దీపావళి పండగ సందర్బంగా అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి వాహన కంపెనీలు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ. 35 వేల ఆఫర్ ప్రకటించింది ప్రముఖ కంపెనీ. ఈ ఆఫర్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి పండగ సందర్బంగా అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి వాహన కంపెనీలు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ. 35 వేల ఆఫర్ ప్రకటించింది ప్రముఖ కంపెనీ. ఈ ఆఫర్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పండగ సీజన్ ను పురస్కరించుకుని కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్నాయి ప్రముఖ కంపెనీలు. ఇలా ఆఫర్లను ప్రకటించడంలో ముందున్నాయి వాహన కంపెనీలు. తమ కంపెనీ కార్లు, బైక్ లపై భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించి.. కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి వాహన తయారీ సంస్థలు. ఇక దీపావళి పండగ సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఊహించని ఆఫర్లు ఇస్తోంది ప్రముఖ వాహన కంపెనీ హీరో మోటోకార్ప్. తమ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ దీపావళికి అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థల ద్వారా డిస్కౌంట్లను ప్రకటించి.. విక్రయిస్తోంది. మరి ఈ ఆఫర్ల గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఈ దీపావళికి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని మీరు భావిస్తున్నారా? అయితే మీకోసమే ఈ కథనం. ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ఫ్ దీపావళికి అదిరిపోయే ఆఫర్లతో ముందుకు వచ్చింది. కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు ప్రకటించి.. ఆశ్చర్యపరిచింది. హీరో మోటోకార్ఫ్ తన ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ1 పై ఏకంగా రూ. 35,500 డిస్కౌంట్ తో అందిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అయిన ఫ్లిప్ కార్డు, అమెజాన్ లలో ఈ డిస్కౌంట్ ధరలతో స్కూటర్లను విక్రయిస్తోంది. అయితే ఈ ఆఫర్ నవంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా.. హీరో విడా వి1 ఈవీపై రూ. 30వేల వరకు తగ్గింపు ఫ్లిప్ కార్డులో బుక్ చేయడం ద్వారా పొందొచ్చని తెలిపింది.
ఇక ఫ్లిక్ కార్డులో బుక్ చేస్తే… విడా వీ1 స్కూటర్ మీకు రూ.1.11 లక్షలకే లభిస్తుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఇక మీరు అమెజాన్ లో బుక్ చేస్తే.. రూ. 35,500 తగ్గింపుతో రూ. 94,600కే మీకు ఈ స్కూటర్ వస్తుంది. కాగా.. ఫేమ్-2 సబ్సిడీ తర్వాత, ఇతర క్యాష్ బెనిఫిట్స్ తర్వాత మీకు ఈ ధరకు ఈవీ లభిస్తుంది. ఇదిలా ఉండగా.. హీరో విడా వీ1 స్కూటర్ ధర రూ.1,46 లక్షల నుంచి(ఢిల్లీ ఎక్స్ షోరూమ్) ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ ప్లస్, ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 110 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. అలాగే ఎకో, రైడ్, స్పోర్ట్స్, కంఫర్ట్ అనే నాలుగు రైడింగ్ మోడ్ లు ఇందులో ఉన్నాయి. రెండు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తుంది. దీని కారణంగా, స్కూటర్‌ను ఒకే బ్యాటరీతో కూడా నడపవచ్చు. మరి ఆధునిక ఫీచర్లతో.. భారీ డిస్కౌంట్లో లభిస్తున్న విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.