వాలిటీ. కొంత మంది పెట్రోల్ క్వాలిటీగా లేని చిన్న చిన్న బంక్స్ నుంచి పెట్రోల్ కొట్టిస్తూ ఉంటారు. కానీ అలాంటి పెట్రోల్ వాహనానికి అస్సలు మంచిది కాదు. పెట్రోల్ క్వాలిటీగా లేకపోతే అది ఇంజిన్‌లో పేరుకుపోతుంది. అప్పుడు వెహికల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు. కాబట్టి ఎప్పుడైనా కానీ వెహికల్ కి క్వాలిటి పెట్రోల్ మాత్రమే కొట్టించాలి.

ఇక పెట్రోల్ కొట్టిచ్చిన తర్వాత కచ్చితంగా ఫ్యూయల్ క్యాప్ సరిగ్గా అమర్చారా? లేదా అని జాగ్రత్తగా చెక్ చేయాలి. లేకపోతే గాలి, తేమ ట్యాంక్‌లోకి వెళ్ళిపోతుంది. దీని కారణంగా, పెట్రోల్‌ లో నీటి ఆవిరి కలుస్తుంది. అందువల్ల పెట్రోల్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇది ఇంజిన్ పనితీరును తగ్గిస్తుంది. కొంత మంది పెట్రోల్‌ ట్యాంక్‌ని ఫుల్ గా ఉంచుకునేందుకు పెట్రోల్‌ పంపులో పెట్రోల్‌ ఫిల్ చేస్తూనే ఉంటారు. దీని వల్ల ఓవర్‌ఫిల్లింగ్‌ అవుతుంది. దీంతో ఫ్యూయల్ వెంట్ సిస్టమ్‌లో లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఇంజిన్‌ను దెబ్బ తీస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.చాలా మంది కూడా హడావుడిగా పెట్రోల్ ఫిల్ చేసేటప్పుడు ఇంజన్ ని ఆన్ లో ఉంచుతుంటారు. ఇలా చేయడం చాలా డేంజర్. ఇది మైలేజీని, ఇంజిన్ పనితీరును తగ్గిస్తుంది. అలాగే కొన్ని సార్లు ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంజిన్ ఆన్ లో ఉంచి పెట్రోల్ కొట్టించకూడదు. కాబట్టి మీ వెహికల్ కి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.